భారత్ లో కరోనా కొనసాగుతోంది. తాజాగా 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 200కు పైగా నమోదైంది. క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ రెండు లక్షలకు చేరువవుతుండటం ఊరటనిస్తోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
కొత్తగా 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,823 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే.. 1,500కు పైగా కేసులు ఎక్కువయ్యాయి. 22,844 మంది కోలుకున్నారు. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653గా ఉంది. 4,51,189 మంది వైరస్ కు బలయ్యారు.
కొవిడ్ వ్యాక్సిన్ తో వేరియంట్ల నుంచి రక్షణ
కొవిడ్ టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నాయని.. తాజా పరిశోధనలో తెలిసింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే కొవిడ్‌కు గురైన వారిలోనైతే, కరోనాకు వ్యతిరేకంగా అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉందని తేలింది. ఎల్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ‘నేచర్’ పత్రిక ప్రచురించింది.
మనం టీకా తీసుకున్నాక.. ఒకవేళ కరోనా వస్తే వాటిని బ్రేక్ త్రూ కేసులు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై పరిశోధనలు జరిగాయి. వ్యాక్సిన్ల పనితీరేంటి అనే సందేహాలు మెుదలయ్యాయి. కిందటి నవంబరులో అమెరికాకు చెందిన 40 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. వారికి మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇచ్చారు. మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన తర్వాత కూడా వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు.
ఆ రక్త నమూనాలను డెల్టా సహా 16 రకాల వేరియంట్లపై ప్రయోగించి, యాంటీబాడీల స్థాయిని, టి-కణాల ప్రతిస్పందనను గమనించారు. వైరస్ వేరియంట్, వ్యక్తిని బట్టి రోగనిరోధక స్పందనలు, యాంటీబాడీల స్థాయి ఆధారపడి ఉంటున్నాయి. అందరిలోనూ ఇవి ఒకేలా ఉండటం లేదు. కానీ, టీకాలు తీసుకున్నవారిలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు చాలారకాల వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడుతున్నాయి.. అని పరిశోధనలో తేలింది.
Also Read: Pornhub Traffic Surged: ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు
Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి