అన్నం తినగానే అది అరిగేందుకు చాలా మంది అరటి పండు లాగించేస్తారు. మరికొంతమంది రాత్రి పూట పడుకునే ముందు అరటి పండు తిని పడుకుంటారు. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పోషకాలు ఎంతో సాయపడతాయి. అయితే చాలా మందికి అరటి పండు తినడంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా భోజనం తర్వాత అరటి పండును తినొచ్చా? తింటే ఏమైనా నష్టమా? అని అనుమానం. ఈ అనుమానల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. 


Also Read: Pregnant Women: ప్రెగ్నెంట్స్ ఈ ఆసనాలు చేస్తే చాలా మంచిదట... 90 నిమిషాల యోగా ఆరోగ్యవంతం


అరటిపండును తినేందుకు ఉదయం 8 నుంచి 11 గంటలు మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. అదే మధ్యాహ్న సమయంలో అయితే భోజనం చేసిన తర్వాత తినొచ్చు. కానీ, సాయంత్రం, రాత్రి సమయాల్లో మాత్రం అరటి పండ్లను తినకూడదట. సాయంత్రం, రాత్రి తినడం వల్ల శరీరంలో మ్యూకస్ తయారవుతుంది. ఇది శ్వాస కోశ సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి అరటి పండ్లను తినేవారు సాయంత్రం, రాత్రి తినొద్దు. బాగా పండిన అరటి పండ్లను మధుమేహ రోగులు తినకపోవడమే మంచింది.


Also Read: Sompu Tea: సోంపుతో ఎప్పుడైనా టీ చేయడం ట్రై చేశారా? సోంపు టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది


అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి ఇది ఉపకరిస్తుంది. వారానికి 2-3 అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. రీరానికి అవసరమయ్యే మాంగనీసులో 13 శాతం అరటి పండు సమకూరుస్తుంది.ఈ పండ్లలో విటమిన్-C కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అంతర్గత, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటి పండు ఉపయోగపడుతుంది. అల్సర్స్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అల్సర్‌తో బాధపడుతున్నవారు ఎలాంటి సంకోచం లేకుండా అరటి పండును తినవచ్చు.


ఆస్తమా తగ్గుతుంది
రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించి, క్యానర్స్‌తో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పడటాన్ని అడ్డుకుని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అరటి పండ్ల వల్ల చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. శఅరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలతోపాటు మొటిమలు, మచ్చలను సైతం దూరం చేసుకోవచ్చు. 


బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా అరటిపండు తినండి. అరటి పండులో కొవ్వు ఉండదు. అలాగే, క్యాలరీలు కూడా చాలా తక్కువ.  ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గడానికి అరటి పండ్లు ఉపకరిస్తాయి. జిమ్‌లో కసరత్తులు చేసేవారు అరటి పండ్లు తిన్నట్లయితే కండరాలకు ఉపశమనం లభిస్తుంది.


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి