'యశోద'కు మొదటి రోజు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. విమర్శలు, సామాన్య ప్రేక్షకులు, సోషల్ మీడియాలో నెటిజన్లు సమంత సినిమా బావుందన్నారు. విడుదల ముందు సినిమాపై ఉన్న క్రేజ్ థియేటర్ల దగ్గర స్పష్టంగా కనిపించింది. ఏపీ, తెలంగాణలో కొన్ని థియేటర్ల దగ్గర సమంత కటౌట్స్ కూడా పెట్టారు. సమంత స్టార్‌డమ్‌కు అది నిదర్శనం. థియేటర్ దగ్గర మాత్రమే కాదు... బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలోనూ ఆ స్టార్‌డమ్ కనిపించింది. 'యశోద' సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది.
'యశోద'కు మొదటి రోజు...
ఐదున్నర కోట్ల గ్రాస్!
Yashoda Collections : 'యశోద'కు తెలుగునాట ఓపెనింగ్స్ బావున్నాయి. నైజాం ఏరియాలో మొదటి రోజు సుమారు కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిందని టాక్. సీడెడ్, ఆంధ్రా కలిపితే రెండు కోట్ల వరకు షేర్ వచ్చిందని తెలిసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల వరకు గ్రాస్ ఉందట.
Yashoda First Day Share : తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కూడా 'యశోద'కు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఐదున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. షేర్ విషయానికి వస్తే మూడున్నర కోట్లకు కాస్త అటు ఇటుగా ఉందని తెలిసింది.
అమెరికాలో...
ఆస్ట్రేలియాలోనూ...
'యశోద' అదుర్స్!
Yashoda USA Australia Collections : అమెరికాలో ప్రేక్షకులు సైతం 'యశోద'ను చూడటానికి ఆసక్తి చూపించారు. అక్కడ థియేటర్లు కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయి. ప్రీమియర్స్ షోస్ ప్లస్ ఫ్రైడే కలెక్షన్స్ చూస్తే... శుక్రవారం సాయంత్రానికి అమెరికాలో 'యశోద' సినిమా 200k డాలర్స్ మార్క్ రీచ్ అయ్యింది. మరోవైపు ఆస్ట్రేలియాలో సినిమా 18 లొకేషన్లలో విడుదల అయ్యింది. అక్కడ సుమారు 10 లక్షలు వసూలు చేసింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఈ విధమైన కలెక్షన్స్ రావడం అద్భుతమైన విషయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'యశోద' కోసం సమంత చాలా కష్టపడ్డారు. యాక్షన్ సీన్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. డూప్, రోప్స్ వాడలేదు. ప్రతి సీన్ సొంతంగా చేశారు. ట్రైనింగ్ తీసుకుని మరీ స్టంట్స్ చేశారు. జ్వరంలో కూడా సమంత యాక్షన్ అండ్ స్టంట్ సీన్స్ చేశారని దర్శకులు తెలిపారు. తనకు మయోసైటిస్ ఉన్నప్పటికీ... అడుగు తీసి వేయడం కష్టం అయినప్పటికీ... సెలైన్ బాటిల్ సహాయంతో డబ్బింగ్ చెప్పారు.
Also Read : 'యశోద' మాటలు నచ్చాయ్ - సమంత సినిమాతో సత్తా చాటిన సీనియర్ జర్నలిస్టులు
హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన 'యశోద' (Yashoda Movie) లో కాన్సెప్ట్ కొత్తగా ఉందన్నారు ఆడియన్స్. సమంత నటనకు, డైలాగులకు, ఎమోషనల్ సన్నివేశాలకు కనెక్ట్ అవుతున్నారు. మణిశర్మ నేపథ్య సంగీతం బావుందని చెబుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.