విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా నటించిన FIR చిత్రం శుక్రవారం (11.02.2022)న విడుదల కానుంది. ఓ తీవ్రవాది చుట్టూ తిరిగే ఈ కథలోని సన్నివేశాలు, సినిమా టైటిల్‌పై వివాదాలు నెలకొన్నాయి. VV స్టూడియోస్ బ్యానర్‌పై శుభ్ర, ఆర్యన్ రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇంకా గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రెబ్ మోనికా, రైజా విల్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11, 2022న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు. కానీ, కొన్ని దేశాల్లో ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో చిత్ర ప్రదర్శనను రద్దు చేశారు. యూకేలోని పలు థియేటర్లలో కూడా షోలు నిలిపేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.  


ఈ చిత్రం ఓ మత వర్గానికి చెందిన యువకుడి చుట్టూ తిరుగుతుంది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో పోలీసులు అతడిని లక్ష్యం చేసుకుంటారు. అయితే, అతడు నిర్దోషా లేకపోతే.. నిజంగానే తీవ్రవాదా అనేది చిత్రం చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలోని సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మలేషియా, కువైట్, ఖతార్ దేశాల్లో చిత్ర ప్రదర్శన నిలిపేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాతోపాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే విడుదల కానుంది.






టైటిల్‌పై వివాదం: FIR టైటిల్‌ పోస్టర్‌లో ఓ మత గ్రంథానికి చెందిన వ్యాఖ్యలను ప్రచురించడంపై ఆ వర్గం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ గురువారం ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది యువకులు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రం దర్శకుడు, థియేటర్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు పోలీసులను డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో తాండూరు శాంతి మహల్ థియేటర్‌లో శుక్రవారం ‘ఎఫ్‌ఐఆర్’ చిత్ర ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిసింది. హీరో రవితేజ సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుందటం గమనార్హం. 






FIR Movie Telugu Trailer:



Also Read: చిరంజీవికి మహేష్ బాబు స్వీట్ రిప్లై, జగన్‌తో భేటీపై వరుస ట్వీట్లు


Also Read: ఐదు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు, టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు