తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైరాలో ఓ పాత్రలో నటించినప్పటికీ..ఉప్పెనతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో చాలా బిజీగా ఉన్నాడు సేతుపతి. ప్రస్తుతం కోలీవుడ్ లో సేతుపతి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అది కూడా ఒక్కనెలలోనే కావడం విశేషం. విడుదల థియేటర్లలో కాదు..ఓటీటీలో. చెప్పాలంటే ఓటీటీలో ఇదో సరికొత్త రికార్డ్ అని చెప్పాలి.
ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సేతుపతి నటించిన లాభం మూవీ థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు సెప్టెంబర్ 9 న ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. ఇక మిగిలిన మూడు సినిమాలు తుగ్లక్ దర్బార్, అన్నాబెల్లె సేతుపతి, కడై శివవాసాయి వరుసగా సెప్టెంబర్ 11.. సెప్టెంబర్ 17 .. సెప్టెంబర్ 24 తేదీలలో ప్రీమియర్ అవుతున్నాయి.
Also Read: ‘అనబెల్ సేతుపతి’ ట్రైలర్.. పాత కథలనే ఉల్టా చేసి చెబుతున్నారట, కామెడీ అదుర్స్!
Also Read: రాధకు ప్రేమ పాఠాలు నేర్పిస్తోన్న శ్యామ్.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్పెషల్ పోస్టర్
విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన ‘అనబెల్ సేతుపతి’ సినిమా తెలుగు ట్రైలర్ ను వెంకటేష్ తమిళంలో హీరో సూర్య, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. సెప్టెంబరు 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, తాప్సీలు తెల్ల దుస్తుల్లో కనిపించగా.. ఓ పెద్ద భవనం ముందు ఓ యువతి నిలుచుని ఉన్నట్లు ఉంది. ఆ భవనంపై తలకిందులుగా ఆ సినిమాలోని ఇతర తారాగణం ఉన్నారు. ఈ సినిమా కామెడీ, హర్రర్ నేపథ్యంతో తెరకెక్కింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తాప్సీ చాలా రోజుల తర్వాత దక్షిణాది సినిమాలో కనిపించనుంది. సుందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాన్ సుదరం, జి.జయరాం నిర్మిస్తున్నారు.
AlsoRead:ఒకరు క్రికెట్ దిగ్గజం..మరొకరు ఇండస్ట్రీమెగాస్టార్..ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు.. ఎక్కడ..
లాభమ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కి సిద్ధమవగా... అన్నాబెల్లె సేతుపతి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. కడై శివవాసాయి సోనీ లివ్ లో ప్రీమియర్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే నెలలో నాలుగు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న హీరో కేవలం విజయ్ సేతుపతి మాత్రమే కావడం విశేషం.
ALso Read:కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు వేసి స్వామిని ఇంటి లోపలకు ఆహ్వానించడం వెనుక ఇంత అంతరార్థం ఉందా..!
Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే
Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
Also Read:మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం