విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన ‘అనబెల్ సేతుపతి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళంలో హీరో సూర్య, మలయాళంలో మోహన్‌లాల్ ట్రైలర్ విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడం లేదు. నేరుగా ‘డిస్నీ హాట్‌స్టార్’ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబరు 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, తాప్సీలు తెల్ల దుస్తుల్లో కనిపించగా.. ఓ పెద్ద భవనం ముందు ఓ యువతి నిలుచుని ఉన్నట్లు ఉంది. ఆ భవనంపై తలకిందులుగా ఆ సినిమాలోని ఇతర తారాగణం ఉన్నారు. ఈ సినిమా కామెడీ, హర్రర్ నేపథ్యంతో తెరకెక్కింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తాప్సీ చాలా రోజుల తర్వాత దక్షిణాది సినిమాలో కనిపించనుంది. సుందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాన్ సుదరం, జి.జయరాం నిర్మిస్తున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 1948లో ఓ రాజమహాల్ నుంచి కథ ఆరంభమవుతుంది. 8 మంది వాస్తు శిల్పులతో నిర్మించిన రాజమహాల్‌ను సేతుపతి తన భార్య అనబెల్‌కు కానుకగా ఇస్తాడు. దానిపై విలన్ జగపతిబాబు కన్ను పడుతుంది. కొన్నాళ్ల తర్వాత అనబెల్ రూపంలో ఉన్న మరో యువతి (తాప్సీ) ఆ రాజమహాల్‌లో అడుగుపెడుతుంది. విలువైన వస్తువులను ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేస్తుంది. అయితే, రాజమహాల్‌లో ఉన్న ఆత్మలు వారితో ఆటలాడుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెరమీదే చూడాలి. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రాధిక, యోగి బాబు, వెన్నెల కిశోర్, చేతన్, దేవదర్శిని, సుబ్బు పంచు, మధుమితా, రాజా సుందరం, సురేష్ మేనన్, జార్జ్ మార్యన్, సురేఖ వాణి తదితరులు నటిస్తున్నారు.
‘అన్నాబెల్లె సేతుపతి’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:
‘ఉప్పెన’ సినిమాతో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. విభిన్న చిత్రాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. చిత్రం ఏమిటంటే విజయ్ సేతుపతి తమిళ డబ్బింగ్ చిత్రం ‘పిజ్జా’తోనే తెలుగువారికి పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో ‘అన్నాబెల్లే సేతుపతి’ సినిమాపై కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని అంతా భావిస్తున్నారు.
చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో విజయ్ నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో కూడా సేతుపతి విలన్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. ‘ఉప్పెన’లో విలన్‌గా ఆకట్టుకోవడంతో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మరోసారి ప్రతినాయకుడి పాత్రలో కనిపించేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Read Also: ‘నెట్’ ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ
Read Also: అక్కినేని ‘లవ్ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్