చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి కూడా పన్నులు కచ్చితంగా కడతారు. అయితే, రూ.కోట్లు ఆర్జించే సెలబ్రిటీలు, వ్యాపారులు మాత్రం.. ఈ విషయంలో నిర్లక్ష్యం కనబరుస్తారు. కానీ, ఏదో ఒక రోజు ఇందుకు భారీ మూల్యం చెల్లించకోక తప్పదు. చెల్లించాల్సిన పన్ను మొత్తం కంటే రెట్టింపు జరిమానా చెల్లించాల్సిన సమయం వస్తుంది. ఈ నటికి అలాంటి పరిస్థితే ఏర్పడింది. వరుస సీరియళ్లు, సినిమాలతో చేతినిండా బాగానే సంపాదించింది. కానీ, వచ్చిన ఆదాయానికి సరిపడా పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం కనబరిచింది. దీంతో రూ.337 కోట్లు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 


జెంగ్ షువాంగ్ అనే చైనా నటికి ఎదురైన చేదు అనుభవం ఇది. చైనా ఇటీవల తమ దేశంలో పేద-ధనిక మధ్య తేడా ఉండకూడదనే ఉద్దేశంతో సెలబ్రిటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆదాయానికి సరిపడా పన్నులు చెల్లించని తారల మీద కన్నేసింది. దీంతో జెంగ్ షువాంగ్ చిట్టా మొత్తం బయటపడింది. చైనా టీవీలు, ఓటీటీల్లో అకస్మాత్తుగా ఆమె సీరియళ్లు, సినిమాలు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఇంతకీ ఏమైందా అని మీడియా ఆరా తీస్తే.. ఆమె పన్నులు ఎగ్గొట్టిందని, దీంతో ఐటీ 299 మిలియన్ యువాన్ (రూ.337 కోట్లు) జరిమానా విధించిందని తెలిసింది. 2019, 2020 సంవత్సరాలకు గాను ఆమె టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా ఆర్జించిన మొత్తానికి పన్నులు చెల్లించలేదనే కారణంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 


30 ఏళ్ల జెంగ్.. 2009లో ఓ తైవాన్ టీవీ సీరిస్ Meteor Shower రీమేక్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె అనేక సీరియళ్లు, సినిమాలు, వెబ్‌సీరిస్‌లతో బిజీ స్టార్‌గా మారిపోయింది. అయితే, ఆమె పన్నులు చెల్లించడం లేదనే సమాచారం తెలియగానే.. చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యూలేటర్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశించింది. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని సూచించింది. ప్రభుత్వం ఈమెను టార్గెట్ చేసుకోడానికి కారణం.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగే. తమ అభిమాన తారను చూసి ఫ్యాన్ కూడా ఆమెలాగే పన్నుల చెల్లింపులు నిర్లక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో చైనా ఈ చర్యలు తీసుకుంది. 


‘‘కళాకారుల నైతిక వైఫల్యాలు, చట్టపరమైన ఉల్లంఘనలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయి. వారిపై ప్రజలకు విపరీతమైన అభిమానం ఉంది. దీంతో వారు చేసే తప్పులు సమాజానికి కూడా హానికరం. అలాంటివారు రోల్ మోడల్స్‌గా ఉండకూడదు. అందుకే స్వచ్ఛమైన, బాధ్యతయుతమైన కళాకారులను మాత్రమే ప్రజలకు అందించాలని అనుకుంటున్నాం’’ అని తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ఆదేశాల మేరకు జెంక్ సినిమాలను, సీరియళ్లు, సీరిస్‌లను ఓటీటీల నుంచి కూడా తొలగించారు. కొన్ని సినిమాల్లో ఆమె పేరును సైతం తొలగించారు. చివరికి చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్‌ ‘వీబో’లో #ZhaoWeiSuperTopicClosed అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండైంది. ఆమె అకౌంట్‌ కూడా అకస్మాత్తుగా మాయమైంది. 


Read Also: ‘నెట్’ ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ


Read Also: అక్కినేని ‘లవ్‌ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్