సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie) ఒకటి. దీనికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడు. 'హిట్', 'హిట్ 2' విజయాల తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. జనవరి 13న సినిమా విడుదల అవుతోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.


సైకోగా వెంకీ మామ అదుర్స్ అంతే
Saindhav Trailer Review: తండ్రీ కుమార్తెల అనుబంధం నేపథ్యంలో 'సైంధవ్' సినిమా తెరకెక్కింది. అయితే... ఇందులో యాక్షన్ ఫుల్లుగా ఉంటుందని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. సైకోగా వెంకీ మామ చేసిన యాక్షన్ రచ్చ మామూలుగా లేదు. వెంకీకి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ బేస్డ్ సినిమాలు ఎక్కువ చేశారు. అయితే... ఆయనలో యాక్షన్ హీరో కూడా ఉన్నాడని 'ధర్మచక్రం', 'గణేష్', 'లక్ష్మీ', 'తులసి' సినిమాలు చూపించారు. మరోసారి వెంకీలో యాక్షన్ బయటకు తీశారు దర్శకుడు శైలేష్ కొలను.


Also Readమహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?






వెంకటేష్ జోడీగా శ్రద్ధా శ్రీనాథ్...
కీలక పాత్రల్లో మరో ఇద్దరు భామలు
'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఆమె అభినయానికి ఆస్కారమున్న మనోజ్ఞ పాత్రలో నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మతో పాటు ఆండ్రియా జెరెమియా కీలక పాత్రలు చేశారు. రేణూ దేశాయ్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.


Also Readఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున



ప్రతినాయకుడిగా నవాజుద్ధీన్ సిద్ధిఖీ
'సైంధవ్' సినిమాతో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. ముఖేష్ రుషితో పాటు ఆయన నటించిన సన్నివేశాలు టీజర్‌లో వైరల్ అయ్యాయి. తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ఆర్య మానస్ పాత్రలో యాక్ట్ చేశారు. సినిమాలోని ఎనిమిది కీలక పాత్రల్లో ఆయనది ఓ పాత్ర అని చెప్పారు.


Also Readబెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?


వెంకటేష్ 75వ చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో జనవరి 13న విడుదల చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.