Telangana CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. మరోసారి ముఖ్యమంత్రి(Chief Minister) ఢిల్లీ వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే గురువారం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSR Telangana Party) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) కాంగ్రెస్‌(Congress)లో జాయిన్ అవుతున్నారు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని ఓ టాక్ ఉంది. ఇదే టైంలో ఆయన ఇంకా పెండింగ్‌లో ఉన్న మంత్రిమండలి(Telangana Cabinet) విస్తరణ, నామినేటెడ్‌ పదవులు భర్తీపై కూడా అధినాయకత్వంతో చర్చిస్తారనే ప్రచారం నడుస్తోంది.


మరోవైపు పార్లమెంట్ ఎన్నికల(Pariament Elections) టైంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనుంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల సీఎంలు(CMs), పీసీసీ చీఫ్‌ల(PCC Chiefs)తో సమావేశమవుతుందని అంటున్నారు. ఆ సమావేశంలో కూడా రేవంత్(Revanth Reddy) పాల్గొంటారని అందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. 


తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తెలంగాణ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశ జరగనుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ముందు ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇన్‌ఛార్చ్‌ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. పీఏసీ, పీఈసీ, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొంటారు. 


తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆ దిశగా శ్రేణులను, నేతలను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం పెట్టారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈలోపు పార్టీ లోటుపాటు చర్చించి అధినాయకత్వం సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలి నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.