Pawan Kalyan title for Bellamkonda Sai Sreenivas film: యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే హిందీలో 'ఛత్రపతి' చేయడం వల్ల తెలుగు సినిమాకు 3 ఏళ్ళ విరామం వచ్చింది. ఇప్పుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు పవన్ కల్యాణ్ టైటిల్ ఖరారు చేశారని సమాచారం.
దేవుడే దిగి వచ్చినా... టైటిల్ ఇదేనా?
Devude Digi Vachina Movie: బెల్లకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. అందుకని BSS10 Movie వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ చంద్ర సినిమాకు 'దేవుడే దిగి వచ్చినా' టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం హీరో బర్త్ డే (Bellamkonda Sai Sreenivas Birthday) సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'సంతోషం' సినిమాలో 'దేవుడే దిగి వచ్చినా...' అని సాంగ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాకు ముందుగా 'దేవుడే దిగి వచ్చినా...' టైటిల్ అనుకున్నారు. అయితే... ప్రేక్షకులకు చేరువ అవుతుందో? లేదో? అని 'బ్రో' ఖరారు చేశారు.
పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఆయన పవర్ స్టార్ అభిమాని కూడా! ఆ అభిమానాన్ని కొత్త సినిమా టైటిల్ విషయంలో చూపిస్తున్నట్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు పరిశీలించిన టైటిల్ కొత్త సినిమాకు ఫిక్స్ చేసినట్లు ఉన్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హీరోతో పాటు కీలక నటీనటులపై మెజారిటీ సీన్లు తీశారు.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: విజయ్ - వెంకట్ - 'రియల్' సతీష్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్, ఛాయాగ్రహణం: ముకేశ్ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.