Huge Demand For Biryani On December 31: డిసెంబర్‌ 31 అంటేనే అదోరకమైన జోష్. ఎక్కడ చూసిన పార్టీ మూడ్‌తో ఉంటుంది. అలాంటి టైంలో కేక్‌లు, ఫుడ్‌ ఆర్డర్‌లు కామన్‌ అయితే వీటితో ఈసారి కండోమ్‌లు కూడా పోటీ పడ్డాయని లేటెస్ట్ డాటా చెబుతోంది.


దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉత్సాహంతో 2023కి వీడ్కోలు పలికిన ప్రజలు అంతే ఆనందంతో 2024ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజైన డిసెంబర్‌ 31న అంతా ఆనందోత్సాహాల మధ్య ఊగిపోయారు. ఎవరి రేంజ్‌కు తగ్గట్టు వాళ్లు పార్టీలు చేసుకున్నారు. కొందరు పబ్స్‌లో సందడి చేస్తే మరికొందరు ప్రైవేటు ప్రాంతాల్లో ఎంజాయ్ చేశారు. 


బిర్యానీలకు డిమాండ్


డిసెంబర్ 31న మందు ఎంత పొంగిందో అదే స్థాయిలో ఫుడ్ ఆర్డర్లు కూడా పెరిగాయి. ఆన్‌లైన్ యాప్‌లకు ఫుల్ గిరాకీ వచ్చింది. అందుకే హైదరాబాద్‌లో భారీగా బిర్యానీలు అమ్ముడుపోయాయి. స్విగ్గీ యాప్‌ తెలిపిన వివరాలు చూస్తే గత రికార్డులు చెరిగిపోయినట్టు తెలుస్తోంది.  
డిసెంబర్‌ 31న గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 12 వందలకుపైగా బిర్యానీలు బుక్ అయ్యాయి అని ఫుడ్‌ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. ఆ ఒక్క రోజే 4.8 లక్షల బిర్యానీలు తినేశారు. ఇది గత ఏడాది కంటే 1.6 రెట్లు ఎక్కువ అని స్విగ్గీ తెలిపింది. బిర్యానీ ఆర్డర్‌లలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. 


గత రికార్డులు చెరిపేసి


స్విగ్గీతోపాటు జొమాటో అనుబంధ సంస్థలైన బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్లు రికార్డు స్థాయిలో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చెప్పిన ప్రకారం 2015, 2016, 2017, 2018, 2019, 2020తో పోల్చుకుంటే కొత్త రికార్డులు నమోదయ్యాయి. భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సెకనుకు 140 ఆర్డర్‌లు అయినట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 


ఆన్‌లైన్‌ ఆర్డర్‌లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతాలో ఒక కస్టమర్ ఒకే ఆర్డర్‌లో 125 రుమాలీ రోటీలు డెలివరీ చేయడంపై గోయల్‌ ఆశ్చర్యపోయారు. టిప్స్ ద్వారానే సిబ్బందికి 97 లక్షలు వచ్చినట్టు గోయల్ వివరించారు. ఫుడ్‌తోపాటు డ్రింక్స్, ఇతర పదార్థాలను కూడా భారీగా ఆర్డర్స్ చేశారు. వీటితోపాటు కండోమ్‌లు కూడా భారీగా ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్  ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా నిమిషానికి  1,722 కండోమ్‌లు ఆర్డర్ చేసినట్టు వెల్లడైంది. 


Also Read: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా బన్నీతో కాదు, ఆ ఇద్దరితో మల్టీస్టారర్? 


Also Read: రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న కమల్ మూవీ అప్డేట్ - ‘గేమ్ ఛేంజర్’కు లైన్ క్లియర్!