Trinayani Serial Today Episode విక్రాంత్ విశాల్‌కి ధైర్యం చెప్తాడు. మూడు గంటల్లో తెల్లారిపోతుందని నయని వదిన పంచకమణితో వస్తుందని విక్రాంత్ అంటాడు. సుమన మాత్రం వంకరగా మాట్లాడుతుంది. అందరూ చివాట్లు పెడతారు. 


విశాల్: నయని సాధించి తీరుతుంది. నేను ఇంత ఉద్వేగానికి లోనై చెప్తున్నాను అంటే తను అక్కడ ముందుకు అడుగు వేసే ఉంటుంది. 
నయని: మానసాదేవిని దర్శించుకుంటుంది. స్వామి మానసాదేవి దర్శనం కలిగింది. ఈ తల్లి దయతో నా భర్తకి నయం అవుతుంది. 


ఇక మానసాదేవి ఆలయం దగ్గర అమ్మవారికి కాపలా ఉండే అఖండ సర్పం కనిపించి నయని, గురువుగారి మీద బుసలు కొడుతుంది. నయని గురువుగారిని తప్పిస్తుంది. ఇక విశాల్‌ని పిల్లల దగ్గరకు వెళ్లమని దురంధర చెప్తే తన తల్లి గాయత్రీ దేవి దగ్గరే ఉంటానని అంటాడు. ఇక తిలోత్తమ విశాల్‌ని ఒంటరిగా వదిలేయమని చెప్పి అందర్ని వెళ్లిపోమని చెప్తుంది. అందరూ వెళ్లిపోతారు. విశాల్ ఫొటో దగ్గర నిల్చొంటాడు. కొడుకుని చూసి వస్తానని చెప్పి హాసిని వెళ్తుంది. 


గురువుగారు: నయని మానసాదేవి అమ్మవారి దగ్గర ఈ అఖండ సర్పం కాపలా ఉంటుంది. నీటి దీపం వెలిగించకుండా పంచకమణి తీసుకొనే ప్రయత్నం చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం.
నయని: సర్ప రాజా అమ్మవారి దగ్గరకు వచ్చిన మేం నియమ నిబంధనలు అనుసరించే పంచకమణి తీసుకెళ్తాం. నీటి దీపం వెలిగిస్తాం. నా భర్తకు నయం అయిన తర్వాత తిరిగి పంచకమణిని ఇక్కడే పెడతానని మాట ఇస్తున్నాను. ఆగ్రహించకు తండ్రి. 
గురువుగారు: అఖండ సర్పం శాంతించింది నయని. నీ భక్తి, నీ నిబద్ధత, నీ నీరీక్షణ నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నీ వల్లే నేను కూడా అమ్మ దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ నీటి దీపం వెలిగించగలగాలి. ఏం చేయాలో అందులో రాసుంది. ఇక్కడ ఏం రాయాలో ఎలా రాస్తే నీటి దీపం వెలుగుతుందో.
నయని: తల్లి మానసాదేవి నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఎలాంటి నిరాశ పెట్టి మా కార్యం నెరవేరకుండా వెనుదిరిగేలా చేయకమ్మా. 


సమీపంలో ఓ పెద్ద రాయి కదలడం నయని చూస్తుంది. ఆ రాయిలో ప్రకంపనలు చూశానని రాయడం కూడా రాతితోనే రాయాలని అనుకుంటానని నయని అంటుంది. ఏ ఆలోచన వస్తే అదే చేస్తానని అంటుంది. రాయిని అమ్మ పీటం దగ్గర రాస్తే రాపిడికి నిప్పు వస్తుంది స్వామి ఆ నిప్పుతో దీపం వెలిగిస్తాను అని నయని అంటుంది. అమ్మవారి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకొని అమ్మవారి రాయి మీద తను తీసుకున్న రాయితో రాపిడి చేస్తుంది. నిప్పులు వస్తాయి. ఇక గురువుగారు వెంట తీసుకురమ్మని చెప్పిన కొబ్బరి కాయతో నీటి దీపం వెలిగిస్తానని కొంగుకు కట్టుకున్న కొబ్బరి తీసి రాయితో రాపిడి చేసి ఆ నిప్పు కొబ్బరి పీసుకు అంటుకునేలా నయని చేస్తుంది.   అగ్గి రాజుకోవడంతో దాన్ని తీసుకెళ్లి దీపం వెలిగిస్తుంది. దీపం వెలగ గానే అఖండ సర్పం మాయం అవుతుంది. ఇక అక్కడున్నా మొత్తం సర్పాల బొమ్మలకు కాంతి వెళ్లి ప్రసరించడం మొదలవుతాయి. మొత్తం కాంతి మయం అవుతుంది. అమ్మవారి గంట కొట్టుకొని మొత్తం కాంతితో ధగ ధగ మెరుస్తుంది. నయని, గురువుగారు చూసి మైమరిచిపోతారు. 


ఆ కాంతిలో గురువుగారు మెరుస్తున్న ఓ మణిని చూసి పంచకమణి అని నయనికి చెప్తారు. నయని చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతుంది. అమ్మవారికి దండం పెట్టుకొని నీ పంచక మణిని తిరిగి నీ సన్నిధిలో పెట్టే బాధ్యత నాది అని మాట ఇస్తున్నా అని మాట తప్పనని చెప్పి పంచకమణిని తీసుకుంటుంది. ఇక రే చుక్క పశ్చిమ పయనించి వెన్నెల మాయం అయి అగ్ని నది మండక ముందే వెళ్లాలని గురువుగారు చెప్తారు.దాంతో ఇద్దరూ తొందరగా ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోతారు. 


గురువుగారు పంచకమణిని ఒక్కసారి తాకి చూడవచ్చా అని నయనిని అడుగుతారు. నయని సరే అని ఇవ్వడంతో గురువుగారు తన చేతిలోకి తీసుకొని పెద్దగా నవ్వుతారు. నయని ఏమైందా అనుకునేలోపు గురువుగారు గజగండగా మారిపోతారు. నయని షాకైపోతుంది. గురువుగారిని దారి మళ్లించి నీ  వెంట నేను వచ్చానని చెప్పి పంచకమణిని సొంతం చేసుకున్నానని గజగండ అంటాడు. నయని పంచకమణి ఇవ్వమని లేదంటే చంపేస్తానని అని దగ్గరకు వెళ్లబోతే గజగండ నయని చుట్టూ నిప్పుల రేఖ గీస్తాడు. తన కొడుకు రక్తపుంజిని చంపిన నిన్నూ నీ అత్తయ్యని వదలనని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ!