BiggBoss Telugu 8Jyothi Rai: బిగ్ బాస్ హౌస్ లోకి గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. కొట్టుకునేందుకే హౌస్ లోకి వచ్చాం అన్నట్టు కంటెస్టెంట్స్ అంతా ఆరంభం నుంచి గొడవలకు దిగారు. హీట్ అంటే ఇదికాదంటూ గుప్పెడంతమనసు జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందట
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కార్తీకదీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది గుప్పెడంతమనసు. ఈ సీరియల్ సక్సెస్ లో రిషి, వసుధార, జగతి ముగ్గురు పాత్రలు కీలకం అనే చెప్పాలి

సీరియల్ ఆరంభం నంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ జగతి మేడం లేకుండా సాగలేదు. మధ్యలోనే ఆమె క్యారెక్టర్ ని చంపేసినా కానీ ఆమె రాసిన లెటర్ తోనే శుభం కార్డ్ పడింది..
ఈ సీరియల్ లో కొడుకు ప్రేమకోసం తపించే తల్లిగా, స్టూడెంట్ భవిష్యత్ కోసం తాపత్రయపడే గురువుగా జగతిగా అద్భుతంగా నటించింది జ్యోతిరాయ్. ఈ సీరియల్ తో భారీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది
ఈ సీరియల్ నుంచి బయటకు వచ్చేసి సినిమాలు,వెబ్ సిరీస్ లలో బిజీ అయిన జ్యోతీరాయ్..అసలు లుక్ బయటపెట్టింది. సీరియల్ లో పద్ధతిగా చీరకట్టిన జగతి..సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో హాట్ హాట్ గా కనిపించింది
జ్యోతిరాయ్ లుక్ చూసి ఆశ్చర్యపోని నెటిజన్ లేరు..అప్పటి నుంచి ఆమె సింగిల్ పిక్ షేర్ చేసినా ఓ రేంజ్ లో వైరల్ అయిపోతోంది. లేటెస్ట్ గా జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందంటున్నారు. ఈ లోగా షూటింగ్స్ పూర్తిచేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటోందట జ్యోతిరాయ్.