Bigg Boss Troll Videos : నామినేషన్స్ సమయంలో నాగమణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్, సీత అతనికి సర్ది చెప్తున్న సమయంలో నాగమణికంఠ ఎమోషనల్ అవుతూ.. తలపై ఉన్న విగ్​ తీసేశాడు. ఏమి చేస్తున్నాడో అర్థం కాక.. నిఖిల్ అలానే నిర్ఘాంతపోయి చూశాడు. ఈ ఫుటేజ్ చూసిన బిగ్​బాస్​ ప్రేక్షకులు కూడా షాక్​ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మణికంఠను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కేవలం మణికంఠ వరకేనా? ఇంకా ఉన్నారా?


షాక్​లోనే ఉన్న నిఖిల్


మూడు.. నాలుగు రోజులుగా వారితో కలిసి ఉన్న మణికంఠది విగ్​ అని హౌజ్​లో ఉన్నవారే గుర్తించలేకపోయారు. పైగా అతను సోషల్ మీడియాలో ఎన్నో రీల్స్ చేస్తూ.. ఉంటారు. సోషల్ మీడియాలో అతడిని ఫాలో అయ్యే చాలామందికి కూడా ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. తఅందుకే చూసేవన్నీ నిజాలు కాదని చెప్తున్నారు నిపుణులు. కానీ కొందరు యూత్ ఇలాంటి ఇన్​ఫ్లూయెన్సర్స్​ని చూసి.. తామెందుకు ఇలా లేమని డిప్రెషనలోకి వెళ్తారు. అంతెందుకు రీసెంట్​గా ఓ కాస్మోటిక్ సర్జన్ బిగ్​బాస్​కి వచ్చే వారిలో ప్రతి సీజన్​లో తన క్లయింట్సే ముగ్గురు, నలుగురు ఉంటారని తెలిపాడు. 






 


 


ప్రతీ సీజన్​లోనూ ఉన్నారు..


తెలుగు బిగ్​బాస్​కి వచ్చే వారు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుని వస్తారని.. ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ రాజశేఖర్ గొల్లు తెలిపారు. హైదరాబాద్​లో అతి పెద్ద కాస్మోటాలజిస్ట్ అయిన రాజశేఖర్.. తెలుగులో బిగ్​బాస్​లో ప్రతి సీజన్​లో ముగ్గురు, నలుగురు తన క్లైంట్సే ఉంటారని చెప్పాడు. తమ షేప్స్, ముక్కు, పెదాలకు బొటెక్స్, బ్రెస్ట్ ఫిల్లర్స్ ఇలా ఎన్నో రకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని.. బిగ్​బాస్​కు వస్తున్నారని ఓపెన్ స్టేట్​మెంట్​ ఇచ్చాడు. 


చూసేదంతా నిజం కాదు..


సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదు. ముఖ్యంగా కొందరు ఇన్​ఫ్లూయెన్సర్స్​ని, సెలబ్రెటీలను చూసి.. వారిలా ఉండాలి అనుకుంటారు కానీ.. వారు కేవలం కెమెరా ముందు నటించేందుకు.. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారే తప్పా.. సొంత మొహలు.. సొంత క్యారెక్టర్స్ కాదనే విషయం కొందరు అర్థం చేసుకోరు. అలాంటి వారికి బిగ్​బాస్​నే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. తాజాగా మణికంఠ విగ్​ విషయం వల్ల ఈ టాపిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 



కేవలం సోషల్ మీడియానే కాదు.. 


సినిమాల్లో కూడా హీరోయిన్స్, హీరోలు అందరూ పర్​ఫెక్ట్​గా ఉండరు. తెర మీదకు వచ్చే ముందు మాత్రం వాటిని కవర్ చేసుకుంటారు. ఈ విషయం తెలియక ఎంతో మంది తమ సమస్యలను ఇన్​సెక్యూర్​గా తీసుకుని మానసికంగా డిస్టర్బ్ అవుతారు. అలాగే అప్పీరియన్స్​లో మార్పులు ఉన్నవారిని చూసి హేళన చేసే వారు కూడా ఎక్కువైపోతున్నారు. అందంగా కనిపించకుంటే లైక్స్ రావని.. ఫాలోవర్స్​ ఉండరని ఇవన్నీ మెయింటైన్ చేస్తారు.త కాబట్టి తెరపై కనిపించే అందాన్ని కాదు.. మనసు మంచిగా ఉండేలా చూసుకుంటే.. ఎన్ని లోపాలున్నా పైకి చాలా అట్రాక్టివ్​గా కనిపిస్తారని చెప్తున్నారు నిపుణులు. 


ఓవర్ కామ్ చేయండి..


కొందరు రంగు తక్కువగా ఉన్నారనో.. మరికొందరు లావుగా ఉన్నారనో.. ఇంకొందరు పొట్టిగా ఉన్నారనో.. జుట్టు లేదనో.. ఇలా వివిధ కారణాల వల్ల చాలా ఇన్​సెక్యూర్​గా ఫీల్ అవుతారు. అలాంటివారు సోషల్ మీడియాను చూసి.. సెల్ఫ్ జడ్జిమెంట్స్ చేసుకోకపోవడం మంచిది. ఎవరూ పర్​ఫెక్ట్​ కాదు. మన డిఫెక్ట్స్​ యాక్సెప్ట్ చేస్తూ.. ముందుకు ఎలా వెళ్లాలో తెలిస్తే మీకన్నా అందంగా మరెవరు ఉండరు. తెలిసో తెలియకో.. పబ్లిక్ స్టంట్ కోసమో.. ఆ విషయాన్ని మణికంఠ ఓవర్​కామ్ చేసేశాడు. మీరు కూడా అలాగే మీ డిఫెక్ట్స్​ని ఓవర్​ కామ్ చేయండి. 


Also Read : తనని తానే ఆడపులిగా డిక్లేర్ చేసుకున్న సోనియా, ఫేష్ వాష్​తో బ్రష్ చేసుకున్న పృథ్వీరాజ్.. న్యూ టాస్క్​తో 3 టీమ్స్​గా విడిపోయిన కంటెస్టెంట్లు