Trinayani Today Episode విశాలాక్షి ఇంట్లో ధ్యానం చేస్తుంటే తిలోత్తమ అఖండ స్వామి ఇచ్చిన పువ్వు తీసుకొని వస్తుంది. విశాలాక్షికి పువ్వు సమర్పిస్తాను అంటుంది. ఇక సుమన తాను ఆస్తి పొందే అదృష్టం కోల్పోయాను అని చెప్తంది. ఏమైందని తిలోత్తమ అడిగితే ఉలూచి మళ్లీ పాములా మారిందని అందుకే ఆస్తి ఇవ్వలేదని నయని చెప్తుంది. తనకు విశాలాక్షి మీదే అనుమానం ఉందని సుమన అంటుంది.  


విశాల్: సుమన ఉలూచి కాళ్లకు వేసిన సాక్సులు తీసేసింది అంట అందుకే పాప మళ్లీ పాముగా మారింది అంట.
తిలోత్తమ: బుద్ధి ఉందా సుమన నేను తీయమన్నానా నీకు.
సుమన: డ్రస్‌కి మ్యాచింగ్ అవ్వలేదు అని తీసేశాను అత్తయ్య. 
తిలోత్తమ: నోర్ముయ్. నేను చెప్పకముందు తీయకు అని హెచ్చరించినా వినవా.
హాసిని: మీ గోలకి విశాలాక్షి కళ్లు తెరిచింది.
తిలోత్తమ: ధ్యానానికి ఆటంకం కలిగించినందుకు క్షమించు విశాలాక్షి. ఈ పువ్వు నీకు సమర్పించాలి అని తీసుకొచ్చాను. తీసుకో.
నయని: ఎందుకు.
విశాల్: అది కాదు అమ్మ మళ్లె పూలు తీసుకొచ్చి అందరికీ ఇస్తే కాదు అనరు కానీ ఒక్క పువ్వు తెచ్చి విశాలాక్షికి ఇస్తే అనుమానిస్తారు కదా.
నయని: మంత్ర పుష్పం ఇచ్చి విశాలాక్షిని ఏమైనా చేయాలి అనుకుంటున్నారా.
తిలోత్తమ: ఛా.. ఛా.. ఎంత మాట నయని.. చిన్నపిల్ల ముచ్చట పడుతుంది అని ఈ పువ్వు ఇస్తున్నాను అంతే. 


విశాలాక్షికి తిలోత్తమ పువ్వును ఎడమ చేతితో ఇస్తుంటే కుడి చేతితో ఇవ్వమని అంటుంది. కుడి చేతికి గ్లౌజ్ ఉన్నా పర్లేదు ఇవ్వ అని విశాల్ అంటాడు. అయితే తిలోత్తమ తన కుడి చేతికి బలం సరిపోదు అని అంటుంది. దీంతో విశాలాక్షి ప్రయత్నించమని చెప్తుంది. దీంతో తిలోత్తమ కష్టంగా కుడి చేతిలో పువ్వు పెట్టుకొని విశాలాక్షికి ఇవ్వబోతే విశాలాక్షి తన ముందు బోర్లా ఉంచిన గిన్నె మీద పెట్టమని చెప్తుంది. తిలోత్తమ అలాగే చేస్తుంది. అయితే పువ్వు గిన్నే మీద పెట్టగానే పువ్వు చుట్టూ తిరుగుతుంది. అయితే దాని కింద ఏముందో చూడమని విశాలాక్షి అంటుంది. సుమన వెళ్లి చూస్తుంది. అందులో చిన్న పిల్లల సాక్సులు ఉంటాయి.  వాటిని చూసి అందరూ షాక్ అవుతారు. అవి తన కూతురివి కాదు అని సుమన అంటుంది. 


విశాలాక్షి: మీ అత్తయ్య రంగులు మార్చినట్లు ఇది కూడా రంగు మారకూడదా సుమన.
తిలోత్తమ: నేనేం రంగులు మార్చాను. 
నయని: అది కాదు అత్తయ్య మీరు చేతికి రంగు రంగుల గ్లౌజ్‌లు వేస్తున్నారని ఆ ఉద్దేశంతో అన్నది.
విశాలాక్షి: ఉలూచిపాప కాళ్లకు వేసిన వీటితో నీ చేతికి వేసిన దానితో ఏ అవసరాలు తీరుతాయో కాస్త చెప్పగలవా అమ్మ. 
విశాల్: అవసరాలు తీరుతాయా.
నయని: సాక్సులు వేసుకుంటే పని అవుతుందన్నట్లు చెప్తావేంటి విశాలాక్షి.
విశాలాక్షి: చెప్పాల్సింది మీ అత్తయ్య.
తిలోత్తమ: ఏయ్  నీకు అక్కర్లేని విషయాలు నీకు ఎందుకు.
విశాలాక్షి: నాకు అవసరం లేదు మీ ఇంట్లో వాళ్లకి చెప్పాలి కదా.
సుమన: ఈ సాక్సులకు ఆ గ్లౌజ్‌కి ఏంటి సంబంధం.
విక్రాంత్: సాక్సులు తీస్తే ఉలూచి పాము పిల్లలా మారినట్లు ఆ గ్లౌజ్ తీస్తే అమ్మ ఇంతకు ముందు లా మారిపోతుంది ఏమో.
తిలోత్తమ: మళ్లీ నా రూపం మారడం జరగదు. జరగకూడదు. ఇలా అవ్వడానికి ఎంత శ్రమించానో మీకు ఏం తెలుసు. 
విశాలాక్షి: ఆ మాటకు వస్తే మీ అమ్మ నా దగ్గరకు రాలేదు కూడా.
వల్లభ: వచ్చింది కదా.
డమ్మక్క: అందుకే పువ్వు ఇచ్చింది కదా.


తిలోత్తమ ఇలా తనని ప్రశ్నించడం నచ్చలేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక సుమన తిలోత్తమ గది దగ్గరు వెళ్తుంది. ఆస్తి పోయిందని బాధ పడుతుంది. తిలోత్తమ విశాలాక్షినే ఇదంతా చేసుంటుందని మాట్లాడి సుమనను రెచ్చగొడుతుంది. విశాలాక్షిని ఇంటి నుంచి పంపేస్తే ఆస్తి వస్తుందని అన్నట్లు మాట్లాడుతుంది. దానికి సుమన రెచ్చిపోయి విశాలాక్షిని ఇంటి నుంచి పంపేయాలి అనుకుంటుంది. అందుకు తన దగ్గర ఓ ఐడియా ఉందని అంటుంది. విశాలాక్షి జుట్టు కత్తిరించి గుండు చేసేస్తే ఇంకో ఆరు నెలలు ఇంటికి రాదు అని సుమన అంటుంది. దీంతో తిలోత్తమ మంచి ఐడియా అలాగే చేయ్ నీకు వల్లభ సపోర్ట్ చేస్తాడు అని అంటుంది. మరోవైపు హాసిని తిలోత్తమ తన అత్తయ్య కాదు అని అనిపిస్తుందని అంటుంది. విశాల్ వచ్చి తిలోత్తమ అమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయిందని అంటాడు. ఇంతలో హాసిని పొలమారుతుంది. నయని నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అయితే నయనికి ఓ బాబు ప్రమాదంలో ఉన్నట్లు రోడ్డు మీద పరుగులు పెడుతూ అమ్మ అని గట్టిగా పిలిచినట్లు కనిపిస్తుంది. దీంతో నయని షాక్ అవుతుంది. ఆ బాబు ఎవరు ఎందుకు అమ్మా అని అరిచాడు అని ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తనని కాపాడింది లక్ష్మీనే అని చెప్పిన మిత్ర.. తండ్రి పరిస్థితికి లక్కీ ఎమోషనల్, జున్ను ఓదార్పు!