chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అరవింద వాళ్లు మిత్రని చూడటానికి లోపలికి వెళ్తారు. మిత్ర తాను ఇప్పుడు బాగానే ఉన్నాను అని కంగారు పడొద్దని తల్లికి చెప్తాడు. అరవింద ఏడుస్తుంది. ఇక బయట నుంచి లక్ష్మీ మిత్రను చూస్తూ ఏడుస్తుంది. దేవయాని మిత్రతో నిన్ను ఎవరు కాపాడారు. ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతుంది. మిత్ర అంతా గుర్తు చేసుకొని లక్ష్మీ అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు.


మనీషా: ఏంటి నిన్ను కాపాడింది లక్ష్మీనా. నిజమేనా.
మిత్ర: ఆ అమ్మాయి కొంచెం లక్ష్మీ లానే ఉంది. ఫేస్ క్లీయర్‌గా కనిపించలేదు. కానీ లక్ష్మీలాగే ఉంది. 
దేవయాని: ప్రాణం పోయిన లక్ష్మీ ఇప్పుడు మళ్లీ మిత్రకు ప్రాణం పోయడానికి ఎందుకు వస్తుంది.
మిత్ర: నాకు అదంతా తెలీదు పిన్ని కానీ నాకు లక్ష్మీలానే ఉంది. 


అరవింద దీక్షితులుగారు లక్ష్మీ బతికే ఉంది అన్నమాటలు డాక్టర్ చెప్పిన పోలికలు గుర్తు చేసుకొని ఆలోచనలో పడుతుంది. మిత్ర దగ్గర నుంచి బయటకు వచ్చి కూర్చొంటుంది. లక్ష్మీ అరవిందను చూసి దాక్కుంటుంది. వివేక్ ఏమైందని అడిగితే మిత్ర తనని కాపాడిన అమ్మాయి లక్ష్మీలాగే ఉందని చెప్పాడని మిత్రకు గండం వచ్చిన ప్రతీ సారి లక్ష్మీ కాపాడేదని ఇప్పుడు కూడా ఈ గండం నుంచి లక్ష్మీనే కాపాడిందని అంటావా.. దీక్షితులు గారి చెప్పినట్లు లక్ష్మీ తిరిగి వస్తుందని చెప్పారు కదా అది నిజమేనా. లక్ష్మీ చనిపోలేదు కదా అని అరవింద వివేక్‌తో అంటుంది. అరవింద మాటలు విన్న లక్ష్మీ మిత్ర గారికి గండాలు ఇక లేవు కదా మళ్లీ వీళ్లు గండం అని అంటున్నారు ఏంటి అని అనుకుంటుంది. 


మరోవైపు హాస్పిటల్‌కి లక్కీ, జున్ను వస్తారు. నాన్న అంటూ లక్కీ ఎమోషనల్‌గా ఏడుస్తూ పరుగున వస్తుంది. లక్ష్మీ ఎదురుగానే ఇద్దరు పిల్లలు పరుగులు తీసినప్పటికీ లక్ష్మీ చూడదు. ఇక లక్కీ నానమ్మ దగ్గరికి వెళ్లి తండ్రి గురించి అడిగి ఎమోషనల్ అవుతుంది. తండ్రిని చూసి లక్కీ ఏడుస్తుంది. తనకు ఏం కాలేదు అని మిత్ర చెప్తాడు. ఇక బాగుంటే ఇక్కడెందుకు ఇంటికి వెళ్లిపోదాం అని గోల చేస్తుంది. తనని చూసి లక్కీ భయపడుతుందని బయటకు తీసుకెళ్లమని మిత్ర అరవిందతో చెప్తాడు. అరవింద లక్కీని బయటకు తీసుకెళ్లి ఓదార్చుతుంది. మరోవైపు జున్ను మిత్ర చేయి పట్టుకుంటాడు.  మీకు ఏం కాదు టెన్షన్ పడకండి అని లక్కీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని జున్ను చెప్తాడు. జున్ను మాటలకు మిత్ర ఆలోచనలో పడతాడు. ఇక జున్ను బయటకు వచ్చి లక్కీకి ధైర్యం చెప్తాడు. లక్కీ మాత్రం నాన్నని ఇంటికి తీసుకెళ్లిపోదాం అని గొడవ చేస్తుంది. 


మరోవైపు వసుధార తన కొడుకు అర్జున్‌తో పెళ్లి గురించి మాట్లాడుతుంది. అర్జున్ తల్లి మీద కోప్పడతాడు. తాను ఒంటరిగానే ఉంటాను అని అంటాడు. చలమయ్య కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. లక్ష్మీ అంటే నీకు ఇష్టమని ఆవిడ ఒప్పుకుంటే మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ అని చలమయ్య అంటే అర్జున్ పనివాడువి నా విషయాల్లో జోక్యం చేసుకోకు అని తిడతాడు. లక్ష్మీ అంటే నీకు ఇష్టమే కదా అని వసుధార కూడా అర్జున్‌ని అడిగితే అర్జున్‌ కోపంతో కప్పు పగిలేలా కొడతాడు. దీంతో చేతికి రక్తం కారుతుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి కంగారు పడి చేతికి కట్టు కడుతుంది. మరోవైపు మనీషా లక్ష్మీ గురించి ఆలోచిస్తుంది. టెన్షన్ పడుతుంది. ఇక దేవయాని లక్ష్మీ రాలేదు అని ఫ్రూవ్ చేస్తాను అని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్య చేసిన పనికి విలవిల్లాడిపోయిన క్రిష్.. తన దగ్గరకు రావొద్దని సత్య మీద సీరియస్!