Satyabhama Today Episode ఈ సమస్యలు అన్నీ నేను చూసుకుంటాను నీకు ఎందుకు బాబు అని విశ్వనాథం అంటే క్రిష్ నేను పరాయి వాడిని కాదు అని చెప్పు అత్తమ్మ అని విశాలాక్షితో అంటాడు. సంధ్యతో ఇక వాడు నీ జోలికి రాడు అని నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని క్రిష్ అంటాడు. అవసరం లేదు అని సంధ్య అరుస్తుంది. తాను అనాథ కాదు అని తనని చూసుకోవడానికి తన తల్లిదండ్రులు ఉన్నారని  అంటుంది. 


సంధ్య: ఆ కాళీ గాడు మా జీవితాల్లోకి రావడానికి కారణం ఎవరు మీరు కాదా. వాడు మీ ఫ్రెండ్ కాదా. అక్క విషయంలో మాకు నరకం చూపించాడు. ఇప్పుడు నా వెనక పడుతున్నాడు. ఇదంతా మీ పుణ్యమే బావగారు. ఇప్పుడు మీరు వాడిని కొట్టారు. ఊరుకుంటాడా. రెచ్చిపోయి నా మీదకు వస్తాడు. నష్టపోయేది ఎవరు మేమే కదా.
విశాలాక్షి: సంధ్యని కొట్టి నోర్ముయ్‌.. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా. నాకేంటి అనుకుంటే బావగారు వాడిని కొట్టుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చ వారే కాదు. చూడు ఒంటి నుండా ఎన్ని గాయాలో ఎంత రక్తమో. క్షమించండి బాబు. చిన్నపిల్ల ఏదో అనేసింది.
క్రిష్: మనిషి తీరే అంతలేండి. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్మేస్తాం. కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. మీరు అన్నట్లు సంధ్య చిన్నపిల్లే. పాలకు నీళ్లకు తేడా తెలియనట్లే. నా సంగతి మర్చిపోండి ఎవరు ఏమన్నా పట్టించుకోను. మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఎందుకు అంటే మీరు సంతోషంగా ఉంటేనే అక్కడ నా సత్య సంతోషంగా ఉంటుంది. ఇక అక్షింతలు తీసుకొని హర్ష, నందినిల మీద వేసి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నందినికి చెప్తాడు. చూడు సంధ్య అబద్ధం చెప్పి దగ్గర అవ్వడం నాకు చేతకాదు. అలాగే నిజం చెప్పి నమ్మించడం కూడా నాకు చేతకాదు. అందుకే నావి కాని కష్టాలు నేను మోస్తున్నాను. ఇక్కడ జరిగిన వేవీ సత్యకి చెప్పొద్దు ప్లీజ్. అని ఎమోషనల్ అవుతూ క్రిష్ వెళ్లిపోతాడు.


రేణుక పని బాగా చేయడం లేదు అని ఈ మధ్య ఏమైందని అడుగుతుంది భైరవి. ఇక సత్య వచ్చి రేణుకని భైరవి తిట్టకుండా ఆపుతుంది. కావాలి అనే తనని పుట్టింటికి వెళ్లకుండా ఆపావు అని సత్య అంటుంది. భైరవి సత్యను తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు మైత్రితో విశ్వనాథం, విశాలాక్షిలు మాట్లాడు. మైత్రిని ఇంటి వరకు డ్రాప్ చేయమని విశ్వనాథం హర్షకు చెప్తాడు. ఇంతలో నందిని వచ్చి ఏవండీ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. 


హర్ష: మైత్రిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా.
నందిని: మరి నాకు చెప్పవా.
హర్ష: వచ్చేస్తా అరగంట.
నందిని: నేను షాపింగ్‌కు పోవాలి. లేటు అయితే నాకు మూడ్ కరాబ్ అవుతుంది నీకు తెలుసు కదా.
మైత్రి: పర్లేదు హర్ష. నేను ఆటోలో వెళ్లిపోతాను లే ఏం కాదు. మీరు షాపింగ్‌కు వెళ్లండి.
నందిని: థ్యాంక్స్ నువ్వు అయినా నా మనసు అర్థం చేసుకున్నావ్. 
హర్ష: మా షాపింగ్‌కి అంత అర్జెంట్ ఏమీ లేదు. నేను వచ్చేలోపు నందిని రెస్ట్ తీసుకుంటుంది.
మైత్రి: అయ్యో వద్దులే హర్ష. 
హర్ష: ఇలా అయితే నేను నీ ఎంగేజ్‌మెంట్‌కి రాను. నువ్వు ఈలోపు వేరే సారీ కట్టుకో ఇది బాలేదు నేను ఫాస్ట్‌గా వచ్చేస్తాను.


సత్య బట్టులు సర్దుతూ ఉంటే క్రిష్ గాయాలతో గదలోకి వస్తాడు. సత్య బట్టల్లో క్రిష్ షర్ట్‌ని చూసి నా బట్టల్లో ఉందేంటి అని సత్య దాన్ని విసిరేస్తుంది. ఆ షర్ట్ వెళ్లి బెడ్ మీద కూర్చున్న క్రిష్ మీద పడిపోతుంది. సత్య వెనక్కి చూసి క్రిష్‌ గాయాలు చూసి కంగారు పడుతుంది. దగ్గరు వెళ్లబోతే క్రిష్ రావొద్దు అనేస్తాడు. 


క్రిష్: దగ్గరకు రావొద్దు. నా షర్ట్ నీ బట్టల్లో కలిస్తేనే తట్టుకోలేకపోయావ్. నా ముఖం మీద కొట్టడానికి రెడీ అయిపోయావ్. 
సత్య: అది వేరు ఇది వేరు.
క్రిష్: ఎంత మత్తులో ఉన్నా నన్ను ముద్దు పెట్టుకోవడమే ఇష్టం ఉండదు అని చెప్పేశావ్ కదా. ఎందుకు అంటే నేను కామాంధుడిని కదా. ఎందుకు అంటే నాకు నీతి, మన్ను మషానం లేదు కదా. 
సత్య: క్రిష్ ఇప్పుడు అవన్నీ ఎందుకు.
క్రిష్: చెప్పుకోవాలి కదా. నేను మనిషిని కాదు అనుకొని ముట్టుకుంటావా. నేను నీ లెక్క ఉండలేను. సమయానికి తగ్గట్టు మాట్లాడటం మారడం నాకు చేతకాదు. నీ అంత కాకపోయినా నాకు అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంది. నాకు మనసు ఉంది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండగలవేమో నేను నీ ఇష్టం వచ్చినట్లు ఉండలేను. ఎందుకంటే నీ ఇష్టాలు ఏరోజు ఆ రోజు మారిపోతాయ్ కాబట్టి. ఇంకా కొన్ని నెలలే కదా ఇంకా నేను ఎవరో నువ్వు ఎవరో నన్ను పట్టించుకోకు. నువ్వు వెళ్లి నీ పని చూసుకో. నువ్వు ఇంట్లో వాళ్లని పిలిస్తే మనం విడిపోవడానికి నాలుగు నెలలు కూడా ఆగను ఇప్పుడే చెప్తేస్తా. 
సత్య: చూడు నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను శిక్షించు నిన్ను నువ్వు శిక్షించుకోకు ఇలా ప్రాణాల మీదుకు తెచ్చుకోకు. 


సత్య క్రిష్ దెబ్బలకు మందులు తెస్తూ గీత దాటుతుంది. దాంతో క్రిష్ నువ్వు గీత దాటితే ఓకే కానీ నేను దాటితే తప్పు. నేరం అని తన చావు తనని చావనివ్వు అని అంటాడు. అయినా సత్య వస్తే వెళ్లు అని గసిరేస్తాడు. తర్వాత అలాగే పడుకుండిపోతాడు. సత్య ఏడుస్తుంది. ఇక విశ్వనాథం క్రిష్‌ని ఎందుకు అలా వేరు చేసి మాట్లాడారు అని విశాలాక్షి నిలదీస్తుంది. సత్య మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంతలా రిస్క్ చేస్తాడని అంటుంది.   క్రిష్‌కి సత్య వీడియోలను ఆ కాళీ చూపిస్తే క్రిష్ ఏమైపోతాడో అని అలా తిట్టేశాను అని విశ్వనాథం అనుకుంటాడు. ఇక క్రిష్ పడుకోగానే సత్య దగ్గరకు వెళ్లి క్రిష్ గాయాలకు కట్లు కడుతుంది.  


సత్య: నిన్ను పెళ్లి చేసుకోవాలి అని తొందర పడ్డానో విడిపోవాలి అని తొందరపడుతున్నానో తెలియడం లేదు. అప్పుడప్పుడు నీలో దాచుకోలేనంత ప్రేమ కనిపిస్తుంది. అంతలోనే ఏదో తెలియని మొండితనం, మూర్ఖత్వం వచ్చి ఆ ప్రేమను మింగేస్తుంది. నిన్ను రాక్షసుడిని చేస్తుంది. ఎంత సేపు నీ వైపు నుంచేనా నా వైపు నుంచి ఆలోచించవా. పులిని చూసి జింక పారిపోతుంది. ఎదురు తిరగలేదు. నా పరిస్థితి కూడా అంతే. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: డ్రాయింగ్ కాల్చేసిన మనోహరి, ఘోరకు అమ్మును బలి ఇస్తానన్న మనోహరి