chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్రకు కారు ప్రమాదం ఉందని తెలిసినా మిత్ర మాత్రం మొండిగా కారులో బయల్దేరుతాడు. మధ్యలో కారు ఆగిపోతే మెకానిక్ వచ్చి చూస్తాను మీరు కారు వదిలేసి వెళ్లండి అని చెప్పినా మిత్ర వినకుండా తానే రిపేర్ చేసి కారు స్టార్ట్ చేయాలని చూస్తాడు. అయితే కారు స్టార్ అవ్వకపోగా కారు ఏసీ నుంచి పొగలు వచ్చి కారు మొత్తం అలముకుంటాయి. మిత్ర ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. కారు డోర్ తీయాలని ప్రయత్నించినా తీయలేకపోతాడు. ఇక లక్ష్మి కూడా అటువైపుగా వస్తుంటుంది. మరోవైపు దీక్షితులు గారు జరగబోయే ప్రమాదాన్ని ఊహిస్తారు. 


దీక్షితులు కారు అరవిందకు కాల్ చేసి మిత్ర ఎక్కడని అడుగుతాడు. మిత్రని ప్రమాదం కబళించబోతుందని చెప్తారు. అరవింద షాక్ అయిపోతుంది. మృత్యుదేవత మిత్రకు అతి సమీపంలో ఉందని, జాగ్రత్త పడండని దీక్షితులు చెప్తారు. అరవిందతో పాటు అందరూ ఏం చేయాలో తోచక కంగారు పడతారు. తొందరగా వెళ్లమని దీక్షితులు గారు అరవిందకు చెప్తారు. మరోవైపు అరవింద ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. మరోవైపు దేవయాని దీక్షితులు మాటలు కొట్టిపడేస్తుంది. మనీషా మాత్రం నిజంగా దీక్షితుల మాటలు నిజమైతే అని కంగారు పడుతుంది. అప్పట్లో లక్ష్మీ మిత్రను కాపాడుతుందని ఇప్పుడు ఎవరు కాపాడుతారు అని అంటుంది. లక్ష్మీనే వచ్చి కాపాడుతుందేమో అని భయంగా ఉందని లక్ష్మి బతికే ఉందేమో అని మిత్రని కాపాడుతుందేమో అని కంగారు పడుతుంది. 


అరవింద, వివేక్ హడావుడిగా కారులో వెళ్తుంటారు. లక్ష్మి కారులో వెళ్తూ మిత్ర కారుని చూస్తుంది. మిత్ర చూస్తాడేమో అని కంగారుగా ముఖం దాచేసుకుంటుంది. అయితే అద్దంలో మిత్ర ఉక్కిరిబిక్కిరి అవ్వడం చూసి కారు ఆపమని డ్రైవర్‌కి చెప్తుంది. కారు దగ్గరకు వెళ్లి మిత్ర డోర్ తెరవండి అని అరుస్తుంది. మిత్ర బయట ఉన్న లక్ష్మిని చూస్తాడు కానీ గుర్తుపట్టలేడు. మిత్ర స్ఫృహా కోల్పోతాడు. ఈలోపు లక్ష్మి రాయితో కారు అద్దం పగలగొట్టి మిత్రని బయటకు తీస్తుంది. దీక్షితులు మిత్ర ప్రాణాలు కాపాడమని దేవుడిని కోరుకుంటాడు. ఇక అరవింద, వివేక్ వచ్చే సరికి లక్ష్మి మిత్రని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. అరవింద వాళ్లు లక్ష్మి వెళ్తున్న కారుని ఫాలో అవుతారు. మిత్రని లక్ష్మి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంది. తన భర్తని కాపాడాలని దేవుడిని కోరుకుంటుంది. 


మరోవైపు మనీషాకి కాల్ వస్తుంది. మిత్రకు ప్రమాదం జరిగి హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్తారు. మనీషా, దేవయాని హాస్పిటల్‌కి బయల్దేరుతారు. ఇక అరవింద, వివేక్ హాస్పిటల్‌కి వస్తారు. లక్ష్మి బయట కూర్చొని ఉంటుంది. వాళ్లు చూసే టైంకి లక్ష్మి దాక్కుంటుంది. అరవింద మిత్రని చూసి ఎమోషనల్ అవుతుంది. అరవింద మాటలు లక్ష్మి విని షాక్ అయిపోతుంది. ఇంతలో మనీషా వాళ్లు కూడా అక్కడికి వస్తారు. డాక్టర్ వచ్చి మిత్ర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, మిత్ర ప్రాణాలతో ఉండటానికి ఆ అమ్మాయే కారణం అని చెప్తారు. అరవింద ఆమె గురించి అడిగితే ఇక్కడే ఉండాలి అని డాక్టర్ అంటారు. డాక్టర్ పోలికలు చెప్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, రామ్‌ల ఫస్ట్‌నైట్ గురించి మాట్లాడిన విద్యాదేవి, మహా మీద పగ తీర్చుకొనే వరకు తగ్గేదేలేదట!