Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము కిచెన్‌లోకి  వచ్చి ఏవో తీసుకుంటుంటే అక్కడే ఉన్న మిస్సమ్మ ఏం కావాలని అడుగుతుంది. దీంతో అమ్ము మిస్సమ్మను తిడుతుంది. మా నాన్నను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోప్పడుతుంది. దీంతో మిస్సమ్మ ఆరోజు ఏం జరిగిందో నాకు అసలు గుర్తు లేదని తర్వాత చూసేసరికి నాకు పెళ్లి అయిపోయిందని చెప్తుది. దీంతో అమ్ము అయితే నాకు నిన్న ఏం జరిగిందో అసలు గుర్తు లేదని కానీ అందరూ నేను ఏదేదో చేశానని చెప్తున్నారు అంటూ భయపడుతూ చెప్తుంది అమ్ము. దీంతో మిస్సమ్మ, అమ్ము ఆలోచనలో పడిపోతారు. కిటికిలోంచి చూస్తున్న అరుంధతి కంగారుగా  గుప్త దగ్గరకు పరుగెత్తుకెళ్తుంది. మిస్సమ్మకు అనుమానం మొదలైందని చెప్తుంది. మరోవైపు మనోహరి, మంగళ, ఘోర దగ్గరకు వెళ్లి అరుంధతి ఆత్మ గురించి అడుగుతారు.


మనోహరి: నాకిప్పుడు తెలియాల్సింది. దాన్ని పైకి పంపించే మార్గం కాదు. దానికున్న శక్తుల గురించి


ఘోర: ఏ ఆత్మకు మానవ శరీరంలో ప్రవేశించే శక్తులు ఉండవు.  కానీ ఆ అమ్మాయి జనన మరణ సమయాల పుణ్యఫలం వలన శక్తులు ఉండే అవకాశం ఉంది.


మనోహరి: ఆత్మ పాప ఒంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందో లేదో తెలుసుకునే మార్గమే లేదా?


ఘోర: ఒక్కటుంది. ఆత్మ ప్రవేశించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చినచో నేను ఆత్మకు ఉన్న శక్తుల గురించి చెప్పగలను.


మంగళ: పాపను ఎట్టా తీసుకొస్తాం స్వామి వాళ్ల అయ్య మన ముగ్గురిని చంపేస్తాడు.


 అనగానే మనోహరి పాపను నేను తీసుకొస్తానని చెప్తుంది. పాపను తీసుకొస్తే నువ్వు కచ్చితంగా కనిపెట్టగలవా? అని అడగ్గానే కనిపెడతాను అని ఘోర చెప్తాడు. సరే పాపను తీసుకొస్తాను అని మనోహరి వెళ్తుంది. నాకు కావాల్సింది ఆ పాప కాదు ఆ ఆత్మ అనుకుంటాడు ఘోర. మరోవైపు పిల్లలు తాము వేసిన డ్రాయింగ్‌ వాళ్ల తాతయ్యకు చూపిస్తారు. తర్వాత మిస్సమ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆయన పిల్లలు గీసిన డ్రాయింగ్‌ గురించి చెప్పి పైన ఉంది చూడమని చెప్పగానే మిస్సమ్మ పైకి వెళ్తుంది. ఈలోపు మనోహరి వెళ్లి ఆ డ్రాయింగ్‌ కాల్చేసి వెళ్తుంది. కాలిపోతున్న డ్రాయింగ్‌ చూసి మిస్సమ్మ అరుస్తుంది. ఇంతలో అందరూ పైకి వస్తారు.


శివరాం: మిస్మమ్మ ఏమైంది..


మనోహరి: కుళ్లుతో కావాలనే  డ్రాయింగ్‌ ను కాల్చేసిన మనిషికి ఏమౌతుంది అంకుల్‌.


అంజు: డాడీ మిస్సమ్మ కావాలనే అమ్మ ఉన్న డ్రాయింగ్‌ ను కాల్చేసింది.  


నిర్మల: పొరపాటున జరిగి ఉంటుంది అంజలి. కావాలని ఎందుకు కాల్చుతుంది.


మనోహరి: అమర్‌ పక్కన ఆరు ఉండటం ఇష్టం లేక కాల్చి ఉండొచ్చు కదా? చూడండి ఆ లైటర్‌ కూడా ఇక్కడే ఉంది.


శివరాం: ఊరుకోమ్మా మనోహరి మిస్సమ్మకు నలుగురిని సంతోషపెట్టడమే తెలుసు కానీ బాధపెట్టడం తెలియదమ్మా


అంజు: లేదు తాతయ్యా.. మిస్సమ్మ కావాలనే ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక నేను డ్రాయింగ్‌ చూపించమంటే చూపించలేదు కాబట్టి.


మనోహరి: ఆరు గుర్తులను చెరిపేద్దాం అనుకుంటుందేమో అదెప్పటికీ జరగదు మిస్సమ్మ.


అమర్: డ్రాయింగ్ నువ్వే కాల్చావా మిస్సమ్మ.. అడుగుతుంది నిన్నే మాట్లాడు.


అంటూ అమర్‌ గట్టిగా గద్దించగానే అందరూ ఉలిక్కిపడతారు. ఇంతలో మిస్సమ్మ వాళ్ల నాన్న ఆ పొరపాటు నా వల్లే జరిగిందని తన మీద వేసుకుంటాడు. దీంతో మనోహరి. ఆయనను తిడుతుంటే అమర్‌ మనోహరిని తిట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మిస్సమ్మ వాళ్ల నాన్న సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత అమర్ కాలిపోయిన డ్రాయింగ్‌ తీసుకుని బాధపడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: నేను బాల‌కృష్ణ‌కి పెద్ద ఫ్యాన్.. ఆ రోజు ఆయన్ను కౌగిలించుకున్నా: విజయ్ సేతుపతి