Trinayani Today Episode విశాల్, నయని ఆస్తి పత్రాలు తీస్తారు. ఇప్పుడెందుకని హాసిని అడిగితే సుమన రేపు ఉదయం ఆస్తి అడుగుతుందని విశాల్ చెప్తాడు. దాంతో హాసిని పంపకాల పత్రాలా చిట్టీ ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆస్తి ముక్కలుగా చేయాలి అని చూస్తుందని హాసిని అంటాడు. దానికి విశాల్ ఆస్తి భాగాలు అయితే పర్వాలేదు అన్నదమ్ములు విడిపోతేనే బాధ.
నయని: ఇప్పుడు ఎవరు కలిసి ఉంటున్నారు.
హాసిని: భార్యాభర్తలే కలిసి ఉండరు. చెరొక గదిలో పడుకుంటారు. అందుకు మేమే ఉదా హరణ. ఆయన తమ్ముళ్లు అయినా మిమల్నే పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నిన్ను అమాయకుడనే అనుకుంటారు విశాల్.
విశాల్: రేపు సుమనకు ఆస్తి ఇచ్చిన తర్వాత వేరే కాపురాలు మాత్రం చేయకు అని చెప్తాను. మీరు అందరూ సపోర్ట్ చేయాలి.
హాసిని: అది సరే కానీ ఇంతకీ ఉలూచి పాముగా ఎందుకు మారలేదు అది ఆలోచించారా. అనుమానించారా.
నయని: అంటే అత్తయ్య తీసుకొచ్చింది ఉలూచిని కాదు అంటారా.
హాసిని: అలా కాదులే. ఆ మాటకు వస్తే రూపం మార్చుకొని వచ్చిన అత్తయ్యనే నువ్వు ఎవరు అని మనం నిలదీయలేదు.
నయని: అత్తయ్యని బాబుగారు గుర్తుపట్టారు. ఉలూచిని కన్న తల్లి కాకపోయినా సుమన పెంచినందుకు గుర్తు పట్టింది.
విశాల్: వదినా మీ అనుమానం ఎందరి మీద.
హాసిని: ఇంకెవరూ మీ తల్లి. సర్పదీవి నుంచి వింతలు ఏవో మోసుకొచ్చింది అనుకున్నాం. కానీ ఆమెకు ఆ వింతలకు ఏదో సంబంధం ఉంది. వాటి గురించి ఆలోచించాలి.
విశాల్: ముందు అయితే ఆస్తిలో వాటాని సుమనకు ఇచ్చేద్దాం. తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వెసులు బాటు కల్పిస్తారు. లేదంటే గొడవలు అవుతాయి.
ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. సుమన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వల్లభ తిలోత్తమ గురించి అడుగుతాడు. బయటకు వెళ్లిందని విశాల్ చెప్తాడు. ఇంతలో విశాలాక్షి, డమ్మక్క వస్తారు. వస్తూనే డమ్మక్క వల్లభతో మా అమ్మ వస్తే మీ అమ్మ ఉండదు పుత్ర అని చెప్తుంది. సుమన విశాలాక్షిని చూసి తన అదృష్టం విషయంలో ఏం చేయలేదు అని అంటుంది. ఇక సుమన అందరికీ హరతి ఇస్తుంది. ఇక సుమన విశాలాక్షి దగ్గరకు వెళ్లి హారతి తీసుకోమంటుంది.
నయని: బాబుగారు ఆస్తి పత్రాలు తీసుకురావాలా.
విశాల్: అన్నీ అవసరం లేదు నయని. మీ చెల్లి వాటా 60 కోట్లు దానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేసి పెట్టాను.
హాసిని: అవి నా దగ్గర ఉన్నాయ్. తీసుకురానా విశాల్.
విశాల్: హా.. వదిన..
సుమన: అక్క వచ్చేటప్పుడు ఉలూచిని కూడా తీసుకొని రా.
విశాలాక్షి: తిలోత్తమకు అంత ఆస్తి ఎలా వచ్చిందో అడిగారా.
పావనా: అడిగితే చెప్పడం లేదు.
విశాలాక్షి: అదే కదా అసలు కథ. తెలుసుకోవడానికి ప్రయత్నించండి అవే తెలుస్తాయి.
హాసిని ఇంకా రాలేదు అని అనుకుంటారు .ఇంతలో హాసిని పేపర్లతో పాటు పల్లెం తీసుకొని వస్తుంది. అందరూ హడావుడి చేస్తుంది అంటుంది. బొంగుకర్రలో పేపర్లు పెట్టావా అని అందరూ అడుగుతారు. అసలు పేపర్లే తీసుకురాలేదు అని అంటుంది. ఉలూచిని ఎందుకు తీసుకురాలేదు అని సుమన అడుగుతుంది. దానికి విశాలాక్షి తీసుకొచ్చింది కదా పళ్లెంలో అని అంటుంది. ఇక చూపించమని విశాలాక్షి అంటే హాసిని ఉలూచి ఈ బొంగులోనే ఉందని ఆ కర్ర బయటకు తీస్తుంది. ఆ కర్ర లోపల నుంచి పాముగా మారిన ఉలూచి బయటకు స్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు.
విశాలాక్షి: ఉలూచి పాపే తను.
సుమన: అలా ఎలా అవుతుంది. నా బిడ్డ పగలు ఆడపిల్లలా రాత్రి పాము పిల్లగా మారుతుంది. నిన్న రాత్రి పాముగా మారనందుకే కదా నాకు ఇప్పుడు ఆస్తిలో వాటి ఇవ్వమని నేను డిమాండ్ చేసింది.
విక్రాంత్: ఏయ్ నీకు ఆస్తి దక్కించుకొనే అదృష్టం లేదు అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు.
వల్లభ: అంటే ఇప్పుడు పగలు పాములా రాత్రి పిల్లలా మారుతుందా.
సుమన: లేదు ఏదో జరిగింది. మోసం చేశారు ఎవరో. ఇందాకే నా బిడ్డకు స్నానం చేసి కొత్త డ్రస్ వేశాను.
హాసిని ఆ డ్రస్ తీసి చూపిస్తుంది. గదిలోకి వెళ్లి చూసేసరికి ఈ డ్రస్ సాక్సులు పడి ఉన్నాయని అంటుంది. సాక్సుల్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు చిన్నారి పాదాలకు వేసిన వాటిని తొలగించిన తర్వాతే ఉలూచి మళ్లీ పాము పిల్లగా మారిపోయింది. వాటిని తీయకూడదు అని తిలోత్తమ అమ్మ చెప్పే ఉంటుంది అని విశాలాక్షి అంటుంది. దానికి సుమన అవును చెప్పింది కానీ నిన్నటి నుంచి ఉన్నాయి అని తీసేశా అంటుంది. ఇక విశాలాక్షి అదే నువ్వు చేసిన పొరపాటు అని అంటుంది. దానికి సుమన నీ గారడీనే కారణం అని అంటుంది. దానికి విశాలాక్షి గారడీ చేయలేదు అని అంటుంది. ఇక డమ్మక్క సాక్సులు తీయడం వల్లే ఇలా జరిగిందని అంటుంది. ఇక సుమన విశాలాక్షి జుట్టు పట్టుకోవడానికి వెళ్తే నయని ఒక్కటి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.