chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్కీ స్కూల్‌ మార్పించే విషయమై మిత్ర ప్రిన్సిపల్‌తో మాట్లాడుతాడు. దీంతో లక్కీ డల్ అయిపోయి బయటకు వస్తుంది. ఇంతలో లక్ష్మీ జున్నుని స్కూల్‌కి తీసుకొచ్చి లక్కీని చూస్తుంది. లక్కీ తనని తన తండ్రి స్కూల్ మాన్పించి వేరే స్కూల్‌లో చేర్పిస్తున్నారు అని బాధగా  చెప్తుంది. జున్నుతో పాటు లక్ష్మీ కూడా షాక్ అయిపోతుంది. లక్కీ తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తుందనే స్కూల్‌ మాన్పించేస్తున్నారు అని జున్ను చెప్తాడు.  


లక్ష్మి: జున్నుకి తోడుగా ఉంటావ్ అనుకున్నా వదిలేసి వెళ్లిపోతావా. 
లక్కీ: మిమల్ని వదిలేసి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అమ్మ ఒకసారి మా నాన్నతో మాట్లాడుతావా. నేను చిన్న పిల్లని కదా నా మాటను నాన్న లెక్కచేయడం లేదు. నువ్వు పెద్దదానివి కదా అందుకే ఒక సారి మాట్లాడు అమ్మ. 
లక్ష్మి: నేను చేస్తే ఆయన వింటారా.
లక్కీ: ఒక్కసారి చెప్పే కదా అమ్మ వింటారో లేదో తెలుస్తుంది. 
లక్ష్మి: సరే నేను ఒకసారి చెప్పి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి.


మరోవైపు అరవింద మిత్రకు ప్రమాదమని ఆ విషయం మిత్రకు చెప్పడానికి తెగ టెన్షన్‌ పడతాడు. ఇక లక్ష్మి మిత్ర దగ్గరకు వెళ్తుంటుంది. మిత్ర దగ్గరకు వెళ్లే టైంకి జున్నుతల్లిని బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆయన ఊరికే తిడతారు అని అంటారు. ఆయన గురించి నీకు కూడా బాగా తెలుసమ్మ అని అంటాడు. ఎవరు అని లక్ష్మి అడిగితే ఆయన ఒకరోజు గొడవ చేశారు అని పొడవుగా ఉంటారు అని ఇంకా జున్ను చెప్తూ ఉంటే లక్ష్మి జున్నుని ఆపేస్తుంది.  మరోవైపు అరవింద మిత్ర, జానులకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అని కంగారు పడుతుంది. 


ఇంతలో జానుకి ఆయా ఫోన్ ఇస్తుంది. జాను చూసి వివేక్‌, అరవింద ఇన్ని సార్లు ఫోన్ చేశారు ఏంటా అనుకుంటుంది. అరవిందకు కాల్ బ్యాక్ చేస్తుంది. అరవింద మిత్ర స్కూల్‌ దగ్గర ఉంటే ఇవ్వమని చెప్తుంది. జాను కనుక్కోవడానికి వెళ్తుంది. మిత్రను చూసి అత్తయ్య గారు అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు అని ఫోన్ ఇస్తుంది. మిత్ర అరవిందతో మాట్లాడుతుంది. దీక్షితులు గారు చెప్పిన ప్రమాదం గురించి చెప్తుంది. కారు నడపొద్దని చెప్తుంది. అయినా మిత్ర వినకుండా తనకు ఏం కాదు అని చెప్పి వచ్చేస్తా అంటాడు. ఇక లక్కీని పిలిచి వెళ్లిపోదామని అంటాడు. జాను ఏమైందని అడిగితే వేరే స్కూల్‌లో చేర్పిస్తాను అని పూర్తి వివరాలు తర్వాత చెప్తాను అని అంటాడు. ఇక లక్కీ ఫ్రెండ్స్‌తో కలిసి వస్తాను అని అంటుంది. లక్కీని జానుకి అప్పగించి మిత్ర బయల్దేరుతాడు. లక్కీ మళ్లీ లక్ష్మి దగ్గరకు వచ్చి ఎమోషనల్ అవుతుంది. లక్కీ, జున్ను ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తారు.


ఇక లక్కీని వెతుక్కుంటూ జాను వస్తుంటుంది. లక్ష్మి కూడా అటుగా వస్తుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకుంటారు. లక్ష్మి జానుని చూస్తుంది. జాను పిలిచినా లక్ష్మి వెనక్కి తిరగకుండా వెళ్లిపోతుంది. మరో వైపు మిత్ర కారులో వెళ్తుంటాడు. ఇంతలో కారు రిపేర్ వస్తుంది. మిత్ర మెకానిక్‌కి కాల్ చేస్తాడు. మెకానిక్ కారు వదిలేసి వచ్చేయ్ మంటాడు. మిత్ర మెకానిక్ మీద కూడా అరుస్తాడు. తానే చూసుకుంటా అని చెప్పి మళ్లీ కారు ఎక్కుతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తకి వీడియో చూపించి చెమటలు పట్టించేసిన సీత.. జీవితంలో తనకి కాల్ చేయొద్దని మహాకి చెప్పేసిన మధు!