Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode పారిజాతం తన కోరికను చెప్తాను అంటుంది. కార్తీక్ జ్యోత్స్నలను పిలిచి జ్యోత్స్న పుట్టినప్పుడు కాంచన తన అన్న దశరథ్‌ని తన మేనకోడలిని ఇంటి కోడలిగా పంపించమని అడిగి మాట తీసుకుందని అంటాడు. ఇక దశరథ్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. జ్యోత్స్న నా కూతురు కాదు నా చెల్లెలి కోడలు.
పారిజాతం: మీరు అన్నమాటని మీరే గుర్తు చేసుకొంటున్నారు కానీ వీళ్ల పెళ్లి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. మిమల్ని అడిగితే కాంచనను అడుగుతా అంటారు. కాంచనను అడిగితే కార్తీక్‌కు అడుగుతా అంటుంది. కార్తీక్‌ని అడిగితే రెస్టారెంట్ అంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరంతా ఆలోచిస్తున్నారా. ఆలోచించరు ఎందుకు అంటే మీకు ఆలోచించే అంత మనసు లేదు. మనసులో ఒకటి పెట్టుకొని ఎప్పటికైనా అదే జరుగుతుందని అనుకుంటున్నారు.
శివనారాయణ: మరి నువ్వు ఏం అనుకుంటున్నావ్.
పారిజాతం: మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు.
సుమిత్ర: ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య.
పారిజాతం: నిజం మాట్లాడుతున్నాను. కార్తీక్‌కి జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
కార్తీక్: మనసులో.. థ్యాంక్స్ పారు ఇన్నాళ్ల నా బాధని ఇలా పోగొట్టావ్.
జ్యోత్స్న: మనసులో..గ్రానీ ఏంటి ఇలా మాట్లాడుతుంది.
దశరథ్: నీకు ఏమైంది పిన్ని. నువ్వేనా ఇలా మాట్లాడేది.
శివనారాయణ: బుర్ర పనిచేయడం లేదు అనుకుంటా. రెండు చెంపల్ని వాయిస్తే సరిపోతుంది.
పారిజాతం: అయితే మీరు వాయించాల్సింది నన్ను కాదు మన చుట్టాలని. ఇలా వాగింది వాళ్లే కాబట్టి.
జ్యోత్స్న: ఏం మాట్లాడుతున్నావో నీకు అయినా అర్థం అవుతుందా గ్రానీ.
పారిజాతం: కార్తీక్, జ్యోత్స్నలకి పెళ్లి అనుకున్నారు కానీ చేయరు అంటకదా. అందరూ అనుకుంటున్నారు. నేను అదే నిజం అని నమ్ముతున్నాను. నేను అనుకున్నది నిజం కాదు అని నేను నమ్మాలి అంటే నా కోరిక తీర్చాల్సిందే. ఊరికే మీరు మాటలు అనుకోవడం కాదు వచ్చే ముహూర్తానికే కార్తీక్, జ్యోత్స్నలకు పెళ్లి చేయాలి. నాకు మీరు మాట ఇవ్వాలి.
కార్తీక్: పారు నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా.
పారిజాతం: నీ మనసులో మాటే నేను అడుగుతున్నా మనవడా.
సుమిత్ర: వీళ్లిద్దరి పెళ్లి చేయాలి అని మాకు తొందరిగానే ఉంది అత్తయ్య.
పారిజాతం: ఇప్పుడు నా కోరిక ఏంటి అంటే మన అందరి సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్, జ్యోత్స్నకు చేతిలో చేయి వేసి ప్రమాణం చేయాలి.
కార్తీక్: మనసులో.. పారుకి నేను చెప్పింది ఏంటి తను చేస్తుంది ఏంటి. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మా రెండు కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఉంది.
జ్యోత్స్న: నేను రెడీ గ్రానీ.
కార్తీక్ ప్రమాణం చేసే టైంకి దీప కూతురు శౌర్య తుమ్ము తుంది. దీంతో ప్రమాణం చేయకుండా ఆగిపోతారు. చిన్న పిల్లల తుమ్ము లెక్కలోకి రాదు అని శివనారాయణ అంటే మళ్లీ కార్తీక్ ప్రమాణం చేస్తాడు. కార్తీక్‌కి ఇష్టం లేదు ఏమో అని దీప అనుమానిస్తుంది. తర్వాత కేక్ కటింగ్ అవుతుంది. అందరూ సంతోషంగా ఉంటే కార్తీక్ మాత్రం డల్ అయిపోతాడు. ఇక కార్తీక్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. దీప కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వస్తుంది.
జ్యోత్స్న కార్తీక్‌ని నిలదీస్తుంది. తన చేతిలో చేయి వేసి ప్రమాణం చేయడానికి తన చేయి ఎందుకు ముందుకు రాలేదు అని అడుగుతుంది. చేతిలో చేయి వేయగానే చేతిని వెనక్కి లాగేసుకున్నావ్ అని ప్రశ్నిస్తుంది. నీ మనసులో ఏం ఉందో తెలియాలి అని జ్యోత్స్న నిలదీస్తుంది. తాను అంటే ఇష్టం ఉందా లేదా అని కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. కార్తీక్ జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు అని చెప్తాడు. అయితే కార్తీక్ తిరిగి చూసే సరికి అక్కడ పారిజాతం ఉంటుంది. దాన్ని ఇక్కడి నుంచి పంపేశాను అని పారిజాతం చెప్తుంది. నిన్ను చాలా నమ్మాను అని నన్ను మోసం చేశావ్ అని కార్తీక్ అంటాడు. దీన్ని మాట నిలబెట్టడం అంటారు అని పారిజాతం అంటాడు. తప్పు చేస్తున్నావ్ పారు అని కార్తీక్ అంటే మరి నువ్వు చేస్తుంది ఏంట్రా అని పారిజాతం నిలదీస్తుంది. నీ మనసులో మరో మనిషి ఉంది అని దానికోసమే జ్యోత్స్నని వద్దు అని అంటున్నావ్ అని అంటుంది. పారు మీద కార్తీక్ సీరియస్ అవుతాడు. అయినా పారు ఒప్పకోకుండా ముందే నీకు దీపకు పరిచయం ఉంది అని నాకు తెలుసు అని నిలదీస్తుంది. దీపని ఇంటి దగ్గర చూడగానే ఈవిడ ముందే తెలుసు అని ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తుంది. కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పాముగా మారని ఉలూచి పాప.. సుమనకు కలిసొచ్చిన కోట్ల విలువైన ఆస్తి!