Trinayani Today Episode తిలోత్తమ చేతి గ్లౌజ్ గురించి విక్రాంత్ మాట్లాడుతాడు. ఆ గ్లౌజ్ తీయమని తిలోత్తమకు చెప్తాడు. దీంతో తిలోత్తమ చాలా ఆవేశంతో విక్రాంత్‌ను తిడుతుంది. అమ్మని కూల్‌గా ఉండమని విశాల్ చెప్పి విక్రాంత్‌కి విసిగించొద్దని అంటాడు. ఇక దురంధర కూడా విక్రాంత్‌ని సపోర్ట్ చేస్తే దురుంధర వైపు తిలోత్తమ సీరియస్‌గా చూస్తుంది. తర్వాత దురంధర సారీ చెప్పడంతో కూల్‌గా నవ్వుతుంది. ఇక గాయత్రీ పాపని ఎత్తుకుంటుంది తిలోత్తమ.


నయని: బాబుగారు గాయత్రీ చూశారా ఊరికే ఉంది. అత్తయ్యని తను కూడా గుర్తు పట్టింది.
విశాల్: కచ్చితంగా గుర్తు పడుతుంది. నయని.
తిలోత్తమ: ఎల్లుండి గాయత్రీ అక్కయ్య వర్ధంతిని ఘనంగా జరిపిద్దాం విశాల్. అక్కయ్యకు పునర్జన్మ లభించినట్లే సర్పదీవికి వెళ్లి వచ్చిన తర్వాత నాకు పునర్జన్మ లభించినట్లే.
దురంధర: పెద్ద వదిన మళ్లీ పుట్టిన తర్వాత వర్ధంతి ఎందుకు జరిపించాలి.
నయని: అవును కదా బాబుగారు.
విశాల్: నయని ఆ జన్మ తాళూక పూర్వపు వాసనలు ఇంకా అంటుకొని ఉంటాయి. ఆచారం ప్రకారం చేద్దాం.
తిలోత్తమ: రెండు పుష్కరాలు పూర్తి అయిన సందర్భంగానైనా చేయాలి.


ఉలూచి గట్టిగా ఏడుస్తుంది. సుమనపైకి వస్తుంది. తిలోత్తమ కూడా అక్కడికి వస్తుంది. ఉలూచి రాత్రి అయినా పాముగా మారలేదు అని తిలోత్తమ సుమనకు చెప్తుంది. సుమన షాక్ అయి ఆనందంతో ఉబ్బితబ్బిబై అవుతుంది. తన బిడ్డను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అని సంతోష పడుతుంది. ఈ విషయం అందరికీ చెప్పాలని సుమన పరుగులు తీస్తుంది.


తిలోత్తమ: నాలో మార్పు వచ్చింది. నీ బిడ్డలో మార్పు ఆగింది. ఎందుకు ఎలా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ చిన్న కోడలా.
సుమన: అక్కా బావగారు అంటూ అందర్ని పిలుస్తుంది. ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు అండీ. నా కూతురు ఉలూచిని చూడండి. 
తిలోత్తమ:  విశాల్ తిలోత్తమ ఓవర్ ఎగ్జైట్‌మెంట్‌లో సరిగా చెప్పలేకపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత పాముపిల్లగా మారాల్సిన ఆడపిల్ల అలాగే ఉంది అన్న విషయం సుమనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.  అందరూ సంతోషిస్తారు. ఉలూచిని ఎత్తుకొని ముద్దాడుతారు. 
నయని: ఈ రోజుని బాగా గుర్తుంచుకోవాలి చెల్లి అత్తయ్య ఉలూచి తిరిగి వచ్చిన రోజే కాదు. పాముగా మార్చాల్సిన ఉలూచి పాపగానే ఉంటూ అందరిని ఆనంద పరిచిన రోజు. వచ్చే ఏడాదిని ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవాలి.
తిలోత్తమ: అందరి కంటే ఎక్కువ సంతోషంగా సుమనే ఉండాలి. ఉలూచి పాము పిల్లగా మారడం లేదు అంటే నయని తన ఆస్తిలో సగం ఉలూచి పేరు రాసి ఇవ్వాలి కదా విక్రాంత్. 
సుమన: ఎస్.. అత్తయ్య చెప్పింది కరెక్టే నాకు ఆస్తి వచ్చేస్తుందొచ్‌..
వల్లభ: గెలిచావ్ చిన్న మరదలా.
దురంధర: అవునే సుమన ఏ పిల్ల వలన నీకు ఆస్తి రాకుండా పోయిందో అదే పిల్ల వల్ల నువ్వు కోటీశ్వరురాలివి అవుతున్నావు.
సుమన: థ్యాంక్యూ సోమచ్ పిన్ని. నేను కోటీశ్వరురాలిని అయిపోయాను. నాకు యాభై కోట్లు వచ్చేశాయ్.
విక్రాంత్: అప్పుడే వచ్చేశాయి అని కలలు కనకు. కోట్ల మీద పడుకోకు.
నయని: ఉలూచి మామూలుగా మారినందుకు మాకు సంతోషంగా ఉంది. ఆస్తి ఇవ్వమని మేం ఏం చెప్పలేదు కదా అత్తయ్య. 
విశాల్: ఇంకో విషయం 50 కాదు 60 కోట్లు. కంపెనీ లాభాలు పెరిగింది. అందుకే 60 కోట్లు.
దురంధర: విష్ మీ కష్టార్జీతం కద ఇవ్వడం ఎందుకు.
నయని: ఇవ్వాలి పిన్ని. 
హాసిని: చెల్లి దగ్గరున్న ఆస్తి పంచమని చెప్పడం కాదు. పది రోజుల్లో అంత డబ్బు ఎలా వచ్చిందో అడగండి మీ అమ్మని. 
తిలోత్తమ: నీకు అవసరమా..
హాసిని: నాకు మీ సొమ్ము అవసరం లేదు కానీ లెక్క కావాలి. ఎక్కడో డబ్బు దోచుకొని వచ్చి మనకు సలాం కొట్టమని అంటే ఎలా.
తిలోత్తమ: పళ్లు రాలతాయ్. 
సుమన: మీరంతా నాకు రేపటికి ఆస్తి పంచి ఇవ్వాలి.


ఇక సుమన పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుంటే విక్రాంత్ వచ్చి గట్టిగా తిడతాడు సుమనను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కాజిరంగా నేషనల్ పార్క్‌లో 'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ - ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోన్న ప్రేరణ!