Kirrak RP Comments On Allu Arjun: ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా కూడా దాని వల్ల మొదలయిన పొలిటికల్ హీట్ ఇంకా ముగిసిపోలేదు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో చేతులు కలిపి కూటమిగా మారి పోటీ చేయడం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఒక్క అల్లు అర్జున్ తప్పా. అందుకే అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు జబర్దస్త్ కామెడియన్ కిరాక్ ఆర్పీ సైతం ఈ హీరోకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయమైంది. 


ఫ్యాన్స్ దాడి..


ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ కూడా మొదట్లో తాను పవన్ కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కానీ చివరికి వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ మద్దతు తెలిపాడు. దీంతో మెగా ఫ్యామిలీ చీలిపోయిందని నెటిజన్లలో చర్చ మొలదయ్యింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నాగబాబు సైతం ఇదే విషయంపై ట్వీట్ చేసినా దాని వల్ల ఎన్నో విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. జబర్దస్త్ కామెడియన్ కిరాక్ ఆర్పీ కూడా అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడంతో ఆయన ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. తనపై, తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్టాల్స్‌పై దాడి చేశారు. దీంతో ఆర్పీ.. అల్లు అర్జున్‌పై ఫైర్ అవుతూ ఒక వీడియో విడుదల చేశాడు.


గాడిద అనుకోండి..


‘‘గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ గారు. మీరు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీకు పతనం మొదలవ్వబోతుంది. నేను ఎవ్వరికీ భయపడను. నీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాక్ ఆర్పీ. ఎవడి ఫ్యామిలీ వాడికి ఉంటుంది. మీరు ఆరోజు తప్పు చేశారని ఇప్పటికీ చెప్తున్నాను. మీరు ఇష్టముంటే నా మాట నమ్మండి. లేకపోతే వీడొక గాడిద అనుకొని వదిలేసేయండి. ఇంట్లో వాళ్లను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆర్మీ అంటే జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు. వాళ్లంతా నిస్వార్థంగా పనిచేశారు, దెబ్బలు తిన్నారు. వాళ్లపై వందల కేసులు ఉన్నాయి’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు కిరాక్ ఆర్పీ.


అప్పుడు గర్వపడతాం..


‘‘ఆర్మీ అంటే దెబ్బలు తిని జనసేన నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, జెండా మొసుకుంటూ నిలబడినవాళ్లే. ఎక్కడ నుండి వచ్చింది నీకు ఆర్మీ? ఆడవాళ్లను పట్టుకొని తిట్టేది ఆర్మీనా? సినిమాలు చేసుకో ప్యాన్ ఇండియా స్టార్ అవ్వు ఇండియా తరపున మేము కూడా గర్వపడతాం. మీరు ఒక గొప్ప హీరో. నేను కాదనడం లేదు. కానీ ఆర్మీ అనేది ఎక్కడ నుండి వచ్చింది? మీకు అభిమానులు ఉన్నారని చెప్తే నేను వింటా. కానీ ఆర్మీ ఉందని కబుర్లు చెప్పి ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడితే కిరాక్ ఆర్పీ ఒప్పుకోడు. మీరేం చేస్తారో చేసుకోండి’’ అంటూ అల్లు అర్జున్‌కు నేరుగా ఛాలెంజ్ విసిరాడు ఆర్పీ. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి తనను టార్గెట్ చేస్తున్నారు.


Also Read: నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ తెలియదు - విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్