Trinayani Today Episode ఉలూచిని విశాలాక్షి గారడి చేసి పాముగా మార్చిందని సుమన భావించి చేయి ఎత్తుకొని వెళ్తుంది. దీంతో వెంటనే నయని వచ్చి సుమన చెంప పగల గొడుతుంది. ఆస్తి రాలేదని ఫీలవ్వొద్దని ఎలాగూ ఆస్తి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇస్తానని విశాల్ అంటాడు. సుమన హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నయని మాత్రం చిల్ల గవ్వ కూడా ఇవ్వనివ్వను అని అంటుంది. తాను కూడా సంతకం పెడితేనే ఆస్తి వాటా తనకు వెళ్తుందని అందుకే తను ఆ ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టను అని తెగేసి చెప్తుంది నయని.
నయని: మా చెల్లి పొగరు దగ్గరుండి చూసిన దాన్ని ఆస్తి వచ్చిన తర్వాత పాము పిల్ల ఆడ పిల్ల నాకు ఎందుకు అని వదిలేసినా ఆశ్చర్యం లేదు. అందుకే పూర్తి అర్హత సంపాదించే వరకు ఒక్క రూపాయి కూడా రాసిచ్చే ప్రసక్తే లేదు.
విశాలాక్షి: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ అమ్మ.
డమ్మక్క: ఇంకేం చూస్తున్నావ్ సుమన ఉలూచిని తీసుకెళ్లి పాలు ఇవ్వు.
తిలోత్తమ: ఏంటి స్వామి మీరు కూడా నన్ను గుర్తు పట్టడం లేదా.
అఖండ: నీ దేహం మారలేదు తిలోత్తమ నీ రూపం మాత్రమే మారింది. సర్పదీవి నుంచి బయట పడ్డాక నువ్వు ఎవరిని కలిశావో ఏం చేశావో నాకు అంతా తెలుసు.
తిలోత్తమ: నాకు తెలియని ఒక విషయం కోసం వచ్చాను స్వామి.
అఖండ: నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంట్లో లేవో చెప్తే నీ సందేహం కూడా నివృత్తి అవుతుంది తిలోత్తమ.
తిలోత్తమ: నేను గుమ్మం ముందు నిలబడి ఫోన్ మాట్లాడుతున్నా స్వామి ఉన్నట్టుండి నా కుడి చేతి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయి. ఏం అయ్యాయా అని చూస్తే విశాలాక్షి ఇంటి వైపు వస్తుంది. తన దగ్గరకు వస్తే నా కుడి చేయి నా నుంచి దూరంగా వెళ్లిపోతుంది అనిపించింది. గారడీ పాపలో మంత్రం ఉందో మాయ ఉందో తను నా రూపానాకి శాపం కాకూడదు అనుకొని అక్కడి నుంచి దూరంగా వెంటనే మీ దగ్గరకు వచ్చాను. ఎందుకు ఇలా జరిగింది అంటారు.
అఖండ: తిలోత్తమ ఆ చేతిని నువ్వు ఏం చేశావు.
తిలోత్తమ: అంటే స్వామి అది..
అఖండ: మానవాతీత శక్తిని ఆపాదించుకునే ప్రయత్నం చేశావ్. తంత్ర, మంత్ర, కుతంత్ర శక్తిని కూడ దీసుకున్నా సరే విశాలాక్షి శక్తి ముందు సరిపోదు తిలోత్తమ. నివ్వెరపోయావా తిలోత్తమ.
తిలోత్తమ: గారడి పిల్ల ఆఫ్ట్రాల్ మ్యాజిక్‌లు చేసుకొనే అనాథ నన్ను మించిన శక్తి కలదా.
అఖండ: ఈ గర్వమే మనిషిని నిలువెల్లా ముంచేస్తుంది. నిన్ను మించిన శక్తి లేదు అని విశాలాక్షిని చూడగానే పారిపోయి వచ్చావు.
తిలోత్తమ: నా చేతికి ఏమైందో అని వచ్చాను.
అఖండ: నీ చేతిని అలా మార్చిన వారి దగ్గరకు వెళ్లకుండా నా దగ్గరకే ఎందుకు వచ్చావ్. నీ మనసు రప్పించింది. పరిష్కారం దొరకకపోతే ఏమవుతావో అనే భయం ఈ పని చేయించింది. విశాలాక్షి ఓ శక్తి. పరమేశ్వరుడిని తను ఆరాధించినట్లు, తను మమేకం అయినట్లు ఎవరూ చేయలేరు.
తిలోత్తమ: శివభక్తురాలిని నిలువరించడం ఎలా.
అఖండ: భక్తితోనే అంటూ చేతికి పువ్వు ఇచ్చి అది విశాలాక్షికి భక్తితో సమర్పించమని ఎప్పుడూ తన జోలికి వెళ్లొద్దని చెప్తారు. లేదంటే తన దరిదాపుల్లోకి వెళ్లలేవని తన జోలికి వెళ్తే ఈ రూపం కూడా నీకు మిగలదు అని అఖండ హెచ్చరించి పంపిస్తారు.
ఆస్తి పోయిందని సుమన ఏడుస్తుంది. విక్రాంత్ వెటకారంగా సెటైర్లు వేస్తాడు. మరోవైపు హాసిని విశాల్, నయనిల దగ్గరకు నవ్వుతూ వెళ్తుంది. ఎందుకు నవ్వుతున్నావ్ అని ఇద్దరూ అడిగితే సుమన ఆస్తి వస్తుందని గెంతిందని ఇప్పుడు ఢీలా పడిపోయిందని అంటుంది.
నయని: నాకు అర్థం కానిది ఒకటే అక్క. ఉలూచి పాప కాళ్లకు వేసుకున్న సాక్సులు మా చెల్లి తీయడం తర్వాత పాము పిల్లగా మారిందని విశాలాక్షి చెప్తుంది. సాక్సులు తీసేస్తే మార్పు ఎలా వస్తుంది.
విశాల్: ఆ సాక్సుల్లోనే గమ్మత్తు ఉంది అనుకుంటా నయని.
నయని: పాప సాక్సుల వల్ల మార్పులు జరిగితే తిలోత్తమ అత్తయ్య చేతికి వేసుకున్న గ్లౌజ్ వల్ల కూడా ఏదైనా మార్పు జరుగుతుందా.
విశాల్: ఆ గ్లౌజ్‌ల జోలికి వెళ్తే అమ్మ అపరకాళిలా మారిపోతుంది. అది తెలిశాక ఇంకా ఏం తెలుసుకోవాలి అని.
నయని: అది తెలుసుకోవాలి అంటే ఈ విషయంలో ఇంకేం తెలుసుకోలేం సుమనకు సాయం చేయలేం. ఉలూచి పాప పెరిగి పెద్దయ్యే కొద్ది అందరికీ సమాధానం చెప్పి జీవనం సాగించాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. రిస్క్ చేద్దాం.
మరోవైపు తిలోత్తమ అఖండ స్వామి ఇచ్చిన పువ్వు తీసుకొని వస్తుంది. ఇక హాల్‌లో విశాలాక్షి ధ్యానం చేస్తుంటుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. తిలోత్తమ చేతిలో పువ్వు చూస్తారు. ఇక తిలోత్తమ విశాలాక్షికి పువ్వు ఇవ్వాలి అనుకుంటుంది. ఇక సుమన విశాలాక్షి అంత ఘనకార్యం చేయలేదు అని ఇంట్లో జరిగిన సంగతి తనకు తెలియాలి అని సుమన అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.