టీవీ సీరియల్ టీఆర్పీ విషయంలో 'స్టార్ మా' ఛానల్ సీరియల్స్ ప్రతి వారం టాప్ ప్లేసులో ఉంటాయి. వాటిదే దూకుడు. టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్ 10 సీరియల్స్ లిస్టు తీస్తే అందులో మొదటి ఐదు స్థానాలలో ఆ ఛానల్ సీరియల్స్ ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మరి, టీవీ షోస్ విషయానికి వస్తే? స్టార్ మా ఛానల్ షో టాప్ ప్లేసులో ఉంది. అయితే, ఆ తర్వాత ఈటీవీ షోస్ దూకుడు చూపిస్తున్నాయి. 


శ్రీముఖి దూకుడుకు సాటేది...
ఆదివారం వచ్చే ఆ షో టాప్!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం... ప్రతి ఆదివారం 'స్టార్ మా' ఛానల్ టెలికాస్ట్ చేసే షో ఇది. దీనికి శ్రీముఖి యాంకర్. ముక్కు అవినాష్, సంజీవ్ సైతం కామెడీ చేస్తారు. స్టార్ మా సీరియళ్లలో నటించే ఆర్టిస్టులతో ప్రతి వారం సరికొత్త స్కిట్స్ చేస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఈ షో లేటెస్ట్ టీఆర్పీ 4.01. 


రియాలిటీ షోస్ టీఆర్పీ తీస్తే... 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' టాప్ టీఆర్పీ సొంతం చేసుకుంది. దీని తర్వాత స్థానాల్లో ఈటీవీ రియాలిటీ షోస్ ఉన్నాయి.


'జబర్దస్త్' కంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి ఎక్కువ!
ఈటీవీలో ప్రస్తుతం శుక్ర, శని వారాల్లో ప్రసారం అవుతున్న కామెడీ రియాల్టీ షో 'జబర్దస్త్'. దీనికి రష్మీ గౌతమ్ యాంకర్. సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ జడ్జీలు. 'జబర్దస్త్' లేటెస్ట్ టీఆర్పీ 2.52. అయితే ఈ వీక్ ఈటీవీ షోస్ టీఆర్పీ లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ దీనికి కాదు. 


'జబర్దస్త్' కంటే రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్న మరో ఈటీవీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఆ షో లేటెస్ట్ రేటింగ్ 3.10. అందులో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ జడ్జ్. ఒకప్పుడు 'జబర్దస్త్' అంటే సుడిగాలి సుధీర్ టీమ్ గుర్తుకు వచ్చేది. ఇప్పుడు ఆయన స్కిట్స్ చేయడం లేదు. కానీ, 'ఫ్యామిలీ స్టార్స్' షోకి యాంకరింగ్ చేస్తున్నారు. ఆ షో టీఆర్పీ 2.44.


Also Readటీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు


ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే 'సుమ అడ్డా' షో 2.00 టీఆర్పీ అందుకుంది. కేవలం సుమ కనకాల యాంకరింగ్ మీద ఈ షో రన్ అవుతోంది. హన్సిక, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న 'ఢీ జోడీ' లేటెస్ట్ టీఆర్పీ 2.08. సింగింగ్ రియాలిటీ షో 'పాడుతా తీయగా' టీఆర్పీ 1.74. జెమినీ టీవీలో వచ్చే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టీఆర్పీ 0.68. 


ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే ఈటీవీ న్యూస్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో మంది చూస్తారు. ఆ ప్రోగ్రాం టీఆర్పీ 3.67. లాంచింగ్ వీక్ మంచి టీఆర్పీ అందుకున్న ఓంకార్ 'ఇస్మార్ట్ జోడీ సీజన్ 2'కి ఈ వారం సరైన టీఆర్పీ రాలేదు. జనాలు అసలు చూడలేదు.


Also Readప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్‌ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!