Top 10 Telugu serial list TRP Ratings: 'కార్తీక దీపం 2 నవ వసంతం' సీరియల్ మరోసారి టాప్ లేపింది. టీఆర్పీ రేటింగుల్లో తనకు ఎదురు లేదని మళ్లీ చాటి చెప్పింది. గత రెండు మూడు వారాలుగా ఆ సీరియల్ ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకోలేదు. అయితే మళ్లీ మొదటి స్థానానికి వచ్చేసింది.‌ తర్వాత స్థానం కోసం స్టార్ మా ఛానల్ సీరియల్స్ మరో రెండు పోటీ పడ్డాయి.‌ మొత్తం మీద ఈ వారం... (ఈ 2025లో ఏడో వారం,‌ ఫిబ్రవరిలో మూడో వారం) తెలుగు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఏవేవి ఉన్నాయి? అనేది ఒకసారి చూడండి.


కార్తీక దీపం 2 దూకుడుకు సాటేది?
గుడి గంటలు, ఇల్లాలు మధ్య పోటీ!
ప్రతి వారం టీఆర్పీ రేటింగుల్లో స్టార్ మా సీరియల్స్ అధిపత్యం చాలా ఎక్కువ. మొదటి ఐదారు స్థానాలలో ఈ ఛానల్‌ సీరియల్స్ మనకు కనిపిస్తాయి. ఈ వారం కూడా 'స్టార్ మా' ఆధిపత్యం కనిపించింది.


'కార్తీక దీపం 2 నవ వసంతం' సీరియల్ ఈ వారం 13.75 టీఆర్పీ అందుకుంది‌‌. దానికి దరిదాపుల్లో మరో సీరియల్ లేదని చెప్పాలి. అయితే రెండో స్థానం కోసం రెండు సీరియల్స్ మధ్య బలమైన పోటీ నెలకొనడంతో టై ఏర్పడింది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆమని ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'తో పాటు 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్స్ సైతం 12.65 టీఆర్పీ అందుకుంది. మొదటి మూడు స్థానాలలో ఈ మూడు సీరియల్స్ ఉంటే...


'ఇంటింటి రామాయణం' సీరియల్ 12.64 టీఆర్పీ రేటింగుతో నాలుగవ స్థానంలో ఉంది. 'చిన్ని' (9.96), 'నువ్వుంటే నా జతగా' (8.31), 'మగువా ఓ మగువా' (7.05), 'బ్రహ్మముడి' (6.68), 'పలుకే బంగారమాయేనా' (6.17), 'మామగారు' (5.09) టీఆర్పీ అందుకున్నాయి.‌ 


మేఘ సందేశం... మళ్లీ టాప్ లేపింది!
జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే... 'మేఘ సందేశం' సీరియల్ మరోసారి టాప్ లేపింది. దానికి 7.13 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత స్థానం కోసం మరో రెండు సీరియల్స్ మధ్య బలమైన పోటీ నెలకొన్నప్పటికీ... 6.97 టీఆర్పీతో 'చామంతి', 6.95 టీఆర్పీతో 'జగద్ధాత్రి' రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.


Also Read:'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? లేదా? తమన్ మ్యూజిక్ అదుర్స్... మరి, ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా? 


జీ తెలుగులో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'పడమటి సంధ్యారాగం' (6.77), 'నిండు నూరేళ్ళ సావాసం' (6.03), 'అమ్మాయి గారు' (5.98), 'ప్రేమ ఎంత మధురం' (3.85), 'మా అన్నయ్య' (3.58), 'గుండమ్మ కథ' (3.50), 'కలవారి కోడలు కనక మహాలక్ష్మి' (3.43), 'ఉమ్మడి కుటుంబం' (3.10), 'ముక్కుపుడక' (3.29) టీఆర్పీ అందుకున్నాయి. 


జెమినీ టీవీ సీరియళ్లలో ఒక్క సీరియల్ కూడా వన్ టీఆర్పీ దాటలేదు. 'శ్రీమద్ రామాయణం' 0.95 టీఆర్పీతో అందుకుంది. ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే... 'రంగుల రాట్నం' (3.66), 'బొమ్మరిల్లు' (3.07), 'మనసంతా నువ్వే' (3.57), 'ఝాన్సీ' (3.03) టీఆర్పీ సాధించాయి.


Also Readఅగత్యా రివ్యూ: భయానికి, వినోదానికి మధ్య సంఘర్షణ... తమిళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?