'బ్రహ్మ రాక్షస' సినిమా నుంచి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పక్కకు తప్పుకోవడంతో ప్రశాంత్ వర్మ (Prasanth Varma)కు మరొక అవకాశం రావడం కష్టం అనే మాటలు వినిపించాయి. అయితే... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చేసేందుకు ఎస్ చెప్పారు. ఇటీవల లుక్ టెస్ట్ కూడా జరిగింది. అందులో హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది.


ప్రభాస్ సరసన భాగ్యశ్రీ బోర్సే!?
మాస్ మహారాజా రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన అమ్మాయి గుర్తు ఉందా? భాగ్య శ్రీ బోర్సే! ప్రభాస్ సరసన నటించిన అవకాశం ఆ అమ్మాయికి రావచ్చని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రభాస్, భాగ్య శ్రీ బోర్సే మీద ఇటీవల లుక్ టెస్ట్ చేశారట. మ్యాగ్జిమమ్ ఆ అమ్మాయి ఫైనల్ కావచ్చని తెలిసింది.


'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అయినా సరే భాగ్యశ్రీ బోర్సేకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఆవిడ అందానికి చాలా మంది యువత ఫిదా అయ్యారు. దాంతో అవకాశాలకు కొదవ లేదు. 'మిస్టర్ బచ్చన్' తర్వాత దుల్కర్ సల్మాన్ 'కాంత' చేసే అవకాశం అందుకున్నారు. మరో వైపు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్‌ రోల్ చేస్తున్నారు.


Also Readస్టార్‌ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?






'బ్రహ్మ రాక్షస' అప్డేట్ ఏమిటి?
ఇటీవల ప్రభాస్ మీద లుక్ టెస్ట్ నిర్వహించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజను కథానాయకుడిగా పరిచయం చేసే సినిమా వెనక్కి వెళ్లడంతో ఆయన ఆలస్యం చేయకుండా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో 'ది రాజా సాబ్', 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమాలు చేస్తున్న ప్రభాస్ మధ్య మధ్యలో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో పూర్తి చేసిన ప్రశాంత్ వర్మ... వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.


Also Readటీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు


'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలు పూర్తి చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాను ప్రభాస్ సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లుక్ కంటిన్యూటీ విషయంలో వేరే సినిమాలతో క్లాష్ కాకుండా ఉండడం కోసం తన సినిమా చేసే సమయంలో వేరే సినిమా షూటింగ్స్ పెట్టుకోవద్దని హీరోకి దర్శకుడు రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా కాకుండా 'సలార్' సీక్వెల్, 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. దాంతో ఏ సినిమా ముందుకు వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. 'ది రాజా సాబ్' కంటే ముందు 'కన్నప్ప' సినిమాలో అతిథి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రభాస్. 'కన్నప్ప' హీరో విష్ణు మంచు కెరీర్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏమిటో కింద వెబ్ స్టోరీలో చూడండి.