చిన్న సినిమా గా రిలీజై సంచలనం సృష్టించిన మూవీ 'మ్యాడ్'. ఈ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'మ్యాడ్ స్క్వేర్' సినిమా కోసం మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ 'మ్యాడ్ స్క్వేర్' మూవీని సమర్పిస్తున్నారు. మార్చి 29, 2025న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్లో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది. అందులో భాగంగానే నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ సినిమా వస్తే, మా సినిమా రాదు" అని క్లారిటీ ఇచ్చారు. 


హరి హర వీరమల్లు వర్సెస్ మ్యాడ్ స్క్వేర్


'మ్యాడ్ స్క్వేర్' ప్రెస్ మీట్ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగావంశీ మాట్లాడుతూ "మ్యాడ్ స్క్వేర్ మూవీని మంచి మూవీగా తెరకెక్కించాము. మూవీ కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము. మనస్ఫూర్తిగా రెండు గంటల పాటు నవ్వుకోవడానికి ఈ సినిమాకు రండి. స్నేహితులతో కలిసి చూసి, మా సినిమాను ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చారు. అయితే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మూవీ వాయిదా పడుతుందని ఎన్నోసార్లు వార్తలు వచ్చినప్పటికీ, మేకర్స్ మాత్రం తగ్గేదేలే అంటూ అదే రిలీజ్ డేట్ కి మూవీని రిలీజ్ చేస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ ఇంకా 'హరిహర వీరమల్లు' షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. 


ఈ నేపథ్యంలోనే ఓవైపు మూవీ వాయిదా తప్పదు అని రూమర్లు వినిపిస్తుంటే, మరే వైపు 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ టైంలో పలు చిన్న సినిమాలు సైతం రిలీజ్ కావడానికి సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారింది. అసలు 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ? అనే క్లారిటీ రాలేదు కానీ, "ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే గనక మా మూవీని రిలీజ్ చేయము' అని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.


Also Readటీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు



నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ రిటర్న్ 


'మ్యాడ్ స్క్వేర్' మూవీ రిలీజ్ అయినప్పుడు నిర్మాత నాగ వంశీ ఈ మూవీ నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తానని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మూవీ ప్రమోషన్ కి బాగానే ఉపయోగపడింది. ఇక ఇప్పుడు సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్ టైంలో హీరో సంగీత్ శోభన్ టికెట్ డబ్బులకి డబుల్ రిటర్న్ ఇస్తానని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ " మ్యాడ్ విడుదల చేసినప్పుడు నాగ వంశీ గారు సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నాను... ఎవరికైనా మూవీ నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ వెనక్కి ఇచ్చేస్తాం. మళ్లీ సక్సెస్ మీట్ లో మనందరం కలుద్దాం" అంటూ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


Also Readస్టార్‌ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?