మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీం ప్రాజెక్ట్ గా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'కన్నప్ప' (Kannappa Movie). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్లను ఇప్పటికే మేకర్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
కన్నుల పండుగగా 'కన్నప్ప' టీజర్
మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్ర స్ఫూర్తితో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ, ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో ప్రకటించారు మేకర్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ గ్లిమ్స్, హీరోల ఫస్ట్ లుక్ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలోనే 'కన్నప్ప' మూవీ నుంచి టీజర్ ని మార్చ్ 1 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. చెప్పినట్టుగానే తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.
వందమందిని చంపిన తిన్నడిగా విష్ణు మంచు యాక్షన్ అవతార్ అదిరింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. 'శివయ్యా' అంటూ చివరిలో విష్ణు మంచు పిలిచిన తర్వాత అక్షయ్ కుమార్ ని చూపించారు. ప్రభాస్ 1.15 నిమిషం దగ్గర కనిపించారు.
మొదటి నుంచి ఈ మూవీ విజువల్ వండర్ గా ఉండబోతుందని ప్రమోషన్ చేస్తున్నారు. అన్నట్టుగానే తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో ఉత్కంఠ భరితమైన విజువల్స్, స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన 'కన్నప్ప' మూవీతో ప్రేక్షకులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు అనిపిస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో డైలాగులు, దుమ్ము రేపే యాక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక మంచు విష్ణు ఈ ప్రాజెక్టుపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. 2025 ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో భారతీయ ఇతిహాసాల స్టోరీతో రూపొందిన 'కన్నప్ప' మూవీతో ప్రేక్షకులకు అదిరిపోయే సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతున్నారు అనిపిస్తోంది.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
8 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్లిన 'శివ శంకరా' సాంగ్
రీసెంట్ గా 'కన్నప్ప' మూవీ నుంచి 'శివ శివ శంకర' అనే పాటను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దిసేపట్లోనే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట యూట్యూబ్లో 8 కోట్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దీన్నిబట్టి ఈ మూవీపై ఉన్న అంచనాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పాటను రామజోగయ శాస్త్రి రాయగా, విజయ్ ప్రకాష్ పాడారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తుండగా, ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.