Star Maa Serials TRP Ratings This Week 53: టీఆర్పీ రేటింగుల్లో 'స్టార్ మా'లో వచ్చే 'కార్తీక దీపం 2'ను కొట్టేది లేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ వారం కూడా టాప్ 10 సీరియళ్లలో మొదటి నాలుగు స్థానాల్లో 'స్టార్ మా'వి ఉన్నాయి. మరి మిగతా స్థానాల్లో ఏయే సీరియల్స్ ఉన్నాయి. 'జీ తెలుగు'లో ఏయే సీరియల్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. స్టార్ మా అండ్ జీ తెలుగు ఛానల్స్ చూస్తే... టాప్ 10లో ఏవి ఉన్నాయి? అనేది చూస్తే...
'కార్తీక దీపం 2 నవ వసంతం'కు డేంజర్ బెల్స్...
ఆల్మోస్ట్ దగ్గరకొచ్చిన 'గుండెనిండా గుడిగంటలు'
'స్టార్ మా' ఛానల్‌లో టీఆర్పీ రేటింగ్స్ విషయంలో 'కార్తీక దీపం 2 - నవ వసంతం' సీరియల్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. లాస్ట్ వీక్ (52వ వారం)లో దానికి 10.54 రేటింగ్ వచ్చింది. ఈ వారం 10.38 రేటింగ్ సాధించింది. అయితే... దానికి 'గుండెనిండా గుడిగంటలు' నుంచి డేంజర్ బెల్స్ మోగాయి.
ఈ వీక్ (53వ వారం)లో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ 10.03 టీఆర్పీ సాధించి అటు 'స్టార్ మా', ఇటు ఈ వారం టాప్ 10 సీరియళ్లలో రెండో స్థానంలో నిలిచింది. దాని తర్వాత కొత్తగా ప్రారంభమైన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' 9.17 టీఆర్పీతో మూడో స్థానంలో, 'ఇంటింటి రామాయణం' 9.15 టీఆర్పీతో నాలుగో స్థానంలో నిలిచింది.
స్టార్ మా వరకు ఆ తర్వాత స్థానాల్లో 'చిన్ని' (8.30 టీఆర్పీ), 'నువ్వుంటే నా జతగా' (7.43 టీఆర్పీ), 'మగువ ఓ మగువ' (7.03 టీఆర్పీ) సీరియల్స్ నిలిచాయి. ఒకప్పుడు టాప్ ప్లేస్ అయినటువంటి 'బ్రహ్మముడి'కి ఈ వారం 6.20 టీఆర్పీ వచ్చింది.
జీ తెలుగులో మళ్లీ 'మేఘ సందేశం' టాప్!
'జీ తెలుగు'లో ఎప్పటిలా ఈ వారం కూడా 'మేఘ సందేశం' టాప్ ప్లేస్ అందుకుంది. ఈ సీరియల్ 51వ వారంలో 8.45, 52వ వారంలో 7.83 టీఆర్పీ సాధించింది. ఇక ఈ వీక్ (53వ వారం)లో మళ్ళీ 8 ప్లస్ రేటింగ్ వచ్చింది.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
'మేఘ సందేశం'కు 8.35 టీఆర్పీ రాగా... 'నిండు నూరేళ్ళ సావాసం' 7.68 టీఆర్పీ సాధించింది. ఆ తర్వాత కొత్త సీరియల్ 'చామంతి' వచ్చి చేరింది. దానికి 7.60 టీఆర్పీ వచ్చింది. ఎప్పుడూ 'జీ తెలుగు'లో రెండో స్థానంలో ఉండే 'జగధాత్రి' ఈసారి చాలా అంటే చాలా తక్కువ మార్జిన్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 'జగధాత్రి'కి ఈ వారం 7.58 టీఆర్పీ వచ్చింది. 'చామంతి'తో ఈక్వల్ అని చెప్పవచ్చు. తర్వాత స్థానాల్లో 'పడమటి సంధ్యారాగం' (7.42 టీఆర్పీ), 'అమ్మాయి గారు' (6.48), 'మా అన్నయ్య' (5.52), 'ప్రేమ ఎంత మధురం' (4.42) నిలిచాయి.
ఈటీవీలో మెరుగైన 'మనసంతా నువ్వే'
ఈటీవీలో ప్రతి వారం టాప్ ప్లేస్ 'రంగుల రాట్నం' సీరియల్‌ది. ఈ వారం కూడా 2.28 టీఆర్పీ సాధించింది. 'మనసంతా నువ్వే' కూడా 2.14తో రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో 'రావోయి చందమామ' (1.60), 'బొమ్మరిల్లు' (1.54), 'శతమానం భవతి' (1.49), 'కలిసుందాం రా' (1.40) ఉన్నాయి. జెమిని టీవీలో సీరియళ్లు ఎప్పటిలా ఒకటి కంటే తక్కువ టీఆర్పీ సాధించాయి.