Ammayi garu Serial Today Episode బంటీకి రక్తం ఎక్కించకపోతే కోమాలోకి వెళ్లిపోతాడని ఎంత ప్రయత్నించినా రక్తం దొరకడం లేదని డాక్టర్ రూపతో చెప్తాడు. రూప చాలా టెన్షన్ పడుతుంది. రూప ఉన్న హాస్పిటల్‌లోనే విజయాంబిక, దీపక్‌లు ఉంటారు. ఇద్దరూ రూపని చూసి తనకు తెలీకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. కానీ రూప చూసేస్తుంది. మీరు ఇక్కడేంటి అని అంటుంది. ఇక్కడేంటి ఉన్నారు అని విజయాంబిక అడిగితే బంటీకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది.
దీపక్ చేతికి గాయం చూసి రూప ఏమైందని అడిగితే కుక్క కరిచిందని చెప్తారు. రూప రాజుకి ఎంత ట్రై చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక రాజు హాస్పిటల్‌కి వస్తాడు. రాజు వచ్చి రూప ముందు నిల్చొంటాడు. రూప చాలా ఆనందంగా వచ్చావా రాజు రావు అనుకున్నా అంటుంది. రాజు మనసులో ఇంత ఎమోషనల్ అవుతుందేంటి దీపుకి ఏమైనా అయిందా అనుకుంటాడు. ఇక రూప రాజుని బంటీ దగ్గరకు తీసుకెళ్లి ఈ బాబుకే రక్తం కావాలి రాజు అనగానే రాజు బంటీని చూసి షాక్ అయిపోతాడు. బంటీని చూసి ఎమోషనల్ అయి రూపకి బంటీ తన కొడుకు అని తెలిసిపోతుందని రాజు అనుకొని రూప ఎదురుగా రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటాడు. ఇక రూప డాక్టర్‌ని పిలవడానికి వెళ్లగానే రాజు బంటీని పట్టుకొని ఏడుస్తాడు. డాక్టర్‌ని పిలవడానికి రూప వెళ్తుంటుంది. ఇక డాక్టర్‌తో విజయాంబిక, దీపక్‌లు డీఎన్‌ఏ టెస్ట్ గురించి మాట్లాడుతుంటారు. డాక్టర్ సీక్రెట్‌గా డీఎన్‌ఏ టెస్ట్ చేయను అని చెప్తారు. అది క్రైమ్ అవుతుందని చెప్తే ఇద్దరూ డాక్టర్‌ని బతిమాలుతారు. ఇంతలో రూప అక్కడికి వస్తుంది. దాంతో దీపక్ విషయం రూపకి తెలీకుండా మాట దాటేస్తారు. ఇక రూప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తమ్ముడు సీఎం అని చెప్పి విజయాంబిక డాక్టర్‌ని డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పిస్తుంది. రాజు బంటీని పట్టుకొని ఏడుస్తుంటే రూప వాళ్లు వస్తారు.
డాక్టర్ రాజు బ్లడ్ బాబుకి ఎక్కిస్తారు. బాబుకి ఏం ప్రమాదం లేదు కదా అని రాజు అడుగుతాడు. దానికి రూప బంటీ చాలా మంచి వాడని బంటీకి ఏం కాదు అని అంటుంది. ఇక రూప మళ్లీ డాక్టర్‌తో మాట్లాడుతానని అని వెళ్తుంది. విజయాంబిక వాళ్లు రూపని తీసుకెళ్లిపోవాలని బంటీకి ప్రమాదం అయిందని రాజుకి తెలిస్తే రూపకి విషయం తెలిసిపోతుందని అనుకుంటారు. రూపతో విజయాంబిక వాళ్లు మాట్లాడుతారు. బంటీకి రక్తం దొరికిందా అని అంటే దొరికిందని ఎవరుఇచ్చారని విజయాంబిక అడిగితే రాజు వచ్చి బ్లడ్ ఇచ్చాడని చెప్తుంది. దాంతో ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక రాజు కూడా రూప వాళ్ల దగ్గరకు వస్తాడు. వాళ్లని చూసి రాజు షాక్ అయిపోతాడు. బంటీ తన కొడుకు అని వాళ్లకి తెలీకూడదు అని అనుకుంటాడు. రూప రాజుని వెళ్లిపోమని తాను స్కూల్‌కి చెప్పి బంటీ వాళ్ల పేరెంట్స్‌కి చెప్పమని చెప్తా అంటే రాజు తాను చెప్తా అంటాడు.
మరోవైపు అదే హాస్పిటల్‌కి మందారాన్ని తీసుకొని రాఘవ వస్తాడు. మందారాన్ని చూసిన దీపక్ చెమటలు పట్టేస్తాడు. నోట మాట రాకుండా తల్లికి చూపిస్తాడు. మందారం రాఘవని చూసిన విజయాంబిక కూడా చెమటలు పట్టేస్తుంది. రూప, రాజులు చూడకుండా జాగ్రత్త పడతారు. రాజు వాళ్లని మందారం క్రాష్ చేయగానే దీపక్ మందారం అని అరుస్తాడు. రూప, రాజులు షాక్ అయి మందారం ఏంటి అని అడిగితే మణిదీప్ని స్కూల్ నుంచి తీసుకెళ్లాలని అని కవర్ చేస్తాడు. బంటి లేస్తే నిజం తెలిసిపోతుందని రాజు రూపని పంపేయాలని అనుకుంటాడు. ఇక విజయాంబిక వాళ్లు కూడా మందారం గురించి తెలీకూడదని అనుకొని మందారాన్ని తీసుకెళ్లిన వైపు వెళ్తారు. మందారం, రాఘవ కోసం మొత్తం వెతుకుతారు. మందారానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చూసేస్తారు. మందారం కండీషన్ బాగుందని తొందర్లోనే మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్తారు. దాంతో దీపక్ వాళ్లు మందారం షాక్‌లో ఉందని అనుకొని ఇద్దరినీ చంపేయాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్!