Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను ఆస్తి పంపకాల కోసం లాయర్లు వాళ్లని పిలిపిస్తుంది. జయదేవ్ లక్ష్మీ, మిత్రలకు ఆ విషయం చెప్తాడు. అవార్డు ఫంక్షన్ రోజే ఆస్తి పంపకాలు ఏంటి అని మిత్ర అంటే లక్ష్మీ జరగనివ్వండి అంటుంది. ఈ దారుణాలు చూడటం నా వల్ల కాదని నేను బయటకు వెళ్లిపోతాను అని జయదేవ్ అంటే లక్ష్మీ వద్దని సమస్యలు వస్తే పోరాడాలి అని అంటుంది.
మిత్ర: బయట నుంచి సమస్యలు రావడం వేరు ఇళ్లే సమస్యగా మారడం వేరు. బయట అందరూ మన గురించి గొప్పగా చెప్తున్నారు ఇంట్లో మాత్రం ఇలా ఉంది. మనసుకి చాలా బాధగా ఉంది లక్ష్మీ. సంతోషం, బాధ రెండూ ఒకేసారి వచ్చాయి.
లక్ష్మీ: ఎందుకండీ బాధ పడతారు ఇందుకే నేను అవార్డు తీసుకోను అన్నాను కానీ మీరే బలవంతం చేస్తున్నారు. ఆస్తి పంపకాలు జరుగుతాయో లేక ఆగుతాయో చూద్దాం.
మనీషా: లక్ష్మీ ఏంటి ఇంత కాన్పిడెంట్‌గా మాట్లాడుతుంది. కొంపతీసే ఈ ఆస్తి పంచకుండా ఆపుతుందా ఏదో ప్లాన్ వేసినట్లుంది. ఆంటీని జానుని రెచ్చగొట్టాలి.
దేవయాని: ముందు ఆస్తిపంపకాలు తర్వాతే అవార్డు ఫంక్షన్ అని చెప్పేద్దాం జాను.
జాను: నేను చెప్పేశాను అత్తయ్య లాయర్ రావడమే ఆలస్యం.
మనీషా: లాయర్లు వచ్చేశారు డాక్యుమెంట్లు కూడా రెడీ. మీరు ఎలా అయినా ఆస్తి రాయించుకోవాలి అనుకుంటున్నారు మీ అక్క మాత్రం ఆస్తి రాకుండా ఆపాలని చూస్తుంది. ఆస్తులన్నింటికి తనే కదా అధికారిణి. ఏం చేస్తుందో ఏంటో. ఎలా అయినా ఆస్తి పంపకం ఆపుతాను అని జయదేవ్ అంకుల్ మిత్రలకు చెప్తుంది.
జాను: ఆ పరిస్థితి వస్తే ఎంత దూరం అయినా వెళ్తా. అక్క అని కూడా చూడను. అంత దాకా వస్తే వెనకా ముందు చూసేదే లేదు. ఏది అయితే అది అవుతుంది తెంచేయడమే.
లక్ష్మీ: (లాయర్లు, ఆడిటర్లు అన్నీ సరి చూస్తుంటారు. అందరూ హాల్‌లోనే ఉంటారు. మిత్ర వాళ్లు డల్ అయిపోతారు.) లాయర్ గారు ఆస్తి మా మామయ్య గారి తమ్ముడి కొడుకు అడిగాడా లేక కోడలో మరదలో అడిగారా.
దేవయాని: మేం అంతా కలిసే అడిగాం,
జాను: మా ముగ్గురిది ఒకటే మాట మాలో మాకు ఏం డిఫరెన్స్ లేదు.
మనీషా: అసలు లక్ష్మీ ప్లాన్ ఏంటి.
లక్ష్మీ: లాయర్ గారు మీరు కానివ్వండి. ఆస్తి పంపకాలు మాకు సమ్మతమే.
లాయర్: మీ ఆయన, మామగారికి సమ్మతమే.
జయదేవ్: మా కోడలి మాటే మా మాట.
లక్ష్మీ కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తులు పేర్లు చెప్తుంది. ఇన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయా అని జాను, దేవయాని నోరెళ్ల బెడతారు. తమకు వాటా కింద వెయ్యి కోట్లకు పైగా ఆస్తి వస్తుందని సంతోష పడతారు. ఇక ఆస్తులు సమానంగా పంచుకోవడానికి అందరూ సంతకాలు పెట్టాలని లాయర్ అంటే అరవింద అత్తయ్య లేరు కదా అంటుంది. ఈ వంకతో లక్ష్మీ ఆస్తి పంపకాలు ఆపేస్తుందని అనుకునేలోనే లక్ష్మీ మా అత్తయ్య వాటా మా వైపే ఉందని ఏం పర్లేదు పంచుకుందాం అంటుంది. దాంతో లాయర్ జయదేవ్‌తో సంతకాలు పెట్టమని అంటాడు. ఇక జయదేవ్ వివేక్‌ని ఒకసారి ఆలోచించమంటాడు. పాపం వివేక్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంతలో లక్ష్మీ వాళ్లు అడిగినట్లే మేం ముగ్గురం సంతకాలు చేస్తాం కానీ మా కోసం వాళ్లు ముగ్గురు సంతకాలు చేయాలని కొన్ని పేపర్లు తీసుకొస్తుంది. అందరూ ఏంటి ఆ పేపర్ అంటే అగ్రిమెంట్ అని అంటుంది.
లక్ష్మీ: ఆస్తి పంపకాలు అయిపోతే మీ వాటా మీది మా వాటా మాది. నందన్ కుటుంబ ఆస్తులు రెండుగా చీలిపోతాయి. ఒకటి మిత్రానందన్‌ది రెండోది వివేక్ నందన్‌ది. కంపెనీలు వేరు అయినట్లే రేపు కుటుంబాలు కుంపటులు వేరు అవ్వొచ్చు. ఎవరి ఇళ్లు వారివి ఎవరి కంపెనీలు వారివి కావొచ్చు.
దేవయాని: అదేంటి అందరం ఒకే ఇంట్లో ఉంటాం ఎందుకు వేరు అవుతాం.
లక్ష్మీ: ఇప్పుడు అలాగే అంటారు కానీ తర్వాత అది జరగదు.
జాను: ఇప్పుడేంటి ఎవరి వంట వాళ్లే వండుకోవాలి అంతేనా.
లక్ష్మీ: ఎవరి వంట వాళ్లే వండుకోవాలి ఎవరి కంపెనీ వాళ్లే చూసుకోవాలి. అసలు విషయం చెప్తాను వినండి. ఒకరి కంపెనీ పూర్తి లాభాల్లోకి వెళ్లి మరొకరి కంపెనీ నష్టాల్లోకి వెళ్తే వారు మరొకరి మీద ఆధారపడకూడదు. నష్టపోయాం సాయం చేయండి అని అడగకూడదు. మళ్లీ అందరం కలిసి ఉంటాం అని రాకూడదు. మా రాత ఇంతే అని సరిపెట్టుకోవాలి. అంతా మంచి జరిగితే ఓకే కానీ పెద్దలు కీడు ఎంచి మేలు ఎంచమన్నారు కదా. మా ఆస్తులు అన్నీ పోయి వీళ్ల దగ్గర అడుక్కుంటే బాగోదు కదా వీళ్లు అయినా తమ ఆస్తులు పొగొట్టుకుని మా దగ్గరకు వస్తే అసహ్యంగా ఉంటుంది కదా. ఈ అగ్రిమెంట్ మీద వాళ్లు సంతకాలు పెడితే మేం కూడా మేం పెడతాం. వివేక్ తొలి సంతకం నువ్వే పెట్టాలి. కానివ్వు.
వివేక్: కావాలనే ఇది అన్యాయం వదిన నేను పెట్టను నేనే కాదు మా అమ్మ భార్య పెట్టరు. మేం పెడితే మేం నష్టపోతాం. అవగాహన లేని నేను విడిపోతే నాకు నష్టం వస్తుంది. అన్నయ్య వదినే మనల్ని చూడను అంటే బయట వాళ్లు మనకు చూస్తారా.
లక్ష్మీ: అగ్రిమెంట్‌కి ఒప్పుకోకపోతే ఆస్తి పంపకాలు ఉండవు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్!