Nindu Noorella Saavasam Serial Today Episode:  రూంలో ఆరు  ఆస్తికలు చూసి ఏడుస్తున్న రామ్మూర్తిని అమర్‌ ఓదారుస్తాడు. విధి ప్రకారం జరిగింది దానికి మీరు కారణం కాదండి అంటాడు. అయినా మీరు ఎందుకు భాగీకి నిజం చెప్పలేదు అని అమర్‌ అడుగుతాడు. ఆ నిజం తెలిస్తే భాగీ తట్టుకోలేదని మీరు కూడా చెప్పొద్దని అమర్‌కు చెప్పి రామ్మూర్తి ఇంటికి వెళ్లిపోతాడు. ఇంతలో భోజనం రెడీ చేశానని భాగీ వస్తుంది.  


 భాగీ: ఏవండి.. నాన్నా ఎక్కడ..?


అమర్‌: ఇప్పుడే వెళ్లిపోయారు మిస్సమ్మ


భాగీ:  ఎందుకు వెళ్లిపోయారు.. నాకు చెప్పకుండా వెళ్లిపోరే


అమర్‌: ఏదో అర్జెంట్‌ గుర్తుకు వచ్చిందట అందుకే నాతో చెప్పి వెళ్లారు


భాగీ: అయితే మీరు రండి తిందురు.. నాన్నతో ఫోన్‌లో మాట్లాడతాను


అమర్‌: మిస్సమ్మ  నాకు ఆకలిగా లేదు. మీరు తినండి


రాథోడ్‌: ఇక నేను వెళ్తాను మిస్సమ్మ మళ్లీ రేపు పొద్దున్నే రావాలి కదా


భాగీ: నిజం చెప్పు రాథోడ్‌ అక్క గురించి మీకు తెలుసు కదా..? అక్కని కలిశారా..? వద్దని వదిలేసిన తండ్రి, ఈ చెల్లిని వద్దని చెప్పిందా..?  అలాంటిదేదో జరిగింది అందుకే కదా మీరు అదరూ ఇలా ఉన్నారు..?


రాథోడ్‌: అలాంటిదేం లేదు మిస్సమ్మ నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు.


 అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు. ఘోర పొద్దునే మనోహరికి ఫోన్‌ చేసి ఆత్మ ఎవరిలో దూరిందో తెలుసుకో అంటాడు. మనోహరి  సరే అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు గార్డెన్‌లో గుప్త, ఆరు కోసం వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. బాలిక ఎవరిలోనైనా ప్రవేశించిందా..? అని ఆలోచిస్తుంటాడు. పౌర్ణమి గడియలు ముగిసే లోపు బాలికను కట్టడి చేయకపోతే మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుందని గుప్త అనుకుంటాడు. ఇంతలో మనోహరి కూడా ఆరు ఎవరిలోనైనా ప్రవేశించిందేమో చూద్దామని ఇళ్లంతా తిరుగుతూ అందరినీ చూస్తుంది. ఎవరిలో ఆరు లక్షణాలు కనిపించకపోయే సరికి కిందకు హాల్లోకి వచ్చి నిరాశగా తన రూంలోకి వెళ్తుంటే అమర్‌ వస్తాడు.


అమర్‌: దొరికిందా మనోహరి.. నువ్వు వెతుకుతున్నది నీకు దొరికిందా..?  ఇంట్లో అందరినీ ఎందుకు డౌటుగా చూశావు. నువ్వు అందరితో మాట్లాడటం నేను చూశాను. చెప్పు మనోహరి దేని కోసం వెతుకుతున్నావు.


మను: ఆరు కోసం వెతికాను.


అమర్‌: ఏంటి ఆరు కోసం వెతికావా..?


మను: అవును అమర్‌  నేను చెప్తుంది నిజమే.. ఆరు కోసమే వెతికాను. ఆరు ఆస్థికలు రేపే నదిలో కలుపుతున్నాం. కదా.. ఆస్తికలు నదిలో కలిపితే ఇక ఆరు ఇక్కడ నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి ఇప్పుడు తన ఉనికి నాకేమైనా తెలుస్తుందేమోనని వెతికాను


ఆరు గురించి చెప్పగానే అమర్‌ మౌనంగా ఉండిపోతాడు. మనోహరి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఇంట్లో ఆరు లేదని నిర్దారించుకున్న  గుప్త బాలిక ఎక్కడికి వెళ్లి ఉంటుంది. ఇక్కడ లేదు అంటే తమ పితృదేవుడిని చూచుటకు వెళ్లి ఉంటుందా..? ఆ వెళ్లి ఉండొచ్చు అని మనసులో అనుకుని ఆరు కోసం వెళ్తుంటాడు గుప్త. మధ్యలో అనాథ ఆశ్రమం కనిపిస్తే అక్కడే ఆగి చూస్తుంటాడు గుప్త. ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది.


గుప్త: ఇక్కడికి ఎందుకొచ్చావు బాలిక


ఆరు: మనశాంతి కోసం వచ్చాను గుప్త గారు. అయినా మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు. నేను ఎవరి శరీరంలోనైనా ప్రవేశించామోనని వచ్చారా..? ఇక ఎవరి శరీరంలో ప్రవేశించను గుప్త గారు. చివరిగా ఒక్క సాయం అడుగుతాను చేస్తారా..?


గుప్త: ఏంట బాలిక.. అది కానీ ఒక్కమాట నువ్వు మళ్లీ ఇక్కడే ఉంటానంటే మాత్రం ఒప్పుకునేది లేదు.


ఆరు: కొద్ది రోజులు నేను ఇక్కడే ఉండి మా నాన్న, చెల్లితో గడిపి వస్తాను ఫ్లీజ్‌ గుప్త గారు నాకు ఇదొక్క సాయం చేయండి.


అని ఆరు అడగ్గానే.. గుప్త ఆలోచనలో పడిపోతాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!