Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ జనార్థన్‌ని మళ్లీ తన వైపునకు తిప్పుకోవడానికి తనే స్వయంగా చాలా వంటలు చేస్తుంది. అర్చనతో కలిసి వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. అన్ని రకాలు చూసి చాలా హ్యాపీగా ఫీలవుతారు. సీత వాళ్లు మాత్రం మూతి తిప్పుకుంటారు. మహాలక్ష్మీ అత్తయ్య వంట చేసింది అంటే ఏదో స్పెషన్ ఉంటుందని అంటుంది.


అర్చన: నువ్వు అన్నది కరెక్టే సీత మహా ఇన్ని వంటలు చేయడానికి ఓ కారణం ఉంది బావగారికి తాను స్వయంగా వంట చేసి చాలా రోజులు అయిందని వండింది. 
జనార్థన్: అవునా మహా థ్యాంక్స్.
మహాలక్ష్మీ: నా భర్త కోసం నేను వండటం పెద్ద పని కాదు. 
సీత: విద్యాదేవితో మామయ్యని వంటలతో కొట్టాలని ప్రయత్నిస్తుంది అత్తయ్య.
విద్యాదేవి: అర్థమైంది సీత.
చలపతి: బావ ఇప్పుడు టీచర్‌ని పెళ్లి చేసుకున్నాడు కదా. 
మహాలక్ష్మీ: అయితే మాత్రం నేను జనాకి భార్యని కాకుండా పోతాను. ఆయన ఎప్పటికీ నా భర్తే రామ్, ప్రీతిలు నా పిల్లలే. నేనే వాళ్లకి అమ్మని.
రామ్: కరెక్ట్‌గా చెప్పావ్ పిన్ని నువ్వు నిజంగా గ్రేట్.
గిరి: నీ కంటూ పిల్లలు కూడా వద్దు అనుకున్నావ్ నువ్వు గ్రేట్ వదిన.
జనార్థన్: మీరంతా చెప్పింది నిజమే మహా వల్లే ఈ రోజు అందరం ఆనందంగా ఉన్నాం. అందరూ కూర్చొండి కలిసి తిందాం. నువ్వూ కూర్చొ విద్యా.
విద్యాదేవి: నేను ఈ రోజు ఉపవాసం అండీ. మహా క్షేమంగా తిరిగి వస్తే పదకొండు శనివారాలు రాత్రులు ఉపవాసం ఉండాలని కోరుకున్నా.
జనార్థన్: అవునా. 
రామ్: పిన్ని కోసం టీచర్ ఉపవాసం ఉండటం గ్రేట్.


సీత విద్యాదేవి చెప్పిన అబద్ధానికి తాను రెండు మూడు అబద్దాలు చెప్పి మామయ్య టీచర్ అత్తమ్మ ఉపవాసం ఉంటే మీరు మహాలక్ష్మీ అత్తయ్య కోసం ఉండరా అని అంటుంది. దాంతో జనార్థన్ కూడా ఉపవాసం ఉంటానని అంటాడు. తన కోసం తాను ఉపవాసం ఉండదా అని మహాలక్ష్మీని ఇరికించేసి తిననివ్వకుండా చేస్తుంది. రామ్ పిన్ని కోసం ఉపవాసం ఉంటాను అంటే సీత వద్దని తినమని చెప్తుంది. ఇక జనార్థన్ పాలు తీసుకురమ్మని విద్యాదేవికి చెప్పి వెళ్లిపోతాడు. సీత మహాలక్ష్మీతో కాలుతుంది అనుకుంటా అని అంటుంది. ఉపవాసం మొత్తం నాటకమే అని మీకు మామయ్యకు మధ్య దూరం పెంచాలని మామయ్య మీ వంటలు తినకూడదు అని ఇలా చేశానని అంటుంది. రామ్ వాళ్లు లొట్టలేసుకొని తింటారు. మహాలక్ష్మీ పక్కనుంచే టీచర్ పాలు, పళ్లు పట్టుకొని వెళ్తుంది.  మహాలక్ష్మీ కోపంతో నాకు ఇంట్లో ఫుడ్ కట్ చేశావు కదా నిన్ను ఇంటి నుంచి పంపేస్తా అనుకుంటుంది.


ఉదయం సీత తలస్నానం చేసి వస్తే విద్యాదేవి పంతులు చెప్పినట్లు పూజకు ఏర్పాటు చేసి రామ్, సీతల్ని అక్కడికి తీసుకెళ్లి మీ ఇద్దరూ మంచిగా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని పంతులు ఓ పూజ చేయమని రోజూ సీత దీపం వెలిగించాలని చెప్పారని పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి మీ ఇద్దరూ గుడిలో నిద్ర చేయాలని అంటుంది. అఖండ దీపాలు తెల్లారి వరకు వెలిగాయి కదా మళ్లీ ఇది ఎందుకు అని సీత అడుగుతుంది. టీచర్ సీత దీపం ఆరిపోయిన సీన్ గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు దీపం ఆరిపోవాలి కాబట్టే ఇది చేయాలని అనుకుంటుంది. ఇక రామ్ సీతని దీపం వెలిగించమని చెప్తాడు. సీత దీపం వెలిగిస్తుంది. 


సీత: అత్తమ్మ నీ మీద నాకు డౌట్ వస్తుంది. ఆరోజు అఖండ దీపం వెలిగించినప్పటి నుంచి అదోలా ఉన్నావ్. ఈరోజు మళ్లీ ఈ దీపం వెలిగించమన్నావ్. నువ్వు ఇదంతా చేస్తున్నావ్ అంటే నాకు రామ్ మామకి మధ్య గొడవలు ఏమైనా.
టీచర్: అలా ఏం లేదు సీత ఇదొక పూజ మాత్రమే. మీరు కలకాలం కలిసే ఉంటారు. వచ్చే పౌర్ణమి వరకు రామ్, సీతల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 


శివకృష్ణ, లలితలు ఇంటికి వస్తారు. జనార్థన్, విద్యాదేవి కలిసి వస్తే మీ జంట ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని శివకృష్ణ మనసులో అనుకుంటాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. రామ్ కూడా వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్‌!