Seethe Ramudi Katnam Today Episode : సీతతో మహాలక్ష్మి కాసిన పందెం గురించి మహా మధుమితకు చెప్తుంది. ఈ పందెం నీకు ఇష్టం లేదా అని మధుని అడుగుతుంది. సీత గెలిస్తే నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నావా అని అడుగుతుంది.


మధు: సీత గెలిచే అవకాశమే లేదండి. దానికి భరతనాట్యం రాదు. సీత ఓడిపోవడం రామ్‌ గారికి ఇష్టం ఉండదు. పోటీ గురించి తెలిసి సీతకు సపోర్ట్ చేస్తారు కదా.


మహాలక్ష్మి: రామ్ సపోర్ట్ మాత్రమే చేయగలడు. సీతని గెలిపించలేడు కదా. ఎందుకంటే రామ్‌కి కూడా భరతనాట్యం రాదు. నీ మనసులో ఏముందో చెప్పు మధు. సీతని పంపేస్తున్నాం అని ఆలోచిస్తున్నావా.


మధు: లేదండి అది గెలవకుండా ఉండటానికి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. 


మహాలక్ష్మి: వెరీ గుడ్ మధు. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావ్. సీత ఇంటి నుంచి వెళ్లిపోవడం ఖాయం. ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం. సీత వెళ్లిపోతే ఇక ఈ ఇళ్లు మొత్తం నీదే మధు. నీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. సరే నాకు పని ఉంది వెళ్తా.
కారులో వెళ్తూ.. ఓసేయ్ సీత నువ్వు నన్ను చెంప దెబ్బ కొట్టావ్. నాకు ఇష్టం లేకుండా నా ఇంటి కోడలివి అయ్యావ్. ప్రతి రోజూ నాకు చిరాకు తెప్పిస్తున్నావ్. ఇప్పుడు నాకు దొరికావ్. నిన్ను ఈ పోటీలో ఓడించి బయటకు పంపించేస్తాను. 


మహా వెళ్తున్నా కారుకి ఆటో ఎదురుగా వస్తుంది. అందులో సుమతి ఉంటుంది. మహా ఆటో డ్రైవర్‌ని తిడుతుంది. సుమతి మహాను సీరియస్‌గా చూస్తుంది. ఇక డ్రైవర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి నన్నే తిడుతున్నారని అంటాడు. ఇక మహా డ్రైవర్‌ని కొట్టడానికి చేయి ఎత్తితే సుమతి అడ్డుకుంటుంది. 


సుమతి: మర్యాద.. మర్యాద నేర్చుకో అతన్ని కొడితే ఊరుకునేది లేదు.


మహాలక్ష్మి: నువ్వు ఎవరివి నన్ను ఆపడానికి. నా చేయే పట్టుకుంటావా.


సుమతి: ఎత్తిన చేతిని దించకపోతే విరిచేస్తాను కూడా.


మహాలక్ష్మి: నన్నే అంత మాట అంటావా. ఆటోలో వెళ్లే దానివి నీ స్థాయి ఏంటి నన్నే ఎదురిస్తావా. 


సుమతి: స్థాయి అని మాట్లాడుతున్నావ్. నీ ప్రవర్తన చూస్తుంటే ఏదో నడమంత్రపు సిరి కలిసి వచ్చినట్లు గాను, నమ్మిన వారిని మోసం చేసి పైకి వచ్చినట్లు ఉంది కానీ ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగినట్లులేదు.


మహాలక్ష్మి: నా గురించి అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నావ్. నేను ఎక్కడ పుట్టాను. ఎక్కడ పెరిగానా చూశావా. అతిగా వాగుతున్నావ్. అడ్రస్ లేకుండా చేస్తా. ఈ రోజు నువ్వు నన్ను చాలా హర్ట్ చేశావ్. నిన్ను అస్సలు వదలను. ఏదో ఒక రోజు బదులు తీర్చుకుంటాను.


సుమతి: ఇలా ఎంత మందితో శత్రుత్వం పెంచుకుంటావు. ముందు నీ తప్పులను సరిదిద్దుకో. లేదంటే నా లాంటి వాళ్లు సరిచేయాల్సి వస్తుంది. వెళ్లు.


మహాలక్ష్మి: ఈ మహాలక్ష్మితోనే పెట్టుకున్నావు మసి చేసేస్తాను గుర్తుపెట్టుకో. 


సుమతి: అనుకోకుండా ఎదురు పడ్డావ్. అనుకొని ఎదురుపడే టైం వస్తుంది. ముందు ముందు నీకు చాలా ట్విస్ట్‌లు ఇస్తా. 


ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. మహా పార్టీకి వెళ్లిందని తినడానికి రాదు అని చెప్తారు. ఇక రామ్ సీతను పిలుస్తాడు. సీత డ్రెస్ వేసుకొని భరతనాట్యం నేర్చుకొని వస్తుంది. ఇక సీత పోటీ గురించి చెప్తుంది. అయితే పందెం గురించి రామ్‌కు చెప్పదు. భరతనాట్యం గురించి తెలుసుకున్న రామ్ ప్రీతి, ఉషలకు పోటీ ఇవ్వడం కష్టమని అంటాడు.  


ఇక సీత నేర్చుకుంటున్నాను అని వాళ్ల మీద తానే గెలుస్తాను అని అంటుంది. అందుకు రామ్‌కి ఓ పాట పెట్టమని డ్యాన్స్ వేస్తుంది. ఇంతలో మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. పని మనిషి సాంబారు తీసుకొని వస్తే సీత దాన్ని చూసుకోకుండా మహాలక్ష్మి మీదకు విసిరేస్తుంది. సాంబారు మహా చీర మీద పడుతుంది. సీతతో సహా అందరూ షాక్ అయిపోతారు. సీత సారీ చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర డ్యాన్స్ ఏంటని తిడుతుంది. రామ్ కూడా మహాలక్ష్మికి సారీ చెప్తాడు. అందరూ సీతకు చీవాట్లు పెడతారు. ఇక సీత సాంబారు గిన్నె తగిలి నా చేయి నొప్పి పుడుతుందని అలిగి గదికి వెళ్లిపోతుంది. 


గదిలో సీత కాళ్లు నొప్పులు అంటూ ఒత్తుకుంటూ ఉంటుంది. కాళ్లు నొప్పులు వచ్చేలా డ్యాన్స్‌లు చేయడం ఎందుకని రామ్ అంటాడు. ఇక రామ్ సీత కాళ్లు ఒత్తుతాడు. సీత వద్దు అంటే వినడు. ఇక పోటీ గురించి తలచు కొని సీత బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: వారసుడు కావాల్సిందే.. రెండు జంటల్ని హనీమూన్‌కి పంపిన మహదేవయ్య!