Kajal Aggarwal guest appearance in Dhee Celebrity Special show: అందాల భామ కాజల్ అగర్వాల్... తెలుగు ప్రేక్షకులకు ఆవిడ చందమామ. 'మగధీర'లో పంచదార బొమ్మ కావచ్చు, 'చందమామ' కావచ్చు, మరొక సినిమా మరొక సినిమా కావచ్చు... కాజల్ అందాన్ని ఆవిష్కరించిన సందర్భాలు ఎక్కువ. కానీ, ఇప్పుడు 'క్వీన్ ఆఫ్ టాలీవుడ్', 'క్వీన్ ఆఫ్ మాసెస్'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'సత్యభామ'తో తనలో యాక్షన్ అవతార్ చూపించనున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు కాజల్. డ్యాన్స్ రియాలిటీ షో, ఈటీవీలో ప్రసారం అయ్యే 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'కు ఆవిడ అతిథిగా వెళ్లారు. లేటెస్టుగా ఆ ప్రోమో విడుదల చేశారు. 


కిచ్లూ బాధితుడిగా 'హైపర్' ఆది!
కాజల్ అగర్వాల్ పెళ్లి రోజు గుర్తు ఉందా? అక్టోబర్ 30! గౌతమ్ కిచ్లూతో ఆవిడ ఏడు అడుగులు వేశారు. ఆ విషయం గుర్తు చేశారు 'హైపర్' ఆది. 'ఐ థింక్... అక్టోబర్ 30 మీ పెళ్లి రోజు కదా!' అని అడిగితే... 'అవును' అని కాజల్ సమాధానం ఇచ్చారు. 'అది నా డెత్ డేట్' (నేను మరణించిన రోజు) అని 'హైపర్' ఆది అనడంతో అందరూ నవ్వేశారు.


కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెను ఊహించుకుంటూ ఎన్నో కవితలు రాశానని 'హైపర్' అది చెప్పారు. 'మరి పెళ్లి తర్వాత' అని కాజల్ ప్రశ్న వేస్తే... 'పెళ్లి తర్వాత కిచ్లూ బాధితుడిని నేను' అని ఆది చెప్పడంతో చందమామ కూడా నవ్వు ఆపుకోలేక క్లాప్స్ కొట్టారు.


'బాద్ షా'లో 'బంతిపూల జానకి' పాటకు డ్యాన్స్!
Kajal Aggarwal Dance In Dhee Show: 'ఢీ సెలబ్రటీ స్పెషల్' షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్. కాజల్ కథానాయికగా నటించిన పలు పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన 'బాద్ షా' సినిమాలోని 'బంతిపూల జానకి' ఒకటి. ఆ పాటకు ఢీ స్టేజి మీద శేఖర్ మాస్టర్, కాజల్ డ్యాన్స్ చేశారు.


'పంచదార బొమ్మ' పాటలో చరణ్ తరహాలో 'హైపర్' ఆది!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'మగధీర' సినిమా గుర్తు ఉందా? ఆ సినిమాలో 'పంచదార బొమ్మ' పాట సూపర్ హిట్టు. అందులో రామ్ చరణ్ వైట్ టీ షర్టు మీద బ్లాక్ షర్ట్ వేసుకుని కనిపిస్తారు. కొంత సేపు హ్యాట్ పెట్టుకుని కూడా కనిపిస్తారు. సేమ్ ఆ గెటప్ రీ క్రియేట్ చేశారు ఆది. అంతే కాదు... ఆ పాట కూడా పాడారు. ఆ పాటలో ఫిమేల్ లిరిక్స్ కాజల్ పాడటం విశేషం. ప్రజెంట్ ఈ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మే 22న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.


Also Read: కాజల్‌తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ - సత్యభామ సరసం చూడండి






మే 31న థియేటర్లలోకి 'సత్యభామ'
'గూఢచారి', 'మేజర్' సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో 'సత్యభామ' రూపొందుతోంది. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర జంటగా నటించిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిర్మాతగా శశికిరణ్ తిక్క తొలి చిత్రమిది. దీనికి ఆయన స్క్రీన్ ప్లే రైటర్ కూడా! మే 31న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.


Also Readవిద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జోడీ చేసిన రొమాన్స్ ఎలా ఉందంటే?