Happy Birthday Charmi: అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది చార్మి కౌర్‌. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. ఆడపులి, శివంగి అంటూ పవర్ఫుల్‌ డైలాగ్‌తో ఆకట్టుకుంది. అలా ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈమే అంతే టైంలో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ కోల్పోయింది. ప్రముఖ స్టార్‌ దర్శకుడితో అతి సన్నిహిత్యం వల్ల తరచూ విమర్శలు, ట్రోల్స్‌ ఎదుర్కొంది. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు చూసిన చార్మికి క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న ఆమె చివరిగా లైగర్‌తో భారీ నష్టాలు చూసింది. పూరీ కనెక్ట్స్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ సహా నిర్మాత వ్యవహరిస్తున్న చార్మి పుట్టిన రోజు నేడు. శుక్రవారం మే 17తో చార్మి 37వ పడిలో అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా చార్మి వ్యక్తిగత, సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 


పంజాబీ కుటుంబం..


మే 17, 1987 పంజాబీ కుటుంబంలో జన్మిచ్చింది. పదమూడేళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'నీ తోడు కవాలి'(2002) చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. అతి చిన్న వయసులోనే గృహిణి పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పొందిన చార్మి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత తమిళంలో ఆఫర్స్‌ అందుకుంది. తమిళంలో సిలంబరసన్‌తో చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె ఆ వెంటనే డైరెక్టర్‌ టి. రాజేందర్ 'కాదల్ అళివత్తిల్లై' చిత్రంలో ఆఫర్‌ కొట్టేసింది. అదే సమయంలో 'కట్టుచెంబకం' అనే మలయాళ చిత్రంలోనూ నటించింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒక్క సినిమాతోనే సౌత్‌ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించింది. అంతేకాదు హిందీలో అతిథి పాత్రల్లో నటించింది. అలా తనదైన నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్న చార్మి.. ఆవెంటనే 'నీకే మనసిచ్చాను' చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. 


ఈ చిత్రం పెద్దగా విజయం సాధించకపోయిన.. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన శ్రీ ఆంజనేయంలో సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాతో తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. ఇందులో చార్మి నటన, గ్లామర్‌ లుక్‌ మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత అక్కినేని హీరో సుమంత్‌ 'గౌరి' సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రాలతో చార్మి తెలుగులో స్టార్‌డమ్‌ అందుకుంది. ఇక వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. నాగార్జునతో 'మాస్‌' సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ఆ వెంటనే ప్రభాస్‌తో 'చక్రం', 'అనుకోకుండ ఒకరోజు' తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 


ఆ సినిమాతో 'నంది' అవార్డు


ఆ తర్వాత 'మంగళ' మూవీలో నటించిన చార్మి నటనకు గానూ ఉత్తమ నటి నంది అవార్డు వరించింది. ఇక చిత్రం తర్వాత బాపు గారు దర్శకత్వంలో తెరకెక్కిన సుందరకాండ అచ్చమైన తెలుగు అమ్మాయిగా నటించింది ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత లక్ష్మి, పౌర్ణమి సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌ రోల్స్‌ చేసింది. అయినా కూడా చార్మికి మంచి గుర్తింపు లభించింది. అయితే అలా వరుసగా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు చేసుకుంటూ పోతున్నా చార్మికి మెల్లి మెల్లిగా అవకాశాలు దక్కాయి. ఆఫర్స్‌ లేక కెరీర్‌లో పడ్డా చార్మి.. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మి' సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించింది. ఇందులో వేశ్య పాత్ర పోషించిన చార్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఇందులో చార్మి వేశ్యగా, గృహిణిగా తనదైన నటనతో మెప్పించింది. ఈ మూవీ చార్మి సహానిర్మాతగానూ వ్యవహరించింది. 


ఈ సినిమా టైంలోనే పూరీ జగన్నాధ్‌తో పరిచయం ఏర్పడింది. అదే పరిచయం వీరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. దాంతో పూరీ, చార్మి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ గుసగుసలు వినిపించాయి. ఆ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోసేలా పూరీ, చార్మిలు సినిమా ఈవెంట్స్‌లో, పలు మూవీ కార్యక్రమాలకు కలిసి హాజరయ్యేవారు. అప్పట్లో వీరిద్దరి రిలేషన్‌ హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇది కూడా చార్మి కెరీర్‌ డౌన్‌కు కారణమనే చెప్పాలి. దీనివల్ల ఆమె ఇండస్ట్రీలో నెగిటివిటీ కూడా పెరగడంతో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గాయి. దీంతో నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. జ్యోతిలక్ష్మి నుంచి లైగర్‌ వరకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మి ప్రస్తుతం 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమాను నిర్మాతగా వ్యవహిరిస్తుంది. ఈ సినిమాతో చార్మి హిట్‌ కొట్టి లాభాలు అందుకోవాలి ఆశిస్తూ చార్మి మరోసాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.