Krishnamma Movie Digital Streaming Platform: అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కృష్ణమ్మ'. మే 10న థియేటర్లలో విడుదల అయ్యింది. కట్ చేస్తే... అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. 


వారానికి ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ సినిమా!
Krishnamma Movie OTT Platform: 'కృష్ణమ్మ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో సినిమా విడుదల చేసినప్పుడు తమ ఓటీటీ పార్ట్నర్ వివరాల్ని వెల్లడించారు. అయితే, అప్పుడు ప్రేక్షకులు ఎవరూ ఇంత తక్కువ వ్యవధిలో ఓటీటీలోకి సినిమా వస్తుందని ఊహించలేదు.


Also Read: కృష్ణమ్మ మూవీ రివ్యూ: జీవితంలో అన్నీ కోల్పోయిన అనాథ ఎదురు తిరిగితే... కత్తి పడితే... కొరటాల సమర్పణలో సత్యదేవ్ సినిమా ఎలా ఉందంటే?






మే 10... అంటే లాస్ట్ ఫ్రైడే థియేటర్లలో 'కృష్ణమ్మ' విడుదల అయ్యింది. సరిగ్గా ఏడు రోజుల తర్వాత... అంటే ఒక్క వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంత తక్కువ టైంలో డిజిటల్ రిలీజ్ చెయ్యడానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ కావడం ఒక కారణం అయితే... ఏపీ అంతటా ఎన్నికల తదనంతరం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గుముఖం పట్టడం మరొక కారణం అని తెలుస్తోంది. ఓటీటీ రిలీజ్ వల్ల ఇంట్లో కూర్చుని సినిమా వెసులుబాటు ప్రజలకు ఉంటుంది. దాంతో వ్యూయర్షిప్ బావుండే అవకాశం ఉంది.


వారంలో 5.40 కోట్లు... బ్రేక్ ఈవెన్ అయ్యింది!
Krishnamma Movie Collections: 'కృష్ణమ్మ' సినిమా ఏడు రోజుల్లో రూ. 5.40 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ అరుణాచల క్రియేషన్స్ పేర్కొంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిందని చెప్పవచ్చు. సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, సోలో హీరోగా సత్యదేవ్ (Satyadev)కు మంచి హిట్. కానీ, థియేట్రికల్ రిలీజ్ అయిన వారానికి ఓటీటీలోకి సినిమా రావడం అందరికీ షాక్ అని చెప్పాలి.


Also Read: విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జోడీ చేసిన రొమాన్స్ ఎలా ఉందంటే?






'కృష్ణమ్మ' సినిమాను కృష్ణ కొమ్మలపాటి ప్రొడ్యూస్ చేశారు. వీవీ గోపాలకృష్ణ డైరెక్షన్ చేశారు. ఇందులో సత్యదేవ్ స్నేహితులుగా లక్ష్మణ్ మీసాల, కృష్ణ తేజ రెడ్డి యాక్ట్ చేయగా... కీలక పాత్రల్లో అతీరా రాజ్, రఘు కుంచె, నందగోపాల్, అర్చనా అయ్యర్ కనిపించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.