తెలుగు తెర చందమామ, అందాల భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను 'క్వీన్ ఆఫ్ మాసెస్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సినిమా 'సత్యభామ' (Satyabhama Movie 2024). యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. చేతికి గాజులు వేసుకుని లాకప్‌లో క్రిమినల్‌కు రక్తం వచ్చేలా కాజల్ కొట్టిన వీడియో గ్లింప్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అది చూశాక ఆవిడ యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేశారని ఈజీగా అర్థం అవుతుంది. యాక్షనే కాదు, సినిమాలో లవ్లీ రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉన్నాయని ఇవాళ విడుదలైన సాంగ్ చూస్తే తెలుస్తుంది.
నవీన్ చంద్రతో కాజల్ లవ్లీ రొమాంటిక్ మూమెంట్స్!
'సత్యభామ' టీమ్ ఈ రోజు 'కళ్లారా...' లిరికల్ వీడియో విడుదల చేసింది. నవీన్ చంద్ర ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పెయిర్ రోల్ చేశాడు. వాళ్లిద్దరి మీద ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు.
సత్యభామగా కాజల్ కాప్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. నవీన్ చంద్ర రోల్ ఏమిటి? అనేది రివీల్ చెయ్యలేదు. కానీ, వాళ్లిద్దరూ రింగులు మార్చుకోవడం నుంచి రూంలో రొమాంటిక్ మూమెంట్స్ వరకు పాటలో చూపించారు. అందమైన రిలేషన్షిప్ ఎలా ఉంటుందనేది చెప్పడానికి కొన్ని విజువల్స్ లిరికల్ వీడియోలో యాడ్ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... ఈ పాటలో కాజల్ అందంగా కనిపించారు.
'కళ్లారా...' పాటను ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడారు. కాజల్, శ్రేయాది హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరి కాంబోలో గతంలో పలు హిట్ సాంగ్స్ వచ్చాయి. ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా... శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.
Also Read: శృతి హాసన్ మళ్లీ ఒంటరే... బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్, ఇన్‌స్టాలో అన్ ఫాలో!
శశికిరణ్ తిక్క సమర్పణలో 'సత్యభామ' సినిమా రూపొందుతోంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిర్మాతగా శశికిరణ్ తిక్క ఫస్ట్ సినిమా ఇది. దీనికి ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు. మే 17న 'సత్యభామ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తన చేతుల్లో ప్రాణాలు వదిలిన ఓ అమ్మాయి మరణం వెనుక ఎవరు ఉన్నారు? ఆ హంతకులు ఎవరు? వాళ్లను సత్యభామ ఎలా పట్టుకుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగులో కాజల్ అగర్వాల్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ రోల్ చెయ్యడం ఇది మొదటిసారి.
Also Read: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర జంటగా నటించిన 'సత్యభామ' సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్, కథనం - సమర్పణ: శశి కిరణ్ తిక్క, నిర్మాతలు: బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత: బాలాజీ, ఛాయాగ్రహణం: జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల.