మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durg‌ha Tej)కు గత ఏడాది బాగా కలిసి వచ్చింది. హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'విరూపాక్ష'తో వంద కోట్ల వసూళ్లు సాధించాడు. ఓ భారీ విజయం అందుకున్నాడు. 'విరూపాక్ష' తర్వాత 'బ్రో' చేశాడు. ఆ మూవీలో చిన్న మావయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి యాక్ట్ చేశాడు. మామ అల్లుళ్లు కలిసి నటించిన ఫస్ట్ ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. 'బ్రో' తర్వాత సాయి తేజ్ నటించే సినిమా ఏది? అంటే... 


'హనుమాన్' నిర్మాతతో సాయి తేజ్ సినిమా
Sai Tej Movie With Hanuman Producer: సాయి దుర్గా తేజ్ హీరోగా 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమాతో రాకేష్ అనే యువకుడు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ కానున్నాడు. ఆల్రెడీ స్టోరీ ఫైనలైజ్ చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు.


1940 బ్యాక్ డ్రాప్... జూలై నుండి షూటింగ్!
సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్న మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కథా నేపథ్యం 1940 కాలంలో వుంటుందని, అందుకోసం ప్రీ ప్రొడక్షన్ నుంచి కేర్ తీసుకుంటున్నారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. జూలైలో షూట్ స్టార్ట్ చెయ్యడానికి సాయి తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ కేటాయించారని తెలిసింది.


Also Readవద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?



గంజా శంకర్ ఆగినట్టేనా? ఆ సినిమా లేదా?
'బ్రో' తర్వాత కొత్త సినిమాను సాయి తేజ్ సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేదు. నిజానికి సంపత్ నంది డైరెక్షన్లో అతడు 'గంజా శంకర్' అనౌన్స్ చేశాడు. ఆ మూవీ టైటిల్ కాంట్రవర్సీకి కారణం అయ్యింది. అయితే అనుకోని రీజన్స్ వల్ల ఆ మూవీని ప్రజెంట్ పక్కన పెట్టారని తెలిసింది. 


Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా



రాకేష్, నిరంజన్ రెడ్డి మూవీ తర్వాత సాయి తేజ్ మరో రెండు మూడు సినిమాలు రెడీ చేస్తున్నారు. అందులో 'చిత్రలహరి 2' కూడా వుందని టాక్. సాయి తేజ్ కెరీర్ లో 'చిత్రలహరి' స్పెషల్ మూవీ. అందులో ఆయన నటనకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. అది కాకుండా మరికొన్ని కథలు వింటున్నాడు.


'విరూపాక్ష'కు ముందు దేవా కట్ట దర్శకత్వంకో 'రిపబ్లిక్', దానికి ముందు 'సోలో బతుకే సో బెటర్' సినిమాలు చేశాడు సాయి తేజ్. అభిమానులకు ఆ సినిమాలు నచ్చాయి. కానీ, కమర్షియల్ పరంగా ఆశించిన విజయాలు రాలేదని ట్రేడ్ టాక్. ఆ రెండిటికి ముందు మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతి రోజూ పండగే' మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సాయి దుర్గా తేజ్ అని పేరు మార్చుకున్నాక వచ్చే సినిమా రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి.