Satyabhama Today Episode : విశ్వనాథం హాల్‌లో ఉంటే విశాలాక్షి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. హర్ష వచ్చి లంచ్ బాక్స్ ఇమ్మంటే నందినిని తీసుకురావడానికి వెళ్లమని విశాలాక్షి చెప్తుంది. సంధ్య వచ్చి మర్చిపోయాడేమో అని అంటుంది.


హర్ష: ఇప్పుడు తను వచ్చి ఇక్కడేం చేయాలి. ఎవరికీ మనస్శాంతి లేకుండా చేస్తుంది. తను వస్తే ఎవరికి సంతోషం అందరిని ఏడిపించడం తప్ప చేసేది ఏం లేదు.


విశాలాక్షి: అదేంటిరా అలా అంటున్నావ్. వీడేంటి అండి ఇలా మాట్లాడుతున్నాడు. వీడు మొండి వాడో నందిని మొండిదో అర్థం కావడం లేదు.


హర్ష: అమ్మా దీన్ని పెద్ద ఇష్యూ చేయకు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తా. 


ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు. అందరూ నన్ను దెయ్యాన్ని చూసినట్లు చేస్తున్నారేంటి అని రుద్ర అడుగుతాడు. ఇక విశ్వనాథం మనసులో వీడు వచ్చాడు అంటే ఏదో కొంప మునిగినట్లే అనుకుంటాడు. రుద్ర తన తండ్రి మహదేవయ్య హర్షని తీసుకురమ్మని చెప్పారని అంటాడు. హర్ష కారణం అడిగితే మర్యాదగా తనతో రమ్మని అంటాడు. ఆఫీస్‌కు వెళ్లాలని హర్ష అంటే తన బాస్‌కి కాల్ కలిపి ఇమ్మంటాడు రుద్ర. అతనితో తాను మహదేవయ్య కొడుకు అని ఈరోజు బామ్మర్ది ఆఫీస్‌కు రాడని మీకేమైనా అభ్యంతరమా అని అడుగుతాడు. హర్ష మ్యానేజర్ వణుకుతూ ఏం పర్లేదని మీరు చెప్తే అవసరం అయితే ఆఫీసే క్లోజ్ చేసేస్తాం అని అంటాడు. 


తల్లిదండ్రులు ఒప్పించడంతో హర్ష రుద్రతో వెళ్లాడు. మహదేవయ్య ఇంట్లో అందరూ హాల్‌లో ఉంటారు. మహదేవయ్య తల్లి గంట కొడితే రేణుక ఆమె మాటలను చెప్తుంది. ఎందుకు అందర్ని రమ్మన్నావు అని అడుగుతుంది. దానికి మహదేవయ్య అల్లుడిని తీసుకురావడానికి రుద్ర వెళ్లాడు వాళ్లు వస్తే చెప్తానని అంటాడు. ఇంతలో హర్ష, రుద్ర వస్తారు. 


మహదేవయ్య: రా అల్లుడు కూర్చో.


హర్ష: ఎందుకు పిలిపించారు.


మహదేవయ్య: పిలిపించడానికి కారణం ఉంది. కొంచెం ఓపిక పట్టు చెప్తా. 


భైరవి: బోణులో చిక్కుకున్నాడు కదా ఇళ్లరికపు అల్లుడు ఇంకెక్కడికి పోతాడు. 


మహదేవయ్య: లోపలికి వెళ్లి కవర్ తీసుకొని వచ్చి ఫ్లైట్ టికెట్స్. 


క్రిష్: ఎక్కడికి వెళ్తున్నావ్ బాపు.


మహదేవయ్య: వెళ్లాల్సింది నేను కాదు. మీ జంటలు కలిసి. 


నందిని: మాకేం పని ఉంది. మేం ఎక్కడికి వెళ్తాం బాపు.


మహదేవయ్య: హనీమూన్‌కి. మనాలికి చేశాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. ఎక్కువ టైం లేదు. వెళ్లి బట్టులు సర్దుకోండి అనగానే రెండు జంటలు షాక్ అయిపోతారు. క్రిష్, సత్య ఒకేసారి మేం పోము అని అంటారు. ఏం రా ఏమొచ్చిందిరా ఎందుకు పోరు. ఉన్న చోట కలిసి ఉండరు. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. దొంగ ప్రేమలు దొంగ నాటకాలు. ఇంటిలో ఉంటే నువ్వు బలాదూర్ పోతావ్. నువ్వు ఆఫీస్‌కు పోతావ్. ఎవరి దారి వారిది. హనీమూన్‌కి పోతే జంటగా కలిసి ఉండాలి. ఒకరి ముఖం ఒకరు చూసుకోని చచ్చినట్లు కలిసే ఉండాలి. కనీసం అప్పుడైనా మొగుడు పెళ్లాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసి ఉంటారేమో అని నా ఆశ. 


క్రిష్: సత్య బయటకు వెళ్తే అమ్మ కింద ఎవరు ఉంటారు.


మహదేవయ్య: రేణుక ఉంటుందిగా.


క్రిష్: నేను పోతే నీ దగ్గర ఎవరు ఉంటారు.


రుద్ర: నేను ఉంటాగా.


మహదేవయ్య: నీ మొగుడు నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 


సత్య: సరే.. 


నందిని: బాపు కావాలి అంటే నీ చిన్న కొడుకుని పంపించుకో నాకు ఈ హనీమూన్ గట్రా నచ్చవు నా వల్ల కాదు. నేను పోను.


మహదేవయ్య: సత్య పరాయి ఇంటి పిల్ల అందుకే మర్యాద కోసం పోతావా అని అడిగాను. నువ్వు నా బిడ్డవు నిర్ణయం తీసుకోవాల్సింది నేను. నువ్వు పోతున్నావ్. పోవాల్సిందే. 


హర్ష: మీరు డిసైడ్ అయిపోతే సరిపోతుందా నా నిర్ణయంతో పనిలేదా.


రుద్ర: హలో ఈ ఇంట్లో బాపు ఏం చెప్తే అదే ఫైనల్. ఏది చెప్తే అది జరిగి తీరాల్సిందే ఎదురు తిరగడానికి వీళ్లేదు. 


హర్ష: నాకు ఆఫీస్‌లో పనులు ఉన్నాయి లీవ్ పెట్టడానికి కుదరదు. నాకు ఫోర్స్ చేయకండి. నాకు బాధ్యతలు ఉన్నాయి. అమ్మానాన్నలు ఉన్నారు. చూసుకోవాలి. పర్మిషన్ అడగాలి.


మహదేవయ్య: రుద్ర ఆ ఫ్రొఫెసర్‌కి కాల్ చేయండి. నమస్తే బావగారు. బావగారు మీ కొడుకు రెండు మూడు రోజులు మీ ఇంట్లో లేకపోతే మీకు పర్లేదా..


విశ్వనాథం: రెండు రోజులు కాదు నెల లేకపోయినా మాకు ఏం పర్లేదు బావగారు.  


మహదేవయ్య: ఇంకొక్క ప్రశ్న నా కూతుర్ని అల్లుడిని హనీమూన్‌కి పంపుతున్నా మీకు ఏమైనా అభ్యంతరమా.


విశ్వనాథం: హనీమూన్‌కి పిల్లలు కాకపోతే మనం వెళ్తామా బావగారు. సంతోషంగా పంపించండి మాకు ఏ అభ్యంతరం లేదు. 


సత్య: మనసులో.. పైకి చెప్పడం లేదు కానీ అన్నయ్య వదినా సఖ్యతగా లేరు వీళ్లని కలపడానికి ఈ హనీమూన్ మంచి అవకాశం. 


మహదేవయ్య:  మీరు హనీమూన్‌కి పోవాల్సిందే.


సత్య: మామయ్య గారు మేం హనీమూన్‌కి వెళ్తాం. అదే మాతో పాటు అన్నయ్య వదినలు కూడా వస్తారు. నేను ఒప్పిస్తాను. 


క్రిష్: మనసులో.. సత్య నిజంగానే ఒప్పుకుందా లాస్ట్‌లో క్యాన్సిల్ చేయాలని చూస్తుందా. హానీమూన్‌కి వెళ్లమంటేనే బాపు శివతాండవం ఆడుతున్నాడు. ఇక విడాకుల గురించి తెలిస్తే ఏమవుతుందో. 


మహదేవయ్య: చిన్నా టికెట్లు నీ దగ్గరే పెట్టుకొని ప్రయాణం ఏర్పాట్లు చూడు. ఎవరైనా నాటకాలు ఆడి ఆగిపోతే మహదేవయ్య అంటే ఏంటో చూపిస్తా.. నాకు వారసుడు కావాలి అంతే. 


మరోవైపు విశ్వనాథం రెండు జంటలు హనీమూన్‌ గురించి విశాలాక్షికి చెప్తాడు. హర్ష, నందినికి ఒకరు అంటే ఒకరికి ఇష్టం లేదని ఇద్దరూ తమ ఎదురుగానే కొట్టుకుంటారని అలాంటి వారు కొత్త ప్లేస్‌లో ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుందా అని భయపడతాడు. విశాలాక్షి భర్తకు సర్దిచెప్తుంది. కొడుకు కోడలు కూడా కలిసి పోతే బాగున్ను అని అనుకుంటారు. 


క్రిష్: అసలే ఆ పిచ్చిది నాకు కక్కూర్తిగాడు అని స్టాంప్ వేసింది. ఇప్పుడు హనీమూన్‌కి వెళ్తే కక్కూర్తి అనే మాటను నా ఇంటి పేరు చేస్తుంది. బాబోయ్ ఈ నెత్తినొప్పి ఎవడు పడతాడు. అంటూ హనీమూన్ అరేంజ్ చేసిన ట్రావెల్ ఏజెంట్‌కు కాల్ చేస్తాడు.టికెట్స్ క్యాన్సెల్ చేయమని అంటాడు. ఏజెంట్ మహదేవయ్యకు భయపడతాడు. క్రిష్ క్యాన్సెల్ చేయకపోతే చంపేస్తా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : వారంలో పెళ్లి.. వాంతులు చేసుకున్న ముకుంద, ఆదర్శ్‌ వల్లే తల్లైందని అనుమానిస్తున్న భవాని!