Seethe Ramudi Katnam Today Episode

  డాక్యుమెంట్ల ఎందుకు చింపావని రామ్ సీతని ప్రశ్నిస్తాడు. సీత జరిగింది అంతా చెప్పినా రామ్ తన పిన్ని అలా చేసింది అంటే నమ్మను అంటాడు. అబద్ధం చెప్తున్నావ్ అని సీతని తిడతాడు. పిన్ని తనకు నమ్మకద్రోహం చేస్తుంది అంటే ప్రాణంపోయినా నమ్మనని తాను అడిగితే తన పిన్ని ఆమె వాటా కూడా తనకే ఇచ్చేస్తుంది అని రామ్ అంటాడు. 


సీత: మీ పిన్ని ఏ దురుద్దేశంతో మీ వాటా తన పేరు మీద రాయించుకోవాలి అని అనుకుందో తననే అడగండి. నిలదీయండి.. నా మాట అబద్ధం అయితే అప్పుడు మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను.
రామ్: నువ్వు చెప్పింది అబద్దమా మా పిన్నికి నామీద ఉన్న నమ్మకం నిజమో మా పిన్ని ముందే తేల్చుతాను. నాతో రా..
అర్చన: మహా నువ్వు చెప్పినట్లు సీత మీద రామ్‌కి ఉన్నవి లేనివి చెప్పి బాగా ఎక్కించాం మహా..
గిరిధర్: ఈపాటికే సీత పని అయిపోయింటుంది. 
రేవతి: అంత లేదు అన్నయ్య మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి.. మీరు చేసిన ఫ్రాడ్ గురించి సీత రామ్‌కి చెప్పే ఉంటుంది. రివర్స్‌లో రామ్ మీ మీద సీరియస్ అయినా ఆశ్చర్యం లేదు.
మహాలక్ష్మి: మేం ఫ్రాడ్ చేయడం ఏంటి ఆ డాక్యుమెంట్స్‌లో ఏం రాసుందో నువ్వు చూశావా.. 
చలపతి: మీరు చెప్పకపోయినా రామ్ ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటున్నావ్ అని సీత చెప్పింది కదా చెల్లి.
మహాలక్ష్మి: నువ్వు నోరు మూస్తావా అన్నయ్య. ముందు మీ ఇద్దరి గొంతులు కట్ చేయాలి. 
రామ్: తనేమంటుందో తెలుసా పిన్ని.. నీ మీద పెద్ద నింద వేసింది. మీరంతా కలిసి నన్ను చీట్ చేస్తున్నారు అంట. నా వాటా ఆస్తి పిన్ని తన పేరుమీద రాయించుకోవడానికి పిన్ని డాక్యుమెంట్స్ మీద రాయించుకుంది అంట. అందుకే తను ఆ పేపర్స్ చింపేసింది అంట. ఇంకా ఏదేదో చెప్పింది. అది నిజం కాదు కదా పిన్ని. సీత అబద్ధం చెప్పింది కదా. నువ్వు అలా చేయవు కదా పిన్ని. 
మహాలక్ష్మి: సీత చెప్పిందే నిజం అని నువ్వు నమ్ముతున్నావా రామ్. 
రామ్: నేను నమ్మలేదు పిన్ని. నిజం ఏంటో నీ నోటితోనే చెప్పిద్దామని సీతని తీసుకొచ్చా. మీరు అలా చేయరు కదా..
సీత: దొంగతనం చేసిన వారు ఎవరూ తాను దొంగ అని ఒప్పుకోరు.
మహాలక్ష్మి: అసలు దొంగతనమే జరిగినప్పుడు ఎవర్ని దొంగ అంటున్నావ్.
సీత: మిమల్నే.. మీరు మోసంతో నా భర్త ఆస్తిని కొట్టేయాలి అని చూశారు.
మహాభర్త: ఊరికే నింద వేయకు సీత. మహాని దొంగ అనే స్థాయికి దిగావు అంటే నిన్ను ఏమనాలి.
సీత: కన్న తండ్రి అయి ఉండి మీ అబ్బాయికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉండిపోయారా మామయ్య. 
మహాలక్ష్మి: రామ్‌కి నేను కూడా కన్నతల్లినే.. నా కొడుకుకు నేను ఎందుకు మోసం చేస్తాను. 
సీత: చేశారు. ఎందుకు అంటే ఆయన మీ కన్న కొడుకు కాదు సవతి తల్లి కాబట్టి.
రామ్: సీత.. 
మహాలక్ష్మి: కావాలంటే లాయర్‌కి ఆడిటర్‌కి ఫోన్ చేసి కనుక్కో రామ్. కావాలి అంటే నా ఫోన్‌తో కాల్ చేయ్ రామ్.. వాళ్లు నీకు నా ప్లాన్ అంతా చెప్తారు కదా.. 
సీత: అవసరం లేదు. ఈ పాటికి మీరు వాళ్లని డబ్బుతో కొనేసి ఉంటారు. వాళ్ల నోళ్లు మూయించి ఉంటారు. 
అర్చన:  అంటే ఇక్కడ నువ్వు తప్ప అందరూ తప్పుడు వాళ్లనా నీ ఉద్దేశం.
సీత: మీరు ఆయన్ను మీ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. మీరు చెప్పేది అంతా చేసేలా చేస్తున్నారు. మిమల్ని గుడ్డిగా నమ్మేలా చేశారు. మీరు ఆడమన్నట్లు ఆడేలా చేశారు. ఈయన్ని ఒక కీలు బొమ్మలా చేశారు.
మహాలక్ష్మి: ఏంటి రామ్ నన్ను సీత అన్ని మాటలు అంటుంటే కామ్‌గా ఉన్నావ్. అంటే సీత అన్న మాటలు నిజం అని నువ్వు నమ్ముతున్నావా..
రామ్: అదేం లేదు పిన్ని.. 
మహాలక్ష్మి: అర్థమవుతుంది రామ్. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన ఈ పిన్నిని కాదని నిన్నకాక మొన్న వచ్చిన నీ భార్యని నమ్ముతున్నావ్. 
రామ్: లేదు పిన్ని..
మహాలక్ష్మి: నాకు తెలుస్తుంది రామ్ నీ పెళ్లం చెప్పింది విని నన్ను నిలదీయడానికి వచ్చావు కదా.. తను నాపై వేసిన నిందల్ని నువ్వు నిజం అని నమ్ముతున్నావ్ కదా.  నేను నిన్ను చీట్ చేసి నీ ఆస్తి అంతా నా పేరుతో రాయించుకుంటున్నాను అని నువ్వు కూడా నమ్ముతున్నావ్ కదా. నాకు అర్థమైంది. 
రేవతి: మహాలక్ష్మి ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేసింది రామ్‌ని నమ్మించడానికే ఇదంతా.. 
చలపతి: అర్థమవుతుంది అండీ మా చెల్లి ప్లాన్.
మహాలక్ష్మి: నన్ను నా కొడుకే అనుమానిస్తున్నాడు. నేను ఏం చేయాలి. నా కొడుకు నన్ను నమ్మడం లేదు. గిరి వెళ్లి కాళీ డాక్యుమెంట్స్ పెన్ను తీసుకొని రా.. నువ్వు నన్ను హర్ట్ చేశావ్ రామ్. నేను చాలా ఫీలవుతున్నాను. నువ్వు ప్రీతి నా రెండు కళ్లు అనుకున్నాను. మిమల్ని పెంచడం కోసం నాకు పిల్లలు వద్దు అనుకున్నాను. మీరే నా కన్న బిడ్డలు అనుకొని మీ మీద ప్రేమ పెంచుకున్నాను. నా కంటూ సొంత పిల్లలు లేని నాకు సొంత ఆస్తి ఎందుకు అవసరం అయితే నా ప్రాణం ఇస్తాను కానీ నీ ఆస్తిమీద నేను ఆశ పడతానా. నా గురించి అంత తక్కువగా ఆలోచించావా రామ్. ఈ తల్లిని అనుమానించి అవమానిస్తున్నావా..
రామ్: లేదు పిన్ని నాకు ఆ ఆలోచనే లేదు. మీ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు.
మహాలక్ష్మి: నీకు నా మీద అనుమానం లేకపోతే నువ్వు సీతని తీసుకొని వచ్చేవాడివే కాదు. ఇంతదాకా వచ్చాక నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి. కన్నతల్లి ప్రేమను నిరూపించుకోవాలి. ఖాళీ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి ఇందులో ఏం రాసుకుంటావో రాసుకో.. ఒక తల్లి తన బిడ్డలకు సర్వస్వం ఇస్తుందే తప్ప ఏం ఆశించదు. నీకు ఆ విషయం అర్థం కావాలి. తీసుకో రామ్.. 
మహాభర్త: ఏడవకుండా ఎలా ఉంటుంది రామ్. చెంప మీద కొట్టున్నా ఇంత బాధ పడేది కాదు.  తన ప్రేమ మీద నమ్మకం మీద కొట్టావ్. కోలుకోలేని దెబ్బకొట్టావ్. 
అర్చన: తప్పు చేశావ్ రామ్ కన్నతల్లి లాంటి మహాతో కన్నీళ్లు పెట్టించావ్ ఇది చాలా తప్పు.
ప్రీతి: దీనంతటికీ కారణం ఈ సీత.. ఇంట్లో అందరి కన్నీళ్లు తుడిచే పిన్ని చేత కన్నీళ్లు పెట్టించింది. 
ఉష: ఈ సీతని ఏం చేసినా తప్పు లేదు మర్యాదగా పెద్దమ్మకి సారీ చెప్పు.
సీత: నేను ఎందుకు చెప్పాలి.
రామ్: మా పిన్నికి సారీ చెప్పు సీత. 
సీత: చేయని తప్పునకు నేను తలవంచను ఎవరికీ సారీ చెప్పను.
అర్చన: నువ్వు చెప్పినా వినకుండా ఆ సీత వెళ్లి పోయింది. 
గరిధర్: నీకు ఆ సీత ఎలాంటి గౌరవం మర్యాద ఇవ్వడం లేదు. దాని కోసం మీ పిన్నిని అవమానించావ్. నీతోపాటు సీత కూడా సారీ చెప్పాల్సిందే.. చెప్పించు..
రామ్: ప్లీజ్ పిన్ని నాతో మాట్లాడి నా సారీ అంగీకరించు కావాలి అంటే మీ కాళ్లు పట్టుకుంటా..
మహాలక్ష్మి: రామ్ నువ్వు నా కాళ్లు పట్టుకోవడం కాదు ఆ సీతతో నా కాళ్లు పట్టించు క్షమాపణ చెప్పించు. అంత వరకు నాతో మాట్లాడొద్దు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఊర్వశివో రాక్షసివో సీరియల్ ఫిబ్రవరి 8th: విజయేంద్ర మీద ద్వేషం పెంచుకున్న దుర్గ.. మధుసూదన్, భవ్యలను రక్షించిన వాసు!