సూపర్ స్టార్ రజనీకాంత్ - యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిసి చేస్తున్న సినిమా 'కూలీ'. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటించారు. ప్రేక్షకులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అదే రోజు బాలీవుడ్ సినిమా 'వార్ 2' కూడా వస్తోంది. అందులో గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. రజని సినిమాకు ఐమాక్స్ స్క్రీన్లు ఇవ్వరా?ఇండియాలో అటు ఇటుగా 30 ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా రజనీకాంత్ సినిమాకు వచ్చే అవకాశాలు లేవని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'వార్ 2' సినిమాను టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి అయినటువంటి యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రతి ఏడాది ఆ సంస్థ నుంచి మినిమం పది సినిమాలు అయినా వస్తాయి.
ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని తమ సినిమాకు మాత్రమే ఇవ్వాలని మల్టీప్లెక్స్ ఓనర్స్‌తో యశ్ రాజ్ ఫిలిమ్స్ అగ్రిమెంట్ చేయించుకుంటోందని బాలీవుడ్ వర్గాల నుంచి వినబడుతోంది. అది కూడా రెండు వారాల పాటు ఐమాక్స్ స్క్రీన్స్ అన్నిటిలో తమ సినిమా మాత్రమే ప్రదర్శించాలని కండిషన్ పెట్టిందట. దాంతో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా 'కూలీ'కి వచ్చే అవకాశం లేదని వినబడుతోంది.
Also Read: టీవీ ఛానల్ మీద దాడి... మధ్యలో ఇరుక్కున్న హీరో... ఆందోళనకు గురైన సుహాస్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమా పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా ఆయన సినిమా తీస్తుండడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరో వైపు టీజర్ విడుదలైన తర్వాత 'వార్ 2' మీద తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాలలో బజ్ తగ్గింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో రజనీ సినిమాకు ఐమాక్స్ స్క్రీన్ లేకుండా చేయడం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.