Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విహారితో ఈ టైంలో బోనస్ ఎందుకు అని అంటుంది. ఈ టైంలో ఇస్తేనే వాళ్లకి మన మీద నమ్మకం పెరుగుతుంది. మార్కెట్‌లో మన కంపెనీ మీద పాజిటివిటీ పెరుగుతుంది. ఇంకా మంచిగా పని చేస్తారని విహారి చెప్తాడు. ఇక అంబిక సుభాష్‌ని కలుస్తుంది. విహారి వాళ్లకి 100 కోట్ల లోన్  వస్తుందని చెప్తుంది. 

Continues below advertisement


సహస్రని వాడుకొని లక్ష్మీ గతంలో రికవరీ చేసిన డబ్బు దక్కించుకోవాలని అంబిక అంటుంది. అది ఎలా అని సుభాష్ అడిగితే లోన్ వచ్చిన తర్వాత అందుకు సంబంధించిన లోక్ యాక్సెస్ లక్ష్మీకి ఉంటుంది. లక్ష్మీ వేలిముద్రలు సంపాదిస్తే మన హ్యాకర్‌ని ఉపయోగించుకొని మొత్తం డబ్బు మన అకౌంట్‌లోకి తీసుకోవచ్చని అంటుంది. సుభాష్‌ ఐడియా సూపర్ అంటాడు. తర్వాత నెగిటివ్ కామెంట్స్ చేసి కంపెనీ పరువు తీసేద్దాం.. అప్పుడు మళ్లీ నా కంపెనీ నాకు వచ్చేస్తుందని అంటుంది. సహస్రని బెదిరించి లక్ష్మీ ఫ్రింగర్ ప్రింట్స్ తీసుకురమ్మని సుభాష్‌కి  చెప్తుంది. 


సహస్రకు సుభాష్ కాల్ చేస్తాడు. ఎవడ్రా నువ్వు అని సహస్ర అడిగితే  లక్ష్మీ పెన్‌డ్రైవ్ నాకు ఇచ్చావ్ తను ప్రజంటేషన్ ఇవ్వలేదు కదా అని సుభాష్ అంటాడు. నువ్వు ఎందుకు నాకు కాల్ చేశావ్ అంటే మన ఇద్దరం క్రైమ్ పార్టనర్స్అంటాడు. సహస్ర షాక్ అయిపోతుంది. సుభాష్ తనకు డబ్బులు అవసరం ఉందని మీ బావ అకౌంట్‌లో వంద కోట్లు పడుతున్నాయ్ అంట కదా అంటాడు. నా అవసరాలకు ఆ వంద కోట్లు కావాలి అని సుభాష్‌ అనగానే సహస్ర షాక్ అయిపోతుంది. సహస్ర తాను ఏం చేయను అనగానే ఇంటి బయట నా మనిషి ఉన్నాడని వాడి చేతిలో పెన్‌డ్రైవ్ ఉంది అందులో నువ్వు హాస్పిటల్‌లో ఆడిన నాటకం మొత్తం ఉందని  చెప్తాడు. 


సుభాష్ వాడిని లోపలికి పంపగానే సహస్ర భయపడి వాడిని ఆపమని చెప్తుంది. మా బావ ఫ్రింగర్ ప్రింట్స్ సంపాదించడం నా వల్ల కాదు అని సహస్ర అంటే దానికి లక్ష్మీ ఫ్రింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయని తనవి ఇస్తే చాలు అంటాడు. లక్ష్మీని ఇరికించాలని సహస్ర అనుకుంటుంది. హాల్‌లో అందరూ విహారి తండ్రి ఫొటోకి దండం పెట్టుకుంటారు. పద్మాక్షి సహస్రని దండం పెట్టుకోమని చెప్తుంది. అంబిక ఏం తెలీనట్లు సహస్రతో ఏంటి టెన్సన్ పడుతున్నావ్ అంటుంది. ఏం లేదు అని సహస్ర అనగానే నీకు టెన్షన్ పెడుతుంది నేనే చెప్పిన పని చేయకపోతే అప్పుడు నీకు ఉంది అనుకుంటుంది. 


పద్మాక్షి అలంకరణ ఎవరు చేశారు అని అంటే అందరూ లక్ష్మీ చేసింది అని చెప్పి తెగ పొగిడేస్తారు. ఏదో పొరపాటున అడిగితే లక్ష్మీ జపం మొదలెట్టేశారా ఆపండి అని పద్మాక్షి అంటుంది. పద్మాక్షి తన అన్నయ్య ఫొటో దగ్గరకు వెళ్లి నీ పెళ్లి వల్ల గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాను.. ఇప్పుడు నీ కొడుకు వల్ల వచ్చాను. ఇన్నాళ్లకు రెండు కుటుంబాలు కలిశాయి అన్నయ్య అని అంటుంది. సహస్ర, విహారిలతో మీ ఇద్దరూ కలిసి మళ్లీ మా అన్నయ్యని మాకు ఇవ్వాలి అని అంటుంది. యమున కూడా మీ ఇద్దరూ త్వరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అని అంటుంది. 


అంబికకు సిద్దార్థ్ కాల్ చేస్తాడు. డబ్బులు లేవు అని చెప్పా కదా ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావ్ అని అంటుంది. నా దగ్గర డబ్బులు లేవు అని అంబిక అనగానే వంద కోట్లకు స్కెచ్‌ వేశావ్ కదా అంటాడు. అంబిక షాక్ అయిపోతుంది. 50 శాతం తనకు ఇవ్వమని అంటాడు. చివరకు 30 శాతానికి ఒప్పందం పెట్టుకుంటారు. తర్వాత అంబిక సుభాష్‌కి కాల్ చేసి మన ప్లాన్ ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది. సిద్దార్థ్ గురించి చెప్తుంది. వాడా వాడికి తెలియడం ఏంటి అని సుభాష్ అంటాడు. ఈ సారికి షేర్ ఇచ్చి తప్పించుకుందాం అప్పటికీ బుద్ధి చూపిస్తే చంపేద్దాం అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!