'కన్నప్ప' సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ... చివరి గంట సేపు తెరపై భావోద్వేగంతో ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో భారీ విజయాన్ని తమకు కట్టబెట్టారని విష్ణు మంచు పేర్కొన్నారు. 'కన్నప్ప'కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, బాక్సాఫీస్ దగ్గర వస్తున్న వసూళ్ల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మర్నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విష్ణు మంచు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నటుడిగా నా విజిటింగ్ కార్డు 'కన్నప్ప'!Kannappa is my visiting card as an actor, says Vishnu Manchu at Thank You Meet: నటుడిగా తన విజిటింగ్ కార్డు 'కన్నప్ప' అని విష్ణు మంచు అన్నారు. 'ఢీ'లో బాగా చేశానని అందరూ చెప్పారని, రాము (రామ్ గోపాల్ వర్మ) గారి దర్శకత్వంలో చేసిన 'అనుక్షణం'లో తన పెర్ఫార్మెన్స్ తనకు ఇష్టమని, అయితే 'కన్నప్ప' విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారని విష్ణు వివరించారు. కింగ్ అక్కినేని నాగార్జున నుంచి 'దేనికైనా రెడీ' విడుదల అయ్యాక తనకు ఫోన్ వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ళకు ఆయన నుంచి 'కన్నప్ప' విడుదల తర్వాత ఫోన్ వచ్చిందని తెలిపారు.
నాగార్జున నుంచి అభినందనలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ సహా యువ హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్, నితిన్, దర్శకుడు శ్రీనువైట్ల, ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ నుంచి మెసేజ్ వచ్చినట్లు విష్ణు తెలిపారు.
ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ వచ్చాయన్న విష్ణు!'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఉండడం వల్లే చాలా మంది థియేటర్లకు వచ్చారని, పరమ శివుని భక్తుని కథ తెలుసుకున్నారని, తన బ్రదర్ ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చాయని అంగీకరించడానికి తనకు ఎటువంటి ఈగో లేదని విష్ణు తెలిపారు.
Also Read: రజనీకాంత్ 'కూలీ'కి ఐమాక్స్ స్క్రీన్స్ లేకుండా చేస్తున్న YRF... అక్కడ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాంటేజ్!?
ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చాయన్న విష్ణు... వెండితెరపై ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా మారిందని వస్తున్న మాటలను మాత్రం అంగీకరించలేదు. ప్రభాస్ ఎంట్రీ నుంచి కాదని, ఇంతకు ముందు తండ్రిగా నటించిన శరత్ కుమార్ - తనకు మధ్య సన్నివేశం నుంచి సినిమా మారిందని విష్ణు తెలిపారు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ లభించాయని, 15 లక్షల టికెట్లు అమ్ముడు అయినట్లు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమకు తెలిపిందని చెప్పారు.
ఓటీటీ నుంచి అడిగిన అమౌంట్ వస్తుందా?'కన్నప్ప' విడుదలకు ముందు ఓటీటీ సంస్థ తమకు ఆఫర్ చేసిన అమౌంట్ నచ్చలేదని విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చే ఓపెనింగ్స్ బట్టి డబ్బులు ఇస్తామని అన్నారని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు ఓటీటీ సంస్థకు చెక్ రెడీ చేసుకోమని ఫోన్ చేసినట్లు చెప్పారు.