Satyabhama Today Episode సత్యభామ అద్దం ముందు కూర్చొని బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్యామిలీ మొత్తం అక్కడికి వస్తారు. అది చూసిన సత్య హుషారుగా ప్రవర్తిస్తుంది. ఎందుకు అందరూ డల్‌గా ఉన్నారు పెళ్లి అంటే ఎలా ఉండాలి అని అడుగుతుంది. దీంతో విశాలాక్షి ఇది నీకు పెళ్లి అనిపిస్తుంది కానీ మాకు అనిపించడంలేదమ్మా అని అంటుంది. 


విశాలాక్షి: లోపలికి అడుగుపెట్టగానే అర్థమైంది ఇక ముందు ఈ కుటుంబంలో నీ జీవితం ఎలా ఉండబోతుందో.. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో. అన్ని తెలిసి కూడా ఎలా సంతోషంగా ఉంటామమ్మా..
సత్య: ఈ ఇంటి పెద్ద కోడలే చెప్పింది. ఇక్కడ ఇలాగే ఉండాలి దులిపేసుకొని పోవాలి అని. అత్తారింటికి వెళ్లకముందే అక్కడ పరిస్థితులు తెలిసినందుకు నేను సంతోషపడుతున్నాను.
శాంతమ్మ: నిజం చెప్పవే.. నీ మనసులో భయంగా లేదా..
సత్య: అస్సలు లేదు.. అయినా నిజం చెప్తే మాత్రం ఏం చేస్తారు.
విశ్వనాథం: ఈ పెళ్లి ఆపేస్తాను.
సత్య: ప్లీజ్ నాన్న ఇంకోసారి ఆ మాట అనొద్దు. అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వొద్దు. నాన్న ఈ పెళ్లి ఆపేసి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ అత్తగారు నన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారు అని మీరు గ్యారెంటీ ఇస్తారా. మీరే కాదు నాన్న దేవుడు కూడా గ్యారెంటీ ఇవ్వలేడు.
విశ్వనాథం: నా బాధ నీకు అర్థం కాదు తల్లి. ఏ తండ్రి అయినా కూతురి పెళ్లి అంటే సంతోషంగా.. ఓ తృప్తితో అత్తారింటికి సాగనంపుతాడు. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా.. నా పని లేకుండానే నా ప్రమేయం లేకుండానే నా నిర్ణయాలు పట్టించుకోకుండానే ఇక్కడ నా కూతురు పెళ్లి జరిగిపోతుంది. ఏదో పరాయి పెళ్లికి వచ్చినట్లు ఉంది. 
సత్య: జీవితం అంటే రూల్స్ బుక్ కాదు నాన్న ఇలా ఉండాలి అలా ఉండాలి అని రాసుకోవడానికి. ఎదురు దెబ్బలు తగిలితే మందు రాసుకొని ముందుకు వెళ్లాలి. అది మీరు అయినా నేను అయినా.. నేను ఇంక మీ మధ్య కలిసిఉండబోయేది కేవలం ఇంకా ఒక్క రోజు మాత్రమే. ఆ సమయం అంతా మీరు నాతో సరదాగా నవ్వుతూ ఉంటే ఆ జ్ఞాపకాల్ని నేను నాతో మనసులో మోసుకుంటూ సంతోషంగా గడిపేస్తాను. నా సంతోషంతో మీకు పనిలేదు అనిమీకు అనిపిస్తే మీకు నచ్చినట్లు ఉండండి.
విశాలాక్షి: సత్య ఏంటి ఆ మాటలు.. చూడు నువ్వు కోరుకున్నట్లే నీ పెళ్లిని నవ్వుతూ సంతోషంగా జరిపిస్తామమ్మా.. 
సత్య: థ్యాంక్స్ అమ్మా. 


ఇంతలో హర్ష బాలు, మీనలను తీసుకొని వస్తాడు. వాళ్లతో అందరూ సరదాగా మాట్లాడుతారు. ఇక క్రిష్ అక్కడికి వస్తాడు. సత్యని పిలుస్తాడు. ఇక సత్య తను క్రిష్ నాకు కాబోయే భర్త అని బాలు, మీనలకు పరిచయం చేస్తుంది.


క్రిష్: మనసులో.. అబ్బా చెవుల్లో తేనె పూసినట్లు ఉంది. 
బాలు: క్రిష్ దగ్గరకు వెళ్లి బాలు తనని తాను పరిచయం చేసుకుంటాడు. పెళ్లి కూతుర్ని ఇక్కడ నుంచి చూడటం కాదు బ్రో. దగ్గరకు వెళ్లి మాట్లాడే ఆప్షన్ కూడా ఉంది. రండి..
క్రిష్: బట్టల బ్యాగ్ చేతికి ఇస్తూ.. సత్య నీ కోసం దిల్లీ నుంచి తీసుకొచ్చా ఫొటో షూట్‌కి వేసుకుంటావని తీసుకో..
భైరవి: రేయ్ క్రిష్ అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఇక్కడేం చేస్తున్నావ్. మీరు వచ్చింది గదిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికేనా బాధ్యత లేదా.. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు. రేయ్ క్రిష్ నడు..
క్రిష్: సరే సత్య మీరు రెడీ అవ్వండి నేను రెడీ అవుతా..


ఇక మీన రెడీ అయి పెళ్లి పనుల్లో బిజీ అవుతుంది. ఇక మహదేవయ్య చేతిలో నుంచి కత్తి జారి పడిపోవడం చూస్తుంది. మహదేవయ్యని పిలిచి కత్తి ఇస్తుంది. ఇంతలో దేవా ఓ రౌడీని తీసుకొచ్చి వాడు మినిస్టర్ మనిషి అని మినిస్టర్ కూతురు పెళ్లి క్రిష్‌తో జరగనందుకు క్రిష్‌ని చంపేయ్ మని మనిస్టర్ పురమాయించాడని అంటాడు. దీంతో మహదేవయ్య ఆ రౌడీని కత్తితో పొడిచి చంపేస్తాడు.  అది చూసి మీన షాక్ అయిపోతుంది. ఇక మహదేవయ్య మీనా దగ్గరకు వచ్చి భయపడ్డావా ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపో అని అంటాడు.


మీన: ఇది అసలు ఇళ్లేనా వీళ్లు మనుషులా రాక్షసులా.. ఇలాంటి ఇంటికి సత్యని కోడలిగా పంపిస్తున్నారా.. లేదు అలా జరగకూడదు. వెంటనే ఈ విషయం అంకుల్‌కి చెప్పాలి. 
విశ్వనాథం: ఫోన్‌లో పోలీస్‌ రఘుతో.. చదువు చెప్పి ఎంతో మందికి దారి చూపిన నీ గురువు ఇప్పుడు దారి తెలియని పరిస్థితిలో ఉన్నాడు బాబు. ఎలా అయినా సరే నువ్వే ఈ పెళ్లి జరగకుండా ఆపాలి బాబు.
రఘు: ఆ ఇంటి సంగతి ఆ మనుషుల సంగతి తెలిసికూడా మీ అమ్మాయి పెళ్లికి ఎలా ఒప్పుకుంది.
విశ్వానాథం: నా కూతురు ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు రఘు. మా భయం చూసి ఒప్పుకుంది. నువ్వే ఏదో ఒక మార్గం చూడు రఘు. ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా నా కూతుర్ని కాపాడు.
రఘు: సార్ ఇప్పటికిప్పుడు ఈ పెళ్లి ఆపాలి అంటే ఒకటే మార్గం. మహదేవయ్యని అరెస్ట్ చేయాలి.
విశ్వానాథం: మహదేవయ్యని అరెస్ట్ చేస్తారా. 
రఘు: మహదేవయ్య, దేవా రెండు నెలల క్రితం మర్డర్ చేశాడు. ఆ కేసులో మృతి చెందిన వ్యక్తి భార్యని వెతికి కంప్లైంట్ తీసుకొని అరెస్ట్ చేస్తాం. 
విశ్వనాథం: మీనాతో.. ఏంటమ్మా అలా చూస్తున్నావ్.. కన్నతండ్రి ఏంటి కూతురి పెళ్లి ఆపాలి అని చూస్తున్నాడు అనుకుంటున్నావా.. కూతురి సంతోషం కోసం కలలు కనడమే తప్ప వాటిని నిజం చేయలేని తండ్రినిఅమ్మా నేను. ఆ రాక్షసులకు భయపడి మాకు ఏమవుతుందా అని సత్య ఈ పెళ్లి చేసుకుంటుంది. అందుకే దొంగచాటుగా ఈ పెళ్లి ఆపాలి అని ప్రయత్నిస్తున్నా..
మీన: మంచి పని చేస్తున్నారు అంకుల్. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఈపెళ్లి ఆపమని చెప్పడానికే. ఈ పెళ్లి జరిగితే సత్య తన ఒంటికి తానే నిప్పు అంటించుకున్నట్లు అవుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు పడాలో అనుభవిస్తున్నదాన్ని. ఆ బాధ నాకు తెలుసు. అందుకే సత్య విషయంలో ఈ పెళ్లి ఆపాలని ఇంత ఆరాటపడుతున్నాను. 


మరోవైపు బాలు మందు పార్టీలో మందు తాగుతుంటే మీన అక్కడికి వస్తుంది. బాలు తాగుతుంటే మందు గ్లాస్ తీసుకుంటుంది. సత్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. సత్యని ఈ సమస్య నుంచి బయట పడేయాలి అని బాలుకి చెప్తుంది. బాలు నమ్మడు. మీన మొత్తం చెప్తుంది. ఈ పెళ్లి ఆపేయమని మీన చెప్తుంది. దీంతో బాలు పెళ్లి కొడుకు మంచోడు అనుకున్నాను అని కానీ అర్హత లేదు అని అర్థమైందని వెంటనే పెళ్లి ఆపేస్తా అని వెళ్తాడు. మరోవైపు సత్య ఆరుబయట కూర్చొని ఉంటే క్రిష్ షూట్ వేసుకొని వచ్చి చేతిలో గులాబీ తీసుకొని వచ్చి సత్యకు ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 7th: కృష్ణ, మురారిలు ఒకటవ్వకుండా ముకుంద ప్లాన్.. ఇచ్చిపడేసిన మురారి, ఆదర్శ్‌ మాటలకు కృష్ణ ఎమోషనల్!