Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌కి విషయం ఎందుకు చెప్పలేదు అని కృష్ణ మురారిని అడుగుతుంది. దీంతో మురారి అసలు చెప్దామనే వెళ్లాను కానీ అక్కడ ఆదర్శ్ తన ఫ్రెండ్స్‌తో హుషారుగా మాట్లాడుతున్నాడు అని జరిగిందంతా చెప్తాడు. దీంతో కృష్ణ షాక్ అవుతుంది.
మురారి: ఆదర్శ్ అంత హుషారుగా ఉండడం చూసి శోభనం ఆపడం పాపం అనిపించింది. అయినా సరే నేను చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఇంతలో ముకుంద దూరం నుంచి మమల్నే చూస్తోంది అందుకే ఆగిపోయా..
కృష్ణ: అరే చూస్తే చూసింది. తనకి శోభనం ఆగిపోవడం ఇష్టమే కదా చెప్పేయాల్సింది.
మురారి: చెప్దామనే అనుకున్నాను కానీ తన మాటకు విలువ ఇచ్చి శోభనం ఆపేశాను అని తప్పుగా అర్థం చేసుకుంటే..
కృష్ణ: కొంపలు అంటుకుంటాయి. అప్పుడు మీరు కూడా తనని ఇష్టపడుతున్నారు అని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడేం చేద్దాం ఏసీపీ సార్ తల పగిలిపోతుంది. నేను ఆదర్శ్‌తో మాట్లాడటానికి ట్రై చేస్తా ఒప్పించడానికి ప్రయత్నిస్తా. ముకుందకు నా మీద అనుమానం లేదు కాబట్టి నన్ను ఫాలో అవ్వదు.
మరోవైపు ముకుందకు ఎవరికీ తెలీకుండా ఓ పార్శిల్ తీసుకుంటుంది. గీతక్క పంపించిన పార్శిల్ ఇదేనా అని డెలివరీ బాయ్‌కి అడిగి తీసుకుంటుంది. ఎవరూ చూడకుండా ఇంట్లోకి తీసుకెళ్తుంటుంది. ఇక కృష్ణ, ముకుంద ఒకరికి ఒకరు ఢీ కొట్టుకుంటారు. దీంతో పార్శిల్ కింద పడిపోతుంది. దీంతో ముకుంద షాక్ అవుతుంది. ఇంతలో రేవతి ఆ పార్శిల్ తీసుకుంటుంది. ఇక ఆ పార్శిల్ ఏంటని రేవతి అడిగితే నెయిల్ పాలీష్‌లు అని కవర్ చేసి దాన్ని తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. ఇక కృష్ణ రేవతికి ఆదర్శ్ గురించి అడుగుతుంది.
ఇక ముకుంద ఆ పార్శిల్‌లో వచ్చిన పౌడర్ డబ్బాను ఎవరికీ తెలీకుండా బయటకు తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఎదురుగా మురారి, మధులు మాట్లాడుకోవడంతో కంగారు పడుతుంది.
ముకుంద: మురారి కూడా బయటే ఉన్నాడు. ఇది వాళ్ల బెడ్ రూంలో పెట్టడానికి ఇదే రైట్ టైం. నన్ను టెన్షన్‌లో పడేసి నువ్వు హాయిగా నవ్వుకుంటావా మురారి ఇప్పుడెలా నవ్వుతావో నేను చూస్తాను. అని ఆ పౌడర్ డబ్బాను మురారి గదిలో పెట్టేస్తుంది. (అంతకు ముందు తన ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడి వాళ్ల శోభనం ఎలా అయినా ఆపాలి అని అంటుంది. దానికి గీతిక అనే ముకుంద ఫ్రెండ్ నేను ఓ పౌడర్ పంపిస్తా దాన్ని కృష్ణ రాసుకునేలా చేయ్ ముఖం అంతా దద్దుర్లు వచ్చేస్తాయి. అప్పుడు శోభనం కాన్సిల్ అవుతుంది అని చెప్తుంది.) అయితే అప్పుడే ముకుంద ఎదురుగా మురారి వచ్చి నిల్చొంటాడు.
మురారి: ఆగు.. చేయాల్సింది అంతా చేసేసి చల్లగా జారుకుంటే ఎలా నేను చెప్పేది కూడా వినాలి కదా. సో మా శోభనం ఆపడానికి నీకు చేతనైన చీప్ ట్రిక్స్ వాడావన్నమాట. ఏంటది ఏదో పౌడర్ డబ్బా పెట్టావు. ఓ దురదలు పుడతాయా.. మంచి ఐడియా.. అది మేం రాసుకొని మాకు దురదలు పుట్టి రాత్రంతా మేం గొక్కోని కూర్చొంటే శోభనం ఆగిపోతుంది. ఇది నీ వెదవ ఐడియా.. అంతే కదా.. కానీ నేను చూసేశానే. నీ ఐడియా వర్క్‌అవుట్ అవ్వదే దీని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. నువ్వు ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా మమల్ని విడదీయలేవు. మా శోభనం జరుగుతుంది. ఈ రోజు నుంచి మేం నిజమైన భార్యభర్తలం కాబోతున్నాం. ఇప్పుడేం చేస్తావ్ ఏమీ చేయలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా.. కాబట్టి నోరు మూసుకొని కాపురం చేసుకో..
ముకుంద: అది కలలో కూడా జరగదు మురారి.
మురారి: మరేం జరుగుతుంది. ఇంకేం చేయగలవు. ఏమైనా అంటే నేను తప్పు చేయడం లేదు నా ప్రేమను బతికించుకోవడానికి అని కబుర్లు చెప్తావ్. మరి ఇదేంటి దొంగతనంగా చేసే ఈ పనులు తప్పు కాదా..
ముకుంద: కాదు నేను ఏం చేసినా నా ప్రేమను బతికించుకోవడానికే. సారీ మన ప్రేమను బతికించుకోవడానికే.
మురారి: ప్రేమ ప్రేమ ఎప్పుడో ముగిసిపోయిన దాన్ని నువ్వు ఇంకా పట్టుకొని నీవు హ్యాపీగా లేకుండా మాకు మనస్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావ్.
ముకుంద: ఇప్పుడు ఇలాగే అంటావ్ మురారి కానీ నా ప్రయత్నాలు ఫలించి మన ప్రేమ గెలిచాక అప్పుడు నువ్వే నన్ను మెచ్చుకుంటావ్.
మురారి: మెచ్చుకోవడమా.. రోజు రోజుకు నీ మీద అసహ్యం పెరిగేలా చేసుకుంటున్నావ్. ఒక్కసారి నీ గుడ్డి ప్రేమ వల్ల మూసుకుపోయిన కళ్లు తెరచిచూడు నిన్ను అణువణువునా ప్రేమిస్తూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆదర్శ్ కనిపిస్తాడు. ఒక అద్భుతమైన జీవితం కనిపిస్తుంది. నీ మనసు మార్చుకో.
ముకుంద: చాలు ఆపు మురారి. నా మనసు ఎప్పటికీ మారదు. ఈ బతుకుకైనా రాజీనామా ఇస్తాను కానీ. నీతో బతకాలి అన్న ఆశను వదులుకోను. నా శోభనం ఎలాగూ జరగదు. మీ శోభనం కూడా జరగనివ్వను.
మురారి: జరిగితీరుతుంది ముకుంద.
ముకుంద: చూద్దాం ఎవరి పంతం గెలుస్తుందో..
ఆదర్శ్ తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తాడు. కృష్ణ వచ్చి ఆ పార్టీకి ఆదర్శ్‌ని కూడా వెళ్లమని అంటుంది. ఆదర్శ్ షాక్ అయిపోతాడు. నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు.
ఆదర్శ్: నేను ముకుంద సంతోషంగా ఉండాలి అని కోరుకునేది మీరే అలాంటి నువ్వే శోభనం రోజు నన్ను ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి పార్టీ చేసుకోమని అంటున్నావు అంటే అది నీ టెస్టింగ్ కాక ఏమనుకోవాలి.
కృష్ణ: మనసులో.. మీరిద్దరూ కలిసి ఉండాలి అని కోరుకునే మేమే మీరిద్దరూ కాస్త దూరం ఉండాలి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేయాలి ఆదర్శ్.
ఆదర్శ్: ఇందాక మురారి కూడా ముకుందని జాగ్రత్తగా చూసుకో మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పి వెళ్లాడు. అప్పుడంటే ముకుంద మనసులో నాకు చోటు లేదు అని వెళ్లిపోయాను కానీ ఇప్పుడు తన మనసు నిండా నేనే ఉన్నాను అని తెలిశాక మళ్లీ నేను వెళ్లిపోతానా..
కృష్ణ: ఇప్పుడు నువ్వు శోభనం గదిలోకి వెళ్తే మళ్లీ అదే పరిస్థితి ఆదర్శ్ అందుకే ఎలాగోలా నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నా.
ఆదర్శ్: ముకుంద చాలా మారిపోయింది కృష్ణ. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తే పొరపాటున తాగితే ముకుంద ఎంత ఫీలవుతుందో చెప్పు. నా ఫ్రెండ్సే కాదు ఆ దేవుడే పిలిచినా నా ముకుందని వదిలి నేను ఎక్కడికి వెళ్లను కృష్ణ. నేను ఇలా మారడానికి మీరే కారణం కృష్ణ. మురారి తండ్రిలా ఆలోచిస్తే నువ్వు తల్లిలా ఆలోచిస్తున్నావ్. మీరిద్దరూ నాకు కుటుంబం, బంధాల విలువ చెప్పి జీవితం అంటే కొత్తగా చూపించారు.
కృష్ణ: ఇంత ఎమోషనల్‌గా మాట్లాడితే ఏం చెప్తాం. అందుకే ఏసీపీ సార్ కూడా వచ్చేసినట్లున్నారు. ఇప్పుడేం చేయాలి. జరగబోయే ప్రమాదాన్ని ఎలా ఆపాలి.
ముకుంద రెడీ అవ్వకుండా మురారి గురించి ఆలోచిస్తుంది. పెళ్లి అయిన తర్వాత ప్రేమిస్తే తప్పు అయితే ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్లకిచ్చి పెళ్లి చేయడం కూడా తప్పేకదా. మరి నువ్వు తప్పు చేస్తే నాకు ఈ శిక్ష ఏంటి అని ముకుంద ఏడుస్తుంది. ఇంతలో రేవతి వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగి ముకుందని రెడీ చేస్తుంది. ఇక మధు వచ్చి ముకుంద రెడీ అవ్వకముందు ఓ ఫొటో అయిన తర్వాత ఓ ఫొటో ఆదర్శ్ తీయమన్నాడు అని చెప్పి మధు ఫొటోలు తీస్తాడు. ఇక ముకుంద మనసులో రేవతికి క్షమాపణలు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: తేజస్విని: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిన ట్రేడిషినల్ బ్యూటీ తేజస్విని గౌడ