Trinayani Today Episode శివుడి పూజ చేస్తే గాయత్రీ దేవి ఉనికి తెలుస్తుందని గురువుగారు త్రినయని వాళ్లకు చెప్తారు. దీంతో నయని, తిలోత్తమ వాళ్లు సంతోషపడతారు. ఇక గాయత్రీ పాప తెచ్చిన తులసి ఆకులు పనిచేయవు అని గురువుగారు చెప్తారు. దానికి నయని అంటే అర్థం తెలుసా అత్తయ్య అని అడుగుతుంది. ఏంటి అని తిలోత్తమ అడుగుతుంది.
నయని: అంటే ఏ పాము అయినా ఇక ఇంట్లోకి రావొచ్చు అని.. మహాలింగం మెడకి చుట్టేయొచ్చు అని.
విశాల్: స్వామి మీరు వస్తే పూజకి కావాల్సిన ఏర్పాట్లు గురించి మాట్లాడుకోవచ్చు రండి..
గురువుగారు: అలాగే..
సుమన: మనసులో.. అందరిని కాదని స్వామి వారితో విశాల్ బావ మాత్రమే ఏం మాట్లాడుతారో తెలుసుకోవాలి.
గురువుగారు: విశాలా ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నావ్.. సుమన వెనకాలే వచ్చి మాటలు వింటుంది.
విశాల్: మా అమ్మ గురించి తెలిసింది అని మీరు చెప్పగానే కంగారుగా అనిపించింది స్వామి.
సుమన: ఇదేంటి గాయత్రీ అత్తయ్య జాడ తెలుస్తుంది అంటే సంతోషించకుండా బావగారు టెన్షన్ పడుతున్నారేంటి. ఇంతకు ముందు కూడా తిలోత్తమ అత్తయ్య వాళ్లు గాయత్రీ అత్తయ్య గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలానే చేశారు.
గురువుగారు: విశాలా.. భగవంతున్ని స్మరించేది ఆత్మానందం కోసం.
విశాల్: ఒకరి కోరిక తీర్చాలి అనుకున్న భగవంతుడు ఇంకొకరికి ఇబ్బంది కలిగించడు కదా స్వామి.
గురువుగారు: అందుకే నిరాశ నిస్ఫుహాలకు లోనవుతున్నారు అని చెప్తున్నా.. ఏది న్యాయమో ఏది ధర్మమో లోకపాలకులు అయిన పార్వతీ పరమేశ్వరులకు తెలుసు కదా.
విశాల్: శివపూజ చేస్తే మాత్రం మా అమ్మ గురించి తెలియడం ఎందుకు. అది ఎవరికి మంచిది. ముంచే వాళ్లే ఎక్కువ ఉన్నారు ఈ ఇంట్లో.
సుమన: బావగారు పైకి జాలి దయతో ఉన్నట్లు ఉంటారు కానీ ఎవర్ని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు.
గురువుగారు: గాయత్రీ దేవి పునర్జన్మలో ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి అని నీ ధర్మపత్ని నయని కూడా ఎదురుచూస్తుంది కదా.
విశాల్: నయనికి సత్యం తెలీదు కానీ నిజం తెలుసు. అది వాస్తవం అన్న అసలు విషయం తెలీదు.
సుమన: ఒకే మాటను అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నట్లు ఉంది. ఇందులో ఏదో అర్థం ఉంది అనిపిస్తుంది. మా అమ్మ ఎంత ధైర్యం కలదో ఎంత మొండి మనిషో నాకు బాగా తెలుసు.
గురువుగారు: మీ అమ్మ తనే అని తెలుస్తుంటే ఆ అదృష్టాన్ని నువ్వు వద్దు అంటున్నావు.
విశాల్: వద్దు స్వామి. దయచేసి మా అమ్మ కోసం తెలీకూడదు. నయనికి కూడా ఇప్పుడప్పుడే చెప్పకూడదు అని ఆగిపోయాను.
సుమన: అమ్మో అంటే బావగారికి గాయత్రీ అత్తయ్య ఎక్కడుందో తెలుసన్నమాట. అంటే ఇందులో గురువుగారికి వాటా ఉండనే ఉంది. ఇద్దరూ కలిసి మా అక్కకు కూడా నిజం తెలీకుండా దాస్తున్నారు. దానివల్ల లాభం ఏంటో నాకు తెలియాలి.
గురువుగారు: విశాల కొన్ని అనుకోని సంఘటనల ద్వారా ఎవరి దర్శనం కలుగుతుందో చూద్దాం.. మీరు అయితే పూజ ఏర్పాట్లు చేయండి.
సుమన: మీరు ఏం చేస్తారో చూస్తాను నేను నాకు వచ్చే బంగారు అవకాశం కోసం ఎదురు చూస్తా అప్పుడు మిమల్ని నా గుప్పెట్లో పెట్టుకుంటా..
అఖండ: నేనొక జలం ఇస్తాను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేస్తే ప్రమాదం జరుగుతుంది.
తిలోత్తమ: అంటే ఏవిధంగానో కాస్త వివరిస్తారా స్వామి.
అఖండ: ఈ జలాన్ని పూజ పూర్తి అయ్యాక గాయత్రీ జాడ తెలుస్తుంది అని గురువుగారు అన్నప్పుడు ఈశ్వరనామ్మాన్ని స్మరిస్తూ శివలింగం మీద ఈ జలం వేయండి. పూజ పూర్తి కాకముందు ఈ జలం మహాశివలింగం మీద జల్లితే పక్కన ఉండే వారి మీద ఈ జలం పడితే వారు వికృత వినాశనంగా మారిపోవచ్చు.
వల్లభ: అబ్బో అలాంటప్పుడు జాగ్రత్తగా వాడుతాం.
అఖండ: కంగారు పడకండి ఈ జలాన్ని తీసుకెళ్లి గాయత్రీ దేవి ఉనికి తెలుసుకోండి.
ఇక తిలోత్తమ అఖండ స్వామి ఇచ్చిన జలాన్ని గాయత్రీ దేవి జాడ తెలుసుకోవడం కోసం కాకుండా విశాల్ మీద వాడాలి అని నిర్ణయించుకుంటుంది. ఇక సుమన రెడీ అవుతుంటే విక్రాంత్ వచ్చి పనులు చేయమని చెప్తాడు. దీంతో సుమన వాదిస్తుంది. ఇక హాసిని వస్తే తన భర్తని ఇద్దరు వదినలు కలిసి నాకు దూరం చేసేశారు అని సుమన మండిపడుతుంది.
ఇక తిలోత్తమ అఖండ స్వామి ఇచ్చిన జలాన్ని శివలింగం మీద పెట్టనున్న శిరోధార పాత్రలోని నీటిలో వేసేస్తుంది. మరోవైపు అమ్మవారిలా రెడీ అవుతున్న నయని దగ్గరకు తిలోత్తమ వెళ్తుంది. నయనిని పొగుడుతుంది తిలోత్తమ. ఇక ఎందుకు వచ్చారు అని నయని అడిగితే దిష్టి పెట్టడానికి అని తిలోత్తమ అంటుంది. ఇక తిలోత్తమ విశాల్ ప్రాణం తీసుకుంటాను అని అంటుంది. నయని షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.