Guppedantha Manasu March 7th Episode: (గుప్పెడంతమనసు మార్చి 7th ఎపిసోడ్)
మను అడ్డు తప్పించి వసుధారను తన సొంతం చేసుకోవడానికి కొత్తజంట అంటూ పోస్టర్స్ కాలేజీ గోడలపై అతికిస్తాడు. ఈ విషయం శైలేంద్రకి చెబితే అయిపోతుంది అనుకుని కాల్ చేస్తాడు కానీ శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈ పోస్టర్స్ అన్నింటినీ వీడియో తీసి భయ్యా దగ్గరకు వెళ్లి చూపిస్తాను అంటూ మొత్తం వీడియో తీస్తాడు. రేపటితో నాకు పట్టిన శని వదలబోతుంది. నువ్వు నా సొంతం కాబోతున్నావని వసుధారను ఊహించుకుని ఆనందపడతాడు రాజీవ్. అర్థరాత్రి శైలేంద్ర ఇంటికి దొంగచాటుగా వెళతాడు. ఆ టైమ్ లో రాజీవ్ ను చూసిన శైలేంద్ర అరుస్తాడు...ఆ అరుపు విని ధరణి నిద్ర లేస్తుంది..ఎవరో ఇంట్లోకి వచ్చినట్లుగా తనకు అనిపించిందని అనుమానపడుతుంది. ధరణికి కనిపించకుండా మంచం కింద దాక్కుంటాడు రాజీవ్. అనుకోకుండా రాజీవ్ చేతిని ధరణి తొక్కేస్తుంది. బాధతో రాజీవ్ అరుస్తాడు. ఆ అరుపు విని ధరణి కంగారు మరింత పెరుగుతుంది. మంచం కిందకు చూడబోతుంటే ఆమెను శైలేంద్ర ఆపేస్తాడు. నిద్రమత్తులో నీకు అలా అనిపించింది అంతే అని చెప్పి..నువ్వెళ్లి ట్యాబ్లెట్స్ తీసుకురా అని చెప్పి పంపించేస్తాడు...
ధరణి వెళ్లిపోగానే బ్రదర్ బయటకు రా అని పిలిచి బయటకు లాక్కెళతాడు...
శైలేంద్ర: ఈ టైమ్‌లో ఇంటికి ఎందుకొచ్చావని రాజీవ్‌పై సీరియస్ అవుతాడు.
రాజీవ్: కాలేజీలో నేను చేసిన పని గురించి నీకు చెప్పాలనే వచ్చానంటూ...వసుధార, మను పోస్టర్స్ కాలేజీలో అంటించిన వీడియోను శైలేంద్రకు చూపిస్తాడు
శైలేంద్ర: ఆ వీడియో చూసి ఆనందపడతాడు. ఇప్పటివరకు మనం వేసిన ప్లాన్స్ ఓ ఎత్తు అయితే...ఈ ప్లాన్ మరో ఎత్తు. ఈ ప్లాన్ ఫెయిలయ్యే సమస్యే లేదు
రాజీవ్: రేపు వసుధార నా సొంతం, ఎండీ సీట్ నీ సొంతం అంటూ రాజీవ్ ని పొగిడేసి ఇక నువ్వెళ్లు అని పంపించేస్తాడు...
ALso Read: 'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!
స్టూడెంట్స్ అందరూ గుంపులుగా వెళ్లడం చూసి ఓ లెక్చరర్ పిలిచి ఏమైందని అడుగుతాడు...కాలేజీ గోడలపై ఎవో పోస్టర్స్ అంటించి ఉన్నాయని చెప్పడంతో అందరూ అటు వెళతారు....
మరోవైపు కాలేజీకి తొందరగా రెడీ అవమని చెప్పాను కదా అని అరుస్తుంటాడు శైలేంద్ర..ఇంతలో వచ్చిన దేవయాని ఏంటో చాలా హ్యాపీగా ఉన్నావ్ ఎందుకో చెబితే నేను కూడా హ్యాపీగా ఫీలవుతా అంటుంది దేవయాని. ఇంతలో ధరణి నేను రెడీ అంటూ వస్తుంది. తనని కాలేజీకి తీసుకెళ్లడం నమ్మశక్యంగా లేదంటుంది దేవయాని. అలా అంటావేంటి ఇదేం బాలేదు...తనకి బయట ప్రపంచాన్ని చూపించాలి కదా అని రిప్లై ఇస్తాడు. కాలేజీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని, ఆ సెలబ్రేషన్స్ ఏమిటో మేము వచ్చిన తర్వాత నీకే అర్థమవుతాయని ఆశీర్వదించమని అడుగుతాడు. దేవయానితో శైలేంద్ర మాటతీరు చూసి ధరణి అలాగే చూస్తుంటే ఏంటి షాకయ్యావా అని అడుగుతాడు...
దేవయాని: నేను కూడా వస్తాను
శైలేంద్ర :నీకెందుకు శ్రమ..నువ్వు ఇక్కడే ఉండు
దేవయాని: నేను రావాలి అనుకుంటున్నాను
శైలేంద్ర: ధరణి చూస్తే సరిపోతుంది..వచ్చాక పూసగుచ్చినట్టు నీకు చెబుతుంది
దేవయాని: వెళుతూ వెళుతూ చంకలో పిల్లెందుకు
శైలేంద్ర: తను నా పక్కన ఉండడం నాకు అవసరం
దేవయాని: అంటే తల్లిని దూరం పెడుతున్నావన్నమాట..నువ్వు మారిపోయావ్..అందుకే ఎప్పుడూ నా మాట కాదనని నువ్వు నా మాట లెక్కచేయడం లేదు
శైలేంద్ర: ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు..నిన్ను కాలేజీకి తీసుకెళ్లడం కుదరదు
Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!
రాజీవ్ అంటించిన పోస్టర్స్ పై కాలేజీలో పెద్ద రచ్చ జరుగుతుంది. కొత్త ప్రేమ జంట అంటూ పోస్టర్స్‌పై శైలేంద్ర కామెంట్స్ చేస్తాడు. అనుపమ ఫైర్ అవుతుంది. అప్పుడే కాలేజీకి వచ్చిన వసుధార ఆ పోస్టర్స్ చూసి షాకవుతుంది. కావాలనే మనపై కక్ష గట్టి ఎవరో ఈ పోస్టర్స్ అంటించారని మహేంద్ర ఆవేశ పడతాడు. పోస్టర్స్ చించబోతుంటే శైలేంద్ర అడ్డుకుని... ఒక్క పోస్టర్ చించేయడం వల్ల ఉపయోగం లేదని, కాలేజీ మొత్తం ఈ పోస్టర్స్ అంటించారని అంటాడు. అప్పుడే మను కాలేజీలోకి అడుగుపెడతాడు. తను కూడా పోస్టర్స్ చూసి షాకవుతాడు. ఈ పోస్టర్స్ మనునే అంటించాడని స్టూడెంట్స్, లెక్చరర్స్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. అందరూ అదే నిజమని నమ్ముతారు...తాను అంటించలేదని చెప్పినా ఎవ్వరూ వినరు...
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది... గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్ లో అసలు విషయం తెలుస్తుంది...ఆ పని మను చేయలేదని వసుధార నమ్ముతుందో లేదో మరి...